హలో... రాంగ్ నెంబర్.! - 5

Get latest telugu famous comedy serials, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 4

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

మ్యూజిక్ కి అనుగుణంగా బెల్లీ డ్యాన్స్ చేసే లేడీ మేకప్ తో, లేటెస్ట్ డ్రెస్ తో వచ్చింది.
అరబిక్ సాంగ్ కి అనుగుణంగా డాన్స్ చేసింది. మరోసాంగ్ మొదలవగానే ఆడియన్స్ ని పిలిచింది ఎంకరేజ్ చేస్తూ.
కుర్రాళ్ళు, టీనేజ్ అమ్మాయిలు, ముసలాళ్ళు కూడా ఆ వూపుకి ఉత్సాహంగా ఆమెతోపాటు డాన్స్ చేయడం మొదలుపెట్టారు.
మరింత ఫాస్ట్ బీట్ వున్న అరబిక్ సాంగ్ స్టార్ట్ అయింది.
శ్రీకర్ చేయి లూసీ నడుం మీద వుంది. తన ఎడమచేతిని ఆమె కుడిచేతిలో బిగించి, ఆమెతో అడుగులు కడుపుతున్నాడు. అతని చేయి ఆమె నడుమును తడుముతోంది ప్రయత్న పూర్వకంగానే !
"లూసీ...ఈ రాత్రి...ఈ ఎడారిలో నీతో డ్యాన్స్...గ్రేట్ మెమరీ...స్వీట్ మెమరీ...మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను."
ఆమె అడుగుల కదలిక అతనికి చిత్రంగా అనిపిస్తోంది. ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలు...అతనికి వేడిగా తగులుచున్నాయి.
ఆమె బెల్లీ డ్యాన్స్ లో నిష్ణాతురాలన్న విషయం కాస్త ఆలస్యంగా అర్థమైందతనికి.
*             *                   *
బఫే డిన్నర్ పూర్తయింది. కొందరు ఇసుక మీద వేసిన పరుపుల్లో సేద తీరుతున్నారు. లూసీ ఆ టెంట్ కు దూరంగా వచ్చింది. ఇసుక మీద పడుకుంది. చేతులు తలక్రింద దిండులా పెట్టుకొని ఆకాశం వైపు చూస్తోంది. దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తోన్న శ్రీకర్ కు ఓ అద్భుత చిత్రకారుడి సృష్టి కనిపించింది. ఒంపు తిరుగుతూ ఎత్తుపల్లాలతో అందమైన డిజైన్ లా వుంది ఎడారి ఇసుక.
ఆకాశం...ఎడారి...రెండూ రెండు పెదవులై చుంబిస్తోన్నట్టు వుంది. వాటి కలయికలో అద్భుతమైన ఇంద్రధనుస్సు ఏర్పడ్డట్టు వుంది లూసీ భంగిమ.
ఆకాశంలోని చందమామే అబ్బురంగా లూసీ వైపు చూస్తోన్నట్టు అనిపించింది. ఎక్కడో చదివిన జానపద కథల్లోని సన్నివేశం కళ్ళముందు కదలాడుతున్నట్టుంది.
శ్రీకర్ లూసీ దగ్గరకి నడిచాడు. హైహీల్స్ ని ఓ పక్కన విదిచేసింది. ఆమె తెల్లటి పాదాలు ఇసుకలో పడి మరింత మెరిసిపోతున్నాయి. పసిమిదేహ ఛాయ ఆమె అందానికి ఫినిషింగ్ టచ్ లా వుంది. అతని మనసూ, శరీరమూ అదుపు తప్పుతున్నాయి. ఈ వాతావరణం...ఈ అవకాశం...అతడ్ని తప్పుచేయమంటున్నాయి. తప్పుచేయడానికి అతీతమైన పురుషుడేం కాదతను.
*              *                 *
"లూసీ..." ఆమె పక్కనే ఇసుకలో కూచుంటూ పిలిచాడు శ్రీకర్.
వెంటనే లూసీ సర్దుకుని "మీరా సర్..." అంటూ లేవబోయింది.
"పర్లేదు...ఫీల్ ఫ్రీ..." అంటూ ఆమె భుజం పట్టుకుని అన్నాడు. అయినా లూసీ లేచి కూచుంది.
"లూసీ నువ్వింత అందంగా ఎందుకున్నావు?" అతని ప్రశ్న ఆమెకర్థం కాలేదు.
"ఏమిటి సార్ మీరనేది?"
"నువ్వింత అందంగా ఎందుకున్నావని అడుగుతున్నాను. నిజం లూసీ. నీది చాలా మంచి అందం. వయసుతో వచ్చిన అందం కాదిది. బహుశ వ్యక్తిత్వంతో, అసాధారణ తెలివితేటలతో వచ్చిన అందం అయివుంటుంది."
"అమ్మాయిల అందం గురించి మీకు బాగా తెలిసినట్టుందే" అంది నవ్వుతూ లూసీ.
"యూ ఆర్ కరెక్ట్ లూసీ. కొందరమ్మాయిలు వయసులో వచ్చే ఆకర్షణ వల్ల అందంగా కనిపిస్తారు. మరికొందరు అలంకరణల వల్ల....స్టేటస్ వల్ల అందంగా కనిపిస్తారు. మరికొందరు వినయం వల్ల. ఇంకొందరు వినయం, తెలివి, వ్యక్తిత్వం....ఈ మూడింటి వల్ల...నీ అందం ఈ కోవకే చెందుతుంది."
ఇలా ఎంతమంది అమ్మాయిలతో చెప్పారు సార్" అడిగింది నవ్వుతూనే లూసీ.
శ్రీకర్ దెబ్బతిన్నట్టు చూసాడు. అతని మొహం ఒక్క క్షణం జీవురు రంగులోకి మారింది.
"సారీ సర్...నా వుద్దేశం..."
"నీ వుద్దేశాన్ని నేను ప్రశ్నించడం లేదు లూసీ. ఏ మగాడు అయినా అమ్మాయిని పదే పదే పొగిడితే ఇలాంటి డౌట్సే వస్తాయి. అందుకు నేనేమీ మినహాయింపు కాదు. అమ్మాయిలతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి మగవాళ్లు ఉపయోగించే ఆకర్షణీయ పదం 'పొగడ్త' సానుభూతి పొందడం ద్వారానో...అమ్మాయిలను ట్రాప్ చేస్తారు."
"చాలా ఓపెన్ గా, సిన్సియర్ గా చెబుతున్నారే..."
"ఇందులో సిన్సియారిటీ ప్రస్తావన ఏమీ లేదు. నేను ఫీలయ్యేది చెబుతున్నాను. నేనెప్పుడు పెళ్ళి కాని బ్రహ్మచారిననో...పెళ్ళి చేసుకుంటాననో ఏ అమ్మాయితోనూ చెప్పలేదు. నాకు అమ్మాయిలంటే ఇష్టం. యస్. నేను ఉమనైజర్ నే. ఐ లైక్ విమైన్...దట్సాల్."
లూసీ అతని వైపే చూస్తూండిపోయింది. ఆమెకు తెలుసు. మగవాళ్ళ మనస్తత్వం. జాలితో మొదలెట్టి, పొగడ్తతో కంటిన్యూ చేసి, శారీరక సాన్నిహిత్యాన్ని ముడిపెట్టి, ఆ ఆతర్వాత మొహం చాటేసే మగవాళ్ళ నైజం తెలుసు. కానీ ఇలా ఓపెన్ గా చెబుతోన్న వ్యక్తిని ఫస్ట్ టైం చూస్తోంది.
"ఏంటి లూసీ ఆలోచిస్తున్నావు. రెండ్రోజులుగా నీ కోసం ట్రయ్ చేస్తున్నాను. సారీ...ఇలా అన్నానని హర్ట్ అవ్వొద్దు...మనసులో ఒకటి వుంచుకొని మరొకటి చెప్పడం నాకు చేతకాదు. నీకో విషయం తెలుసా లూసీ....ఇక్కడి బ్రాంచీ ఆఫీసు విజిట్ చేయడానికి నేను ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకొచ్చానంటే జస్ట్ ఫరే చేంజ్..బట్ నీలాంటి అందమైన అమ్మాయి తారసపడుతుందని అనుకోలేదు."
అతడ్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు.
"ఏంటి...నేను మంచి చెడ్డవాడ్నిలా అనిపిస్తున్నానా?" అడిగాడు క్యాజువల్ గా నవ్వుతూ.
లూసీ నవ్వింది. ఈ నవ్వు అతడ్ని మరింత టెంప్ట్ చేసింది.
"లూసీ...ఒక్కసారి నీ బుగ్గల మీద ముద్దుపెట్టుకోనా?" అడిగాడు శ్రీకర్.