Rating:             Avg Rating:       548 Ratings (Avg 3.00)

సరదాగా కాసేపు స్పెషల్ అక్కా ! ఎవరే అతగాడు

సరదాగా కాసేపు స్పెషల్  " అక్కా ! ఎవరే అతగాడు ? "

ప్రతి సోమవారం '' సరదాగా కాసేపు '' అంటూ స్పెషల్ గా మిమ్ముల్ని నవ్విస్తున్న ఈ

శీర్షికలో ఈ వారం కూడా " అక్కా ! ఎవరే అతగాడు " అంటూ నవ్వించడానికి రెడీ అయి

వచ్చింది సరదాగా కాసేపు. మరి ఆలస్యం ఎందుకు సరదాగా కాసేపు అంటూ చదువుకొని

హాయిగా నవ్వుకోండి. ఈ శీర్షిక మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయగలరు.

 

* రోగంతో మంచాన పడిన తండ్రి.

* పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు

* కాలేజీలో చదువుకుంటున్న తమ్ముళ్ళు

* నాలుగిళ్ళల్లో పాచిపనులు చేసి సంపాదిస్తున్న తల్లి

* తాను మాత్రం ఏం వెలగబెడుతున్నాడో దేవుడికే తెలియాలి కానీ, ఎప్పుడు

మడత నలగని ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరుగుతుంటాడు.

* ఎంతవరకు చదువుకున్నాడో తెలియదు. పై అధికారులను నిలదీసేటప్పుడు

మాత్రం ఇంగ్లీష్ వరద గోదావరిలా ప్రవహిస్తుంటుంది.

* పదిమంది రౌడీలతో పైటింగ్ చేసినా చిన్నదెబ్బ కూడా తగలదు. ఎంత ఎత్తు

నుండి దూకిన నడుం విరగదు, క్రాఫ్ చెరగదు.

* శ్రీమంతులైనా అమ్మాయిలు మాత్రమే అతని ప్రేమకోసం వెంపర్లాడుతుంటారు.

* చెల్లెళ్ళ పెళ్లిలకోసం వారికిచ్చే కట్నాల కోసం రిక్షలాగి లక్ష రూపాయలు

సంపాదిస్తాడు.

* అందమైన లొకేషన్లలో, వీలయితే ఫారిన్లో హీరోయిన్ తో డ్యూయెట్లు పాడతాడు.

చెల్లీ ! అతగాడే '' తెలుగు సినిమా హీరో "