T.v. Teliyani Pullayya

T.v. Teliyani Pullayya

****************************

ఒక పల్లెటూరి నుండి పుల్లయ్య అనే రైతు పట్నం వచ్చాడు.

పట్నంలో అతనికి ఏదైనా కొనాలపించింది. దాంతో ఒక షాపుకి వెళ్ళాడు.

షాపతన్ని " సార్...ఆ టీ.వి. ఎంత ?" అని అడిగాడు పుల్లయ్య.

ఆ షాపతను, పుల్లయ్యను ఎగాదిగా చూసి " అది అమ్మడానికి కాదు" అన్నాడు.

కాని పుల్లయ్యకు మాత్రం దానిని కొనాలనిపించింది. వెంటనే బయటికి వెళ్లి కాసేపటి తరువాత ఒక సిక్కువాడి వేషం వేసుకుని మళ్ళీ ఆ షాపు లోపలికి వచ్చాడు.

" సార్...నా ఆ టీ.వి.కావాలి " అన్నాడు సిక్కువాడి వేషంలో ఉన్న పుల్లయ్య.

" భలేవాడివే..ఇంతకు ముందు ఒకసారి చేపాను కదా...అది అమ్మడానికి కాదు" అన్నాడు ఆ షాపతను.

వేషం మార్చినా తనని ఆ షాపు అతను ఎలా గుర్తు పట్టాడో అర్థం కాలేదు పుల్లయ్యకి.అయినా ఆశ చావక కాసేపటి తరువాత బుడబుక్కల వేషం వేసుకుని వచ్చి " అయ్యా...ఆ టి.వి.ని ఎంతకు అమ్ముతారేమిటి ?" అన్నాడు పుల్లయ్య.

" మళ్ళీ వేషం మార్చుకుని వచ్చావన్న మాట. అది మాత్రం నీకు అమ్మనయ్యా " అన్నాడు ఆ షాపతను.

అలా మరోరెండు వేషాలు మార్చాడు పుల్లయ్య. ఆ షాపతను గుర్తు పడుతూనే ఉన్నాడు. చివరిగా ఆ షాపతనితో " అయ్యా...నేనిప్పటికీ ఐదువేషాలు మార్చాను. ప్రతిసారి మీరు నను గుర్తుపట్టేస్తున్నారు. మీరు నాకా టి.వి.ని అమ్మకపోయినా పరువాలేదు. నన్నెలా గుర్తు పట్టారో మాత్రం చెప్పండి " అన్నాడు పుల్లయ్య.

ఆ షాపతను దానికి నవ్వుతూ " చూడు..ఈ లోకంలో దాన్నేవడూ కూడా టి.వి. అనడు. అది మా షాపులో అవసరాన్ని బట్టి పెట్టిన రిఫ్రిజిరేటర్ " అని అసలు విషయం చెప్పాడు.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు పుల్లయ్య.