Schooluki Nemmadigaa Vellu

Schooluki Nemmadigaa Vellu

గురునాధం గారు పద్యాలు పాడుతూ పిల్లలకు వినిపిస్తుండగా, అప్పుడు కిరణ్

అనే స్టూడెంట్ క్లాస్ రూము దగ్గరికి వచ్చి " సార్...నేను లోపలికి రావొచ్చ సార్ "

అని అడుగుతాడు.

పద్యం పాడడం ఆపిన గురునాధం, తన సోడాబుడ్డి అద్దాలోంచి కిరణ్ ను

చూసి " ఓరేయ్ కిరణ్...ఎందుకురా ప్రతి రోజు ఇలా బడికి ఆలస్యంగా వస్తావు "

అని అడిగాడు.

" ఇంటి దగ్గర తొందరగానే బయలుదేరుతాను సార్ ! దారి మధ్యలో ఒక మలుపు

దగ్గర ఒక బోర్డు కనిపిస్తుంది సార్...దాంతో ఆలస్యం అవుతుంది సార్ "

అని వినయంగా చెప్పాడు కిరణ్. " ఏం బోర్డది ?" అని అడిగాడు గురునాధం.

" స్కూల్ ఉంది నెమ్మదిగా వెళ్ళు అని సార్ " అని చెప్పాడు కిరణ్.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు గురునాధం.