TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Audio Comedy Serial
.png)
9 వ భాగం
ప్రదర్శన రోజు... మా కాలేజీ ఆడిటోరియం చిన్నా పెద్దలతో కిటకిటలాడిపోతోంది. పంకజం డ్యాన్స్ కదా! జనం తండోపతండాలుగా వచ్చారు. ప్రదర్శన త్వరగా ప్రారభించాలని అరుస్తున్నారు! ఆలస్యాన్ని భరించలేకపోతున్నారు? అనుకున్న సమయానికి అరగంట ఆలస్యంగా ప్రదర్శన ప్రారంభమైంది! (అది వరూధినీ ప్రవరాఖ్య నృత్యనాటిక రక్తిగా సాగుతోంది. అందమైన పాట, దారి చూపమంటున్నాడు ప్రవరాఖ్యుడు. వగలు పోతోంది వరూధిని. ఈడూ జోడూ కంటికింపుగా వున్నారు ప్రేక్షకులు పరమానందభరితులై ప్రదర్శన చూస్తున్నారు!
ఘట్టాం క్లామయిక్స్ కి చేరుకుంది... వరూధిని విరహాన్ని అదుపులో పెట్టుకోలేక వరద గోదారిలా ప్రవరాఖ్యుడి మీదికి దూకుతోంది. కథ ప్రకారం ప్రవరాఖ్యుడు చెయ్యడం పెట్టి 'తల్లీ! తగదిది తగద' అంటూ తప్పుకోవాలి. శివుడు ఆ పని చేయలేదు జీవితంలో దక్కని ఛాన్సు నాటకంలో అయినా దక్కించుకుందామనే ఆరాటంతో అతను పంకజాన్ని గట్టిగా వాటేసుకున్నాడు.
ఈ పరిణామానికి హాల్లంతా దద్దరిల్లిపోయింది. ఆ విధంగా శివుడి బలహీనత ఒక పురాణగాథని తారుమారు చేసింది. ప్రవరాఖ్యుడు వరూధినిని తన కౌగిట బంధించడమా! 'రామ రామ' అని కళ్ళు మూసుకున్నారు పెద్దల ఈలలు కేకలు వేస్తున్నారు కుర్రకారు. వరూధిని వేషంలో వున్న పంకజం శివుడి కౌగిలింతలో ఉక్కిరి బిక్కిరైపోతోంది. ఆ బాధ అట్లా వుండగా కథని మార్చి శివుడు చొరవ మరింత బాధపెట్టింది.
శివుడు నన్ను వదులని మెల్లిగా చెప్పింది. వినలేదు. పెనుగులాదింగి వదల్లేదు. అసహనం ఎక్కువ కాగా చాచి చెంప చెట్టుపెట్టింది. ఆ దెబ్బతో శివుడు కళ్ళు బైర్లు కమ్మెయి. అప్పుడు తాను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాడు. బాధపడ్డాడు సిగ్గుపడ్డాడు. పంకజాన్ని తన కౌగిట నుంచి విడిచిపెట్టాడు ఆ వేళకి తెర పడిపోయింది.
అప్పల్సామీ నే చేసింది తప్పే కావచ్చు. వయసు పెట్టిన తొందరలో ఆగలేక ఆ తప్పు చేసెను. చెళ్ళున చెంప వాయించిందయ్యా. ఒక ఆడపిల్ల చేతిలో తొలిసారి దెబ్బ తినేశాను. వందలాది ప్రేక్షకుల సమక్షంలో ఘోరాతిఘోరంగా అవమానింపబడ్డాను. ఈ అవమానం బాధకంటే పంకజం నన్ను ఏ విధంగా భావిస్తుందో గదా అనే ఆందోళన ఎకువైంది.
ఆమె అభిమానాన్ని ఆడపిల్ల నాకు దూరం కావడం జీవిత పర్యంతం నన్ను ఛీ కొట్టడం తధ్యమని అర్థమైంది. ఒక విధమైన వైరాగ్యంలో పడిపోయాను. అప్పల్సామీ! ఆకలి దప్పుల్లేవు. నిద్ర లేదు కాలేజీకి వెళ్ళడం మానేశాను. కనీసం గెడ్డం గీసుకోవటం కూడా లేదు. బ్రతుకుపట్ల మమకారం చచ్చిపోయింది.
బ్రతకాలనే కోరిక లేదు. అట్లా వారం పదిరోజులు గడిచాయనుకుంటాను. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేశాను. పంకజం వాళ్ల హాస్టలుకి వెళ్లి పంకజాన్ని కలుసుకుని క్షమాపణ వేడుకుంటే మనశ్శాంతి కలగదనే నిర్ణయంతో ఆడపిల్లళ హాస్టలుకి వెళ్ళాను అప్పల్సామీ! (శివుడు పరమ బికారిలాగా వున్నాడు. గెడ్డం మాసింది తల మాసింది బట్టలు మాసిపోయాయి. మొత్తం మనిషే మాసిపోతాడు. చివరి ఘట్టంలో దేవదాసులా డీలా పడిపోయాడు. తను ఆడపిల్లల హాస్టలు వేపు నడుస్తుంటే కొందరు ఆడపిల్లలు అతన్ని చూసి చెవులు కొరుక్కున్నారు.
కొందరు కొన్ని శాపనార్థాలు పెట్టారు. కొన్ని చోట్ల పకపకలు, వికవికలు అవన్నీ ఓపిగ్గా భరిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ శివుడు భారంగా నడుస్తున్నాడు. ఎవరో పున్యాత్మురాలు శివుడి ఎదుటపడి చల్లని వార్త మెల్లగా చెప్పింది పంకజం లేదు చదువు మానిపించేరు వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది.)
అయ్యో అనిపించింది అప్పల్సామీ! నేనెంత దుర్మార్గుడ్నో కదా. ఓ ఆడపిల్ల పచ్చటి జీవితాన్ని పాడుచేసిన పరమ కిరాతకుడ్ని.. నన్ను భగవంతుడు కూడా క్షమించడు... పంకజం చదువు పాడు చేశాను. పంకజం భవిష్యత్తును సర్వనాశం చేశాను. నా క్షమాపణలతో ఆమె బతుకు బాగుపడుతుందా? బాగుపడదు.
పదిమందిలో అవమానం పొందిన ఆడపిల్లలకు పెళ్ళవుతుందా? అవదు. పెళ్ళికాని ఆడపిల్ల జీవితం నందననవమవుతుందా.. అవదు... అవదు.. అవదు.. నిజం చెబుతున్నాను అప్పల్సామీ... గదికి వెళ్ళి ఉరి వేసుకుందామా అనే ఆలోచన కలిగింది నాకు అదే అంతిమ నిర్ణయమైంది. నీరసపడిన నా శరీరానికి ఆ నిర్ణయంతో కొత్త బలం వచ్చింది.
అపారమైన శక్తి కలిగింది నడక వేగం చేశాను కాదు పరుగెత్తాను. (అతను పరుగెత్తుకుంటూ గదిలోకి వచ్చాడు. తలుపు మూసేను కొంచెంసేపు ఆ తలుపు మీద వాలిపోయి గాలి పీల్చుకున్నాను. క్షణం గడిచింది. ఉరి ఏర్పాట్లు చేసుకున్నాను. కుర్చీ ఎక్కాను మెడకి ఉరి తలిగించుకున్నాను క్షణంలోనో అరక్షణంలోనో కుర్చీని తన్నేసేవాడే అంతలో 'శివుడు శివుడు' అనే పిలుపు తియ్యగా వినిపించింది.
సాక్షాత్తు పంకజం గొంతు తలుపు తట్టిన శబ్దం. శివుడు శివుడు అనే పిలుపు మళ్ళా తలుపు తట్టిన శబ్దం శివుడు తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. గబగబా ఉరి తొలగించేసుకుని కుర్చీ దిగి తలుపు గద్దరికి పరుగెత్తాడు. ఇన్లా తలుపు తట్టుతూనే వున్నారు! ఎంతో ఆనందంగా, గెంతాడు. ఇంకా తలుపు తట్టుతూనే వున్నారు! ఎంతో ఆనందంగా, ఆత్రంగా తలుపు తెలిచాడు! ఎదురు పోస్ట్మేన్. హతాశుడయ్యేడు శివుడు.
పోస్ట్ మాన్ మాట్లాడకుండా కవరొకటి శివుడి చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోయేడు. శివుడు చిరాగ్గా తలుపు మూశాడు. కవర్ని ఒక మూలకి విసిరేశాడు.
ఇప్పుడు ఆ కవర్నించి శివుడు శివుడు అనే పిలుపు.. పంకజం గొంతు కమ్మగా వినిపిస్తోంది.
|
|