TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Comedy Audio Serial
(3).png)
10 వ భాగం
కుర్చీ ఎక్కబోతు ఆగిపోయాడు.
శివుడు పారేసిన కవరు తీసుకున్నాడు. దానిమీద తన చిరునామా వుందేగాని ఎవర్రాసేరు ఎక్కడ్నించి వచ్చిందో ఆ వివరాలు కవరు మీద లేవు. కవరు చించేడు అందమైన కాగితం ముత్యాల్లాంటి అక్షరాలు. ప్రియమైన శివుడు ఆ సంబోధన పంకజానిది. ఆమె గొంతుతోనే ఉత్తరం నడిచింది.
ఆ రోజు నాటకంలో నిన్ను కొట్టినందుకు బాధపడుతున్నాను శివుడు ఏం చేయను చెప్పు? అంతమందిలో ఆ పనిచేస్తే సిగ్గు భయం నన్ను పిచ్చిదాన్ని చేసేయి. హెచ్చరించిన వినిపించుకోలేదు నువ్వు అనుకోకుండానే కొట్టేశాను. క్షమించవూ? శివుడు నువ్వంటే నాకెంతో ఇష్టమో అక్షరాల్లో రాయలేను.
నాటకంలో రసాభాస జరిగినతరువాత మావాళ్ళు నన్ను మా ఊరికి తీసుకెళ్ళిపోయారు. అర్జంటుగా పెళ్ళి చేసేయాలని మూహుర్తాలు కూడా పెట్టారు వరుడేవరో తెలుసా? జగ్గు! జగ్గుని పెళ్ళాడటం నా కిష్టం లేదని శివుడు ఎంత చెప్పినా మా పెద్దవాళ్ళు నా మాట వినిపించుకోవటం లేదు. అతన్తోనే నా పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయేయి.
ఈ నెల 16 వ తేదీ ఉదయం నా పెళ్ళి. నేను పరాయి సొత్తునై పోతున్నాను. శివుడు ఇప్పటికి మింఛిపోయిందేమీ లేదు - నా పట్ల నీకు ఏ విధమైన ప్రేమానురాగాలున్నా 25 వ తేదీ రాత్రి 8 గంటలకు మా ఊరువచ్చేయ్. ఆ వేళకి నీ కోసం పడవల రేవు దగ్గర నించుంటాను. నన్ను నీతో పాటు తీసుకుపో! రేవు గట్టునే ఉంటాను. 15వ తేదీ రాత్రి 8 గంటలు.
ఆ టైము దాటిందో ఈ జీవితానికింతే! నువ్వెవరో నేనెవరో! ఆ టైమ్ కొచ్చి నన్నునీతో పాటు తీసుకుపోతే జన్మంత ఋణపడి వుంటాను. నీ పాదసేవ చేసుకుని తరిస్తాను. ఏం చేస్తావో నీ యిష్టం. నీ పంకజం అప్పల్సామీ! అప్పుడు కలిగిన ఆనందం ఏ స్థాయిలో వుందో ఇప్పుడు నాకు గుర్తులేదయ్యా! అంత ఆనందానికి నా గుండె పగిలి వుండాల్సింది కానీ పగల్లేదు. ఎందుకో తెలుసా? నేనప్పుడు వలవలా ఘోల్లున ఏడ్చేశాను. కన్నీరు వరదలయ్యేలా కుళ్ళికుళ్ళి ఏడ్చేశాను. ఆ ఆనందాన్ని ఈ ఏడుపుతో సర్దుకున్నాను. కాలెండర్ చూశాను 15 వ తేదీ. టైం లేదు. ఆ రాత్రి 8 గంటలు దాటితే పంకజం నాకు దూరమైపోతోంది.
సరిగ్గా ఏడుగంటల వ్యవధి, ఈ వ్యవధిలోనే నేను నా పంకజాన్ని దక్కించుకోవాలి. (టాక్సి విమానంలా పరుగెడుతోంది స్పీడ్ మీటర్ 80 కిలోమీటర్లు చూపెడుతోంది. శివుడు ఆదుర్దా పడిపోతున్నాడు. క్షణానికి ఇరవై సార్లు రిస్టు వాచీ చూసుకుంటున్నాడు. ఇంకా వేగంగా పోనివ్వమంటున్నాడు. నేను వేగమని వేధిస్తుంటే డ్రైవర్ టాక్సీ ఆపేసి చేతులు జోడించి అన్నాడు - “సార్! ఇంత వేగంగా నేనెప్పుడు టాక్సిని తోలలేదండి. ఎనభై దాటితే కంట్రోలు తప్పుతుంది! కంట్రోలు తప్పితే ఏ చెట్టుకో గుద్దించేస్తాను గుద్దించేయమంటారా?” శివుడు క్షణం ఆలోచించాడు.
ఇప్పుడు శివుడు స్టీరింగు ముందు కూర్చున్నాడు. డ్రైవరు అతని పక్కన కూచున్నాడు. ఇప్పుడు టాక్సీ రాకెట్టయిపోయింది. నూరు దాటింది స్పీడు. పక్కన కూచున్న డ్రైవరు కళ్ళు మూసుకున్నాడు భయంతో. 'స్పీడోద్దండి బాబోయ్' అని డ్రైవరు వేడుకుంటున్నా శివుడు విన్పించుకోవటం లేదు. వెంట్రుకవాసిలో అనేక ప్రమాదాలు తప్పుతున్నాయి.
డ్రైవరుకి ఆ జోరు చూస్తుంటే విపరీతమైన ఆందోళన కలిగింది. దాంతో పాటు దుఃఖం పొంగిపొర్లింది ఘొల్లున ఏడుస్తున్నాడు. శివుడు డ్రైవరు మెడమీద కొట్టి స్పృహతప్పించేడు. దాంతో అతని పీడ విరగడయ్యింది. కానీ..... కనుచీకటి పడే వేళ మబ్బులు ఆకాశాన్ని కమ్ముకుంటున్నాయి.
క్షణంలో ఆకాశం యావత్తూ మేఘావృత్తమై పోయింది. గాలి బీభత్సంగా ఉంది. కుండపోత వర్షం... ఘోరంగా కురుస్తుంది. అయిన శివుడు జోరు తగ్గించడం లేదు. అంతకంతకి వేగాన్ని అధికం చేస్తున్నాడు. ఎట్టకేలకు, టాక్సీ నది ఒడ్డున చేరింది పంకజాన్ని చేరుకోవాలంటే అవతలి ఒడ్డుకి వెళ్ళాలి! టైం ఏడున్నర! వర్షం తగ్గిందేగాని ఉరుములు, మెరుపులు. గాలి దుంప తెంచేస్తున్నాయి. శివుడు టాక్సీ దిగి డ్రైవర్ని లేపాడు!
అతని చేతిలోరెండువందల నోట్లు పెట్టేడు. బ్రతుకు జీవుడాంటు డ్రైవరు పిలుపుకి అందకుండా టాక్సీని తోలుకుపోయేడు. శివుడు పడవలవేపు పరుగెత్తాడు. అక్కడో పడవ మనిషి కపించేడు.
“అర్జంటుగా అవతలి ఒడ్డుకి వెళ్ళాలి!” అన్నాడు శివుడు.
పడవ మనిషి ఆకాశంవేపు చూశాడు. నది హోరు శ్రద్దగా విన్నాడు. తర్వాత శివుడ్ని చూస్తూ వీల్లేదంటూ తల ఊపేడు.
“అయిదు కాకపొతే పది! పది కాదంటే వంద, నీ యిష్టం. ఎంత డబ్బు కావాలిస్తే అంత ఇస్తాను! అర్జంటుగా అవతలి ఒడ్డుకి చేర్చు.” పడవ మనిషి డబ్బుమాట వినగానే ఆశ పడినా వెంటనే సర్దుకుని అన్నాడు.
"ఈల్లేదు బాబు, గంగమ్మ తల్లి శివాలు తొక్కుతోంది ఇట్టాంటప్పుడు డబ్బుకి ఆశపడితే పేణాలు పోతాయి.”
“అంతేనా?”
“ఇంతకంటే ఏం చెప్పమంటారు? ఎల్లిపోండి బాబూ గంగలో కాలేడితే కొట్టుకుపోతారు!” శివుడు ప్రాధేయపడదలచుకోలేదు, ఏమైనా సరే నది దాటాలి. శివుడు నదిలో దూకబోతుండగా పడవ మనిషి శివుడ్ని వాటేసుకుని అన్నాడు.
“పిచ్చోడివా? ఏర్రోడివా? గంగమ్మ తల్లి మాంచి కసిమీదుందయాంటే ఇనవే? మాలావు గజ ఈతగాళ్లే గజగజ లాడిపోతారు గందా... లేత కుర్రోడివి ఏంటా దూకుడు!” శివుడు బదులు చెప్పలేదు. పడవ మనిషిని ఒక తోపు తోసి నదిలోకి దభాలును దూకేశాడు. పడవ మనిషి కళ్ళు రెండు మూసుకుని కెవ్వున కేకపెట్టేడు.
అప్పల్సామీ... ప్రేమ ఎన్నెన్ని సాహసాలు చేయిస్తుందో తెలిసింది కదా. ప్రేమ ఆహ్వానం పలకాలే గాని నిప్పులు, నీళ్ళు, తుఫాన్లు, భయంకరమైన భూకంపాలు ఏవీ ఆటంకాలు కాలేవు. కావు. నాకు ఈత అంతంత మాత్రమే వచ్చు. గజఈతగాళ్లే బెదిరిపోయే వాతావరణంలో, ఆ నదిని నిశ్చింతగా, నిర్భయంగా దాటగలిగేనయ్యా! ప్రేమలో పడ్డవాడ్ని నదిలో పడటానికి భయమేమిటింక? అందుచేత నేను ఏమైపోతానో అనే పాయింటుకి తావు లేదిక్కడ!
నా మీదా ఆశలు పెట్టుకున్న పంకజం అన్యాయం కాకూడదు, అదే ధ్యేయం లక్ష్యం... శివుడు తడిసి ముద్దయ్యాడు. ఒడ్డుకి పడవల రేవుకి చేరుకున్నాననే తృప్తి అతని మోహంలో తాండవిస్తోంది. ఒడ్డుకి చేరి తలెత్తి చూసేడు. తన ఎదుట పంకజం నిలబడివుంది. కొత్తగా కనిపిస్తోంది.
ఆమెను చూడగానే అతన్లో ఆవేశం కట్టలు తెంచుకుని ప్రవహించింది. 'పంకజం' అన్నాడు ఎంతో ధీమాగా. 'అనుకున్నట్టు... అనుకున్న వేళకి వచ్చేశాను పంకజం! పద... ఆలస్యం చేయవద్దు. పద పోదాం' అంటూ ఆమె చేతిని పుచ్చుకున్నాడు. అంతే! పంకజం రుద్రకాళి అయిపొయింది. అతని చేతిని విడిపించుకుని తన రెండు చేతుల్తో ఎడపెడా శివుడి చెంపలు వాయించేస్తోంది! ఒకసారి కాదు. రెండుసార్లు కాదు. పది పరక ఓపికఉన్నంత వరకు టపటపలాడించేసింది. ఆమె ఆ విధంగా తన చెంపలు చితగ్గొడుతుంటే శివుడు అవాక్కయిపోయాడు. నిశ్చేష్టుడయిపోయాడు. పంకజం రొప్పుతూ రోషంగా అంటోంది.
|
|