Navvule-Navvulu 11

నవ్వులే నవ్వులు - 11

పైకొచ్చిన కొడుకు

“మీరు రిటైర్ అయ్యారు కదా!మీ అబ్బాయి ఏమైనా పైకొచ్చాడా?”అడిగాడు సుందరం.

“ఆ...మొన్నకొట్టడానికి పైకొచ్చాడు"అని చెప్పి నాలిక్కరుచుకున్నాడు.

పెళ్లి చేసుకుని

“రవిని అంతు చూస్తానని బెదిరించావు కదా!ఎలాగ చూస్తావేమిటి ?”అడిగింది ప్రసన్న.

“పెళ్లి చేసుకుని "ఠక్కున చెప్పింది విజయ.

పచ్చగడ్డి వంట

“ఏవండోయ్ యిది విన్నారా?ఓ స్వామీజీ ఆకలికి తట్టుకోలేక పచ్చగడ్డిని తిన్నాడట.వింతగా లేదు?”

అంది భార్య.

“అందులో వింతేముంది?రోజూ నేను నీ వంటని తినట్లేదా!”అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు

భర్త.

తాపిమేస్త్రి

“నా దగ్గర మేకప్ మెన్ గా పని చేస్తానంటున్నావు.అనుభవం ఉందా?”అడిగాడు హిరో.

“ఉండండి.గత పదిహేడేళ్ళుగా తాపిమేస్త్రిగా పనిచేస్తున్నానండి "అన్నాడు పాపారావు.

“ఆఁ...”అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు.

దొంగబుద్ధి ఫ్యామిలీ

“వందరూపాయలు పోయాయి.నువ్వు తీశావా ?”అడిగాడు తండ్రి.

“నాకలాంటి బుద్దుల్లేవు.నేనెప్పుడూ చిల్లర పైసలే తీస్తా...అమ్మనడిగి చూడు "టక్కున అన్నాడు ఆ

కొడుకు.