Just For Fun

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

జస్ట్ ఫర్ ఫన్

తప్పిపోయిన గాడిద

కోనే నాగ వెంకట ఆంజనేయులు

ఓ గాడిద ఓ ఇంటి ముందు నిలబడి ఉంటే,అదే రూట్లో వెళ్తున్న మరో గాడిద ఆగి అడిగింది"ఏంటి ఇక్కడ నించున్నావ్?”అని.

“మా అబ్బాయి నిన్నట్నుంచీ కనబడడం లేదు గురూ.!ఈ ఇంట్లోంచి నువ్వు గాడిదకొడుకువంటే నువ్వే గాడిద కొడుకువని మాటలు వినబడుతున్నాయి.బయటికి వస్తే మావాడెవడో గుర్తు పట్టి తీసుకెళ్దామని వెయిట్ చేస్తున్నాను "అని చెప్పింది రెండో గాడిద.

***********************************************************************

తోకలేని కోతులు - బుర్ర లేని వేటగాడు

తోకలేని కోతుల్ని పట్టి జంతు ప్రదర్శనశాలకు ఇవ్వటం కోసం ఒక వేటగాడిని నియమించారు

.ఆ వేటగాడు ఓ విన్నూతమైన పథకాన్ని ఆలోచించి ఆ పద్దతిలో వాటిని పట్టుకోదలచాడు.దానికి కావలసిన సరంజామా కేవలం ఓ గోనెసంచి,ఒక తుఫాకి మరియు చూడగానే మీద పడిపోయే స్వభావం గల ఒక కుక్క మాత్రమే.

ఆ వేటగాడు తన అసిస్టెంట్ తో కలిసి అడవికి వెళ్లాడు.తోకలేని కోతులు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లారు వాళ్లిద్దరూ.

“నేను చెట్టెక్కి కొమ్మల్ని గట్టిగా ఊపుతాను "అన్నాడు వేటగాడు.

“ఆ చెట్టు మీద ఏమైనా తోకలేని కోతులున్నాయనుకో...అవి కింద పడతాయ్...వెంటనే మన కుక్క ఉంది కదా.అది ఉన్న ఫళాన వచ్చివాటి మీద పడి,వాటిని కరిచి అవి శక్తిని కోల్పోయేలా చేస్తుంది. అప్పుడు వాటిని నువ్వు పట్టుకుని మనం తెచ్చుకున్న గోనెసంచిలో వేయవచ్చు...”పథకం వివరంగా చెప్పాడు వేటగాడు.

“మరి తూఫాకీ నా దగ్గర ఎందుకు?” అర్థంగాక అడిగేడు అసిస్టెంటు.

“ఒకవేళ నేను పట్టుదప్పి పొరబాటున చెట్టు మీదనుంచి కింద పడ్డానే అనుకో...నువ్వు ఆ తుఫాకీతో కుక్కని కాల్చెయ్ "చెప్పాడు వేటగాడు.

(హాసం సౌజన్యంతో)