Nenu Puttanu

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

( "ప్రేమ్ నగర్'' చిత్రంలోని ''నేను పుట్టాను "పాటకు పేరడీగా...)

నేను పుట్టాను

తాళాభక్తుల లక్ష్మీప్రసాద్

నేను పుట్టాను,బోల్డప్పులు చేసాను

నేను పెరిగాను,బిల్డప్పులు ఇచ్చాను

నేను తిరిగాను ఆ అప్పులు పెంచాను

నాకింకా ఈ ఊర్తో పని ఏముంది...

డోంట్ కేర్... నేను పుట్టాను

నేను ఎదురైతే కొందరు నన్ను ఉతికారేస్తారు

నేను కనిపిస్తే కొందరు నన్ను కాల్చుకు తింటారు

నేను దొరికితే అందరు కలిసి పాతరవేస్తారు

తెల్లవారితే ఈడ్చుకుపోయి పాతి పెడతారు

డోంట్ కేర్...నేను పుట్టాను

అప్పులు దాచేటందుకే పైపై గొప్పలు ఉన్నాయి

అసలుకె ఎసరును పెట్టెటందుకె కిటుకులు ఉన్నాయి

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికె టోపిలోస్తాయి

ఎదుటిమనిషిని పూడ్చేటందుకె స్కీములు వున్నాయి

డోంట్ కేర్...నేను పుట్టాను

మనిషిని మనిషి ముంచేటందుకె అప్పులు ఉన్నాయి

అప్పులు రెట్టింపయ్యేటందుకె వడ్డీలున్నాయి

సామాన్లన్నీ మూటల్లో రాత్రే కుక్కేసెయ్

ఊరు వదిలి చెక్కేసెయ్ !

నీలో భీతిని తరిమేసేయ్ !

డ్రైవ్ ది ఫియర్ అవుట్...

అహ్హహహహ ...నేను పుట్టాను

(హాసం సౌజన్యంతో)