TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Telugu Comedy Audio Serial
(1).jpg)
18 భాగం
" అట్లాగా అని ఆప్టరాలన్నట్టు తీసిపారేస్తావే ? మా ఆంటీకి ఎంత పేరుందో తెలుసా ? పెద్ద పెద్ద పట్నాలన్నిట్లోనూ నాట్య ప్రదర్శనలిచ్చింది. నాగిని నాట్యం చేస్తే గీస్తే ఆంటీయే చేయాలి "
" నాగిని నాట్యమంటే ?"
" పాము డాన్సన్నమాట. ఆంటీ నాగిని నాట్యం చేస్తే, ఆ నాట్యానికి తప్పనిసరిగా పాము వస్తుంది "
" ఎందుకు ?"
" ఎందుకేమిటి ? అదంతా ఆంటీ నాట్య మహిమన్న మాట ?"
" అబ్బా...అయితే మీ ఆంటీ గొప్ప డాన్సరే ! అవునూ ఆమె ఎక్కడ ఆ డేన్సు చేసినా వస్తుందా పాము "
" వస్తుంది. బొంబాయిలో వచ్చింది.కలకత్తాలో వచ్చింది. మనదేశంలోనే కాదు లండన్, పారీస్, న్యూయార్క్ "
" అక్కడా కూడానా ?"
" ఎక్కడ చేసినా వస్తుందని చెప్పెనుగా "
" మీరు పాములేమైనా పెంచుతున్నారా "
" ఛీ పాడు..అదేం అట్లా అడిగావు "
" పెంపుడు పాములైతే ఎక్కడ చేసినా వస్తాయి గదా "
" అంటే ఏమిటి నీ ఉద్దేశం ? పెంపుడు పాములతో జనాన్ని మోసగిస్తున్నామనుకుంటూన్నావా ?" అని మూతి ముడుచుకుంది వసుంధర.
నోరు జారినందుకు బాధపడ్డాడు కిష్ణుడు.అప్పుడు చూసేడు. నడిరోద్దుమీద జనాలు ఆగిపోయి తననీ, వసుంధరని తమాషాగా చూస్తున్న ఘట్టాన్ని! వెంటనే మాట మార్చి వసుంధరతో అన్నాడు " మనమిట్లా మాట్లాడుకుంటుంటే వాళ్లకి చోద్యంలా ఉంది. సైకిలేక్కు ఇంటికి పోదాం " అని.
వసుంధర కూడా జనాన్ని చూసి సిగ్గుపడింది. వెంటనే సైకిల్ ఎక్కింది. ఇద్దరూ మెల్లిగా సైకిళ్ళూ తొక్కుకుంటూ వస్తున్నారు. దార్లో కిష్ణుడు ప్రారంభించేడు " వరూధినీ ప్రవరాఖ్య నృత్య నాటికంటే నాకెంతో ఇష్టం " అని.
" అట్లాగా ! మా ఆంటీకి ఆ నాటిక ఆరో ప్రాణం. ప్రతి ప్రోగ్రాంలో ఆ నాటికలో ఒక భాగం తప్పని సరిగా చేస్తుంది "
" ప్రవరాఖ్యుడిగా ఎవరు నటిస్తారు "
" ఒక్కరే అనే మాటేముంది ? ఎవరు దొరికితే వారే "
" మగవాళ్ళేనా "
" ఉహూ...ఆడవాళ్ళతోనే చేయిస్తుంది. ఆంటీ ట్రూపులో అందరూ ఆడవాళ్లే ?"
" అంటే ?ఇంతవరకు మీ ఆంటీ మగ ప్రవరాఖ్యుడిని పెట్టుకోలేదా "
" ఎప్పుడో కాలేజిలో చదివేటప్పుడు ఒకసారి మాత్రం మగ ప్రవరాఖ్యుడే చేశాడట ?
" ఎవరతను ?"
" నాకేం తెలుసు ? అయినా ఈ వివరాలన్నీ నీకు ఎందుకు ?"
" తోచక! అదిసరే నీక్కూడా డాన్స్ వచ్చా ?"
" మా ఆంటీ అంత పెద్ద డాన్సర్ అయితే నాకు ఆ మాత్రం డేన్స్ రాకుండా పోతుందా ?"
" నాకు నేర్పుతావా "
" నేర్చుకోవాలనుకుంటే మా ఆంటీ వుంది కదా "
" ఆవిడ వద్దు. నువ్వు నేర్పితేనే నేర్చుకుంటా " వసుంధర ఆమాటకి కిలకిలా నవ్వేసింది.
నవ్వి అన్నది " అట్లాగే " అని కిష్ణుడు ఆకస్మాత్తుగా ఆగిపోయాడు.
" ఆగిపోయావే ?" వసుంధర అడిగింది.
" ఇల్లు దగ్గర పడ్డాయిగ, ముందు నువ్వెళ్ళు. తర్వాత నే వస్తా "
" మా ఇంటికి రావూ ? మా ఆంటీని పరిచయం చేస్తాను "
" అమ్మో "
" అమ్మో ఏమిటి ?"
" అదంతేలే ! ఆడవాళ్ళతో మాట్లాడితే మా అన్నయ్య వూరుకోడు "
" అదేం పాపం "
" అదో రకమైన పాపం ! అదంతా తర్వాత చెబుతాను గానీ నువ్వెళ్ళిపొ ! రేపు సరిగ్గా తొమ్మిది గంటలకు కాలేజీకి కలిసే వెళదాం "
" ఓకే ! చర్చిలో తొమ్మిది గంటలు వినిపించగానే నీ సైకిల్ నా సైకిల్ రోడ్డు మీద వుండాలి "
" సైకిళ్ళతో పాటు మనం కూడా వుండాలి. బై బై " అన్నాడు కిష్ణుడు.
వసుంధర చెయ్యూపి వెళ్ళిపోయింది.
|
|