Bhartanu Santoshapettaalani

Bhartanu Santoshapettaalani

ఒక తాగుబోతు భర్త పూర్తిగా తాగి యింటికి వచ్చాడు. వాడి భార్య అతడిని

సంతోషపెడదామని పూరీలు, బూరెలు, గారెలు చేసింది. భర్త రాగానే ఆ విషయమే

చెప్పింది.

" వచ్చారా....నేను మీ కోసమే ఎదురుచూస్తున్నాను ?" అని తను చేసిన వాటి గురించి

చెప్పాలనే సంతోషంతో అన్నది భార్య.

" రాకుండా పోతాననుకున్నావా " అని తూలుతూ అన్నాడు ఆ భర్త.

" మీ కోసం పూరీలు, బూరెలు, గారెలు చేశానండీ " అని సంబరంగా చెప్పింది భార్య.

" అవునా....పూరీలు ఎందుకు చేశావు ?" అని అడిగాడు భర్త.

" తినడానికి " అని మరింత సంబరంగా చెప్పింది భార్య.

" మరి బూరెలు ఎందుకు చేశావు ?" అని అడిగాడు భర్త.

" అవి కూడా తినడానికే " అని చెప్పింది భార్య.

" పూరీలు, బూరెలు తినడానికి చేశావు బాగానే వుంది. మరి గారెలు ఎందుకు చేశావు "

అని అడిగాడు భర్త.

" అవి కూడా తినడానికేనండి " అని చెప్పింది భార్య.

" అన్ని తినడానికి చేస్తే...మరి నాకోసం అంటావేంటి " అని అక్కడి వెళ్ళిపోయాడు భర్త.

ఏమి చేయాలో అర్థంకాక జుట్టు పీక్కుంది ఆ భార్య.