TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Comedy Audio Serial
(1).png)
శివతాండవం - 12 భాగం
******************
మేడమీద గదులన్నీ చూసి వచ్చారు.
క్రింది హాల్లో నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఆవిడ పేరు ధనలక్ష్మి. మేడ ఓనర్. ఆమె పక్కన ఆమె భర్త కోటేశ్వరరావు.
ధనలక్ష్మి అడిగింది " ఇల్లు ఎట్లా వుందమ్మా " అని.
" చాలా బావుందండీ. నాకు నచ్చింది " అన్నది పంకజం.
“ ఇంతకు ముందున్న వాళ్ళు కూడా ఇదే మాటన్నారమ్మా. వాళ్ళు అద్దె పదిహేను వందలు ఇచ్చేవారు. నువ్వు మాత్రం పన్నెండొందలు ఇస్తే చాలు " అన్నది ధనలక్ష్మి.
కోటేశ్వరరావు తెల్ల మొహం వేశాడు.
పంకజం నవ్వుతూ అడిగింది " కొత్తవాళ్ళు వస్తే అద్దె పెంచుతారనుకుంటే మీరు తగ్గిస్తున్నారేమిటి ?” అని.
“ అదే మా ఆవిడ ప్రత్యేకత..." అన్నాడు కోటేశ్వరరావు చాలా తెలివిగా మాట్లాడాననుకుంటూ.
భర్త వైపు మిర్రున చూస్తూ అన్నది ధనలక్ష్మి " ఛల్లే ఊరుకోండి ! అసలా మాటకొస్తే అమ్మాయి దగ్గిర అద్దె తీసుకోనేకూడదు. ఇల్లు కట్టించిన అప్పు ఇంకా తీరలేదు గనుక ఆ మాత్రమైనా అద్దె అడుగుతున్నాం " అని.
ఇప్పుడు చూపు మార్చి పంకజాన్ని దగ్గిరగా తీసుకుంటూ ఎంతో అభిమానం వలకపోస్తూ మాట్లాడింది ధనలక్ష్మి " నాట్యాకళాకారిణిగా ఈ రాష్ట్రం ఈ దేశంలో నీకున్న కీర్తికి నువ్వసలు అద్దె ఇవ్వనే కూడదు. నెలవేచ్చాలు, బియ్యం గట్రా నీ ఖర్చుతో కొనేకూడదు.నీకు కావలసినవన్నీ మాలాంటివాళ్ళు ఉచితంగా ఏర్పాటు చేస్తేనే గాని, కళల పట్ల మాకున్న శ్రద్దేమిటో అర్థం కాదు " అని.
" అవునవును! మా అమ్మాయిలందరికీ డాన్సు నేర్పించేది కూడా ఈ కళాభిమానంతోనే " అన్నాడు కోటేశ్వరరావు.
" అంతా మీ అభిమానం " అన్నది పంకజం.
ధనలక్ష్మి గోడలమీదున్న ఫోటోల వేపు శ్రద్ధగా చూస్తుంది. అన్ని ఫోటోల్లోనూ పంకజమే ఉన్నది. రకరకాల నాట్య విన్యాసాలుతో! ధనలక్ష్మి ఆ ఫోటోల వైపు కన్నార్పకుండా చూస్తుంటే ఆ ఫోటో గురించి పంకజమే చెబుతుంది.
" అది డిల్లీలో జరిగిన నాట్య ప్రదర్శన. ఆ ప్రక్కన ఫోటో, ప్రధానమంత్రి నన్ను అభినందిస్తున్నారు. అది బొంబాయిలో జరిగిన కార్యక్రమం ఆ ముఖ్యమంత్రి నన్ను సన్మానిస్తున్నారు. ఇదేమో కలకత్తాలో తీసింది. గవర్నరుగారు ఆ ప్రదర్శనకి ప్రత్యేకంగా వచ్చారు " అని.
ఒక ఫోటో చూసి ధనలక్ష్మి ఒక అడుగు వెనక్కి వేసింది. ఆ ఫోటోలో పంకజం పాటు ఒక పాము కూడా వుంది. పంకజం ముసి ముసిగా నవ్వుతూ ఆ పాయింటు వివరించింది.
" ఖంగారు పడకండి ! నాగరాజు నా నృత్యానికి వేదికమీదికి రావడం మామూలే. ప్రతి ప్రదర్శనలోనూ చివరి ఐటమ్ గా నేను నాగిని నృత్యం చేస్తాను. అప్పుడు నాగరాజు ఎక్కడ వున్నా నా కోసం రావాల్సిందే! అది నా నాట్యంలో ఒక ప్రత్యేకత " అని.
ధనలక్ష్మి బోలెడు సంతోషించింది.
" ఆహా...ఏమి విద్య ? ఏమి విద్య ? అమ్మాయ్... ముఖ స్తుతి కాదనుకుంటే నేనొక మాట అంటానమ్మా! నీలాంటి నాట్య కళాకారిణి తెలుగింటి ఆడపడుచు కావడం తెలుగు జాతికె గర్వకారణం " అన్నది ధనలక్ష్మి.
" అట్లాంటి నువ్వు మా మేడలో అద్దెకు దిగడం ముఖ్యంగా మాకు ఎంతో గర్వకారణం " అన్నాడు కోటేశ్వరరావు.
" చూడమ్మా ! నువ్వు మా కూతురులాంటి దానివి. అద్దె ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు బాధ లేదు. ఈ వూళ్ళో మాకు ఇలాంటివి ఏడు మేడలున్నాయి. అన్నీ అద్దెకిచ్చేసి కాలక్షేపం చేస్తున్నాం. నువ్వొకదానివి అద్దె ఇవ్వకపోతే మాకు గడవదనే బెంగలేదు " అంటూ కోటేశ్వరరావు వేపు చూసింది ధనలక్ష్మి.
" అవునవును " అన్నాడు కోటేశ్వరరావు.
ఆ తరువాత ఏం బాణం ప్రయోగిస్తుందో అర్ధంగాక...
|
|