Adgadi Sadgati

 

అద్గదీ ... సద్గతి ...!

- A story with ' different ' claimax

 

త్రిపురనేని మహారథి గారబ్బాయి దర్శకుడిగా తీసే సినిమా ప్రారంభోత్సవం రికార్డింగ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ ముగిశాక, కొందరు ఫిలిం జర్నలిస్ట్ లు సరదాగా ' మహతి రికార్డింగ్ స్టూడియో ' బయట చెట్టు నీడన పిచ్చాపాటి కబుర్లలో పడ్డారు.

అక్కడున్న వారిలో ' చిత్రం ' పత్రిక ఎడిటర్ బాబురావు, ' ఇండియన్ ఎక్స్ ప్రెస్ ' ఛీప్ సబ్ ఎడిటర్ యస్. యస్. శివకుమార్. ' నంబర్ వన్ ' పత్రిక రిపోర్టర్ నారాయణ రాజు, '

' ఆంధ్రభూమి ' దిన పత్రిక రిపోర్టర్ నారాయణ, ' తెలుగు పత్రిక ' సీనియర్ రిపోర్టర్ వెంకట్రావ్....అందరూ ఉన్నారు.తెలుగు సినిమా కథల తీరు తెన్నులపై చర్చ మొదలైంది.

నా దగ్గర ఓ అద్భుతమైన కథ ఉంది. ఆ కథలో అన్ని యాస్పెక్ట్ లూ కవరవుతాయి. క్లయిమాక్స్ కూడా ఎవ్వరూ ఊహించలేని విధంగా ఉంటుంది. కావాలంటే మన నారాయణని అడగండి " అని అన్నాడు శివకుమార్.

అవును. నేను ఆంధ్రప్రభలో వర్క్ చేసే రోజుల్లో చెప్పేవాడీ కథని చాలా సరదాగా ఉంటుంది. వినండి , వినండి. ” అంటూ సర్టి పై చేశాడు నారాయణ.

చెప్పు మరి... ఆలస్యం దేనికి ? అడ్వాన్స్ ఇచ్చి హోటల్లో రూమ్ బుక్ చేస్తే గాని చెప్పవా ?”అన్నాడు నారాయణరాజు.

సరే వినండి. హీరోయిన్ గ్లామరస్ గా ఉంటుంది. భక్తి ఎక్కువ చిన్నప్పట్నించీ పుట్టలో పాలుపోసి పాటలు పాడుతూ ఉంటుంది. దాన్తో ఉమెన్ యాస్పెక్ట్. పెద్దవాళ్ళ యాస్పెక్ట్ రెండూ కవరవుతాయి. పక్కింటి కుర్రాడే కదా అని ఓ నికృష్ణుడుతో పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు "

నికృష్ణుడుతో తెలిసి తెలిసి ఎలా పెళ్లి చేస్తారయ్యా ? ” అడిగాడు వెంకట్రావ్.

ఉండండి సార్... నన్ను చెప్పనివ్వండి. వాడు నికృష్ణుడని వాళ్లకి తెలియదు. మనకు తెలుస్తూ ఉంటుంది . ఎలాగంటే కృష్ణుడి లెవెల్లో అమ్మాయిల్ని వెంటేసుకుని స్టెప్పుల డ్యూయెట్లు పాడుతూ ఉంటాడు...”

ఎందుకూ కృష్ణుడు, నికృష్ణుడు అనే ప్రాస కలవటం కోసమా ? ” అని అడిగారు  బాబూరావు.

  “ అది కాద్సార్... అదంతా యూత్ కోసం... అలా యూత్ ని కవర్ చేస్తాం         

 అన్నమాట "

ఎంత యూత్ అయితే మాత్రం అలా అమ్మాయిల్తో తిరిగితే  రోగాలంటుకుని

  చావడా !? ”అన్నాడు నారాయణరాజు.

రోగాలంటుకోవడం, చావడం రెండూ జరిగాయి. దాన్తో వాడి  

 శవాన్నిపుట్టముందేసుకుని ' ఓ నాగదేవా నా పతిని బ్రతికించలేవా ' అని 

 పాడుతుంది హీరోయిన్. అక్కడ సెంట్ మెంట్ పార్టు వర్కవుట్ అవుతుంది.”

 “ అవార్డు యాస్పెక్ట్ చెప్పావ్ కాదు !? ” అన్నాడు నారాయణ.

  “ ఆ పాయింట్ కే కదా వస్తున్నా....! అలా ఆ హీరోయిన్ పాడగానే పుట్టలోంచి   పాము వచ్చి' పిచ్చిదానా...అసలు పాములు మనిషిని బ్రతికించడం అన్నది సినిమాల్లోనే తప్ప బైట ఎక్కడైనా చూశావా. నీకు భక్తి తప్ప బుర్ర లేనట్టుందే ' అని అంటుంది "

 “ పాములు మాట్లాడం అదీ మనకర్థమయ్యే తెలుగులో మాట్లాడం ఫాంటసీ

 యాస్పెక్టా ? ” అన్నాడు నారాయణరాజు.

నువ్వలా అనుకుంటే నాకభ్యంతరం లేదు గానీ అక్కడ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా హేతువాదానికి అనుగుణంగా డైలాగులు చెప్తాం కాబట్టి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అది అవార్డు యాస్పెక్ట్ " అన్నాడు శివకుమార్.

 " క్లయిమాక్స్ ఊహించని విధంగా ఉంటుందన్నావు కదయ్యా అది ఇదేనా ? ” 

 అడిగారు బాబూరావు.

అబ్బే, ఇది జస్ట్ ప్రీ క్లయిమాక్స్. అసలు క్లయిమాక్స్ వేరే ఉంది. ”

 “ సస్పెన్స్ తో చంపక త్వరగా చెప్పవయ్యా " అన్నాడు వెంకట్రావ్.

 “ అప్పుడు హీరోయిన్ ' అంతేనా అయితే నేను నా పతితో కలిసుండే మార్గమే  లేదంటావా...?! ' అని అంటుంది. ' అలా అన్నావ్ బావుంది... నీ పతిని బ్రతికించలేనన్నాను గాని నిన్ను అతని దగ్గరికి చేర్చలేనన్నానా ఇద్దరూ కలిసుండండి !' అంటూ ' ఫట్ ' మని కాటు వేసి పోతుందా పాము. అదీ క్లయిమాక్స్ " అంటూ ముగించాడు శివకుమార్.

 

- రాజా