Khaidi Chivari Korika

Khaidi Chivari Korika

“ నిన్ను రేపు ఉరితీయబోతున్నాం. నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు ?” అని

ఖైదితో అన్నాడు జైలర్.

“ నిజంగా తీరుస్తారా ?” అని అనుమానంగా అన్నాడు ఆ ఖైది.

“ ఖైది యొక్క చివరి కోరిక తీర్చడం మా బాధ్యత. తప్పకుండా తీరుస్తాం.

అదేంటో చెప్పు ?” నమ్మకంగా, గట్టిగా చెప్పాడు జైలర్.

“ నాకు పెద్దగా కోరికేం లేదు కాని, మెడకు ఉరితాడు బిగిస్తే నాకు

చక్కిలిగింతలు పెట్టినట్లు ఉంటుంది. అందుకని ఆ తాడేదో నా నడుముకి

బిగించండి చాలు " అని తన చివరి కోరికను చెప్పాడు ఆ ఖైది.

అది విని " ఆ...” అని నోరు తెరిచాడు జైలర్.