Guitar Vadyam

గి'ఠారు' వాద్యం

సోమయాజుల సాయిప్రసాదు

ఇద్దరూ హిప్పీలు ''జూ ''కు వెళ్లారు.

అందులో ఒకతని చేతిలో ఒక గిటార్ వుంది.

ఆ జూ యజమానితో " మా ప్రెండ్ గిటారు వాయించటంలో ఎంత నేర్పరి అంటే అతని ప్రతిభకు మనుష్యులే పరవశించడమే కాకుండా క్రూర జంతువులు కూడా సాధు జంతువులై పోతాయంటే నమ్మండి " అన్నాడు ఒక హిప్పీ.

“ ఏదీ పరీక్షిద్దాం " అని జూ యజమాని అతన్ని ఒక పెద్దబోనులో ఉంచాడు.

ముందుగా ఒక సింహాన్ని వదిలాడు. అది అమాంతం అతని మీద పదే సమయంలో మన హిప్పీ గిటారు వాయించడం మొదలు పెట్టాడు. దాంతో ఆ సింహం తన్మయత్వం చెంది,ఆనందంతో నృత్యం చేయడం మొదలు పెట్టింది.

అది చూసిన యజమాని,వెంటనే రెండవ సింహాన్ని కూడా ఆ పెద్దబోనులోకి వదిలాడు.

ఆ సింహం కూడా తన్మయత్వం చెంది, ఆనందంతో తన భాషలో పాడటానికి కూడా ప్రయత్నించసాగింది. ఆశ్చర్యంలో మునిగిన ఆ జూ యజమాని వెంటనే మూడవ సింహాన్ని కూడా వదిలాడు.

వెంటనే ఆ సింహం అమాంతం హిప్పీ మీద విరుచుకుపడి,గిటారును పక్కకు విసిరేసి,ఆ హిప్పీని లటక్కున మింగేసింది.

మొదటి హిప్పీ గుండెలు ఠరుమన్నాయి.

“ ఇదేంటి సార్ ? ఇలా జరిగింది ? ” అన్నాడు వణుకుతూ.

“ క్షమించరాని ఘోరం జరిగిపోయింది సార్ !ఆ మూడవ సింహానికి బ్రహ్మ చెముడు.దానికేం వినబడదు " అన్నాడు జూ యజమాని నాలిక్కరుచుకుని.