Naa Attamamalaku

కొత్తగా పెళ్ళయిన కాంతం, రాజేశం...ఒకరోజు తీవ్రంగా గొడవ పడ్దారు.

ఎప్పటికీ మొగుడు, తన కాళ్ళు పట్టుకోకపోవడం వలన గబ గబ కొన్ని బట్టలను

సర్దేసి బయటకు నడవబోతోంది కాంతం .

" ఎక్కడికి పోతున్నావు ? " అని అడిగాడు రాజేశం.

" నరకానికి" అని విసురుగా సమాధానమిచ్చింది కాంతం.

" అయితే నిన్ను నాకు తగిలించి అక్కడకు పోయిన నా అత్తమామలకు నా

నమస్కారాలు చెప్పు" అని వ్యంగ్యంగా అన్నాడు రాజేశం.

" ఆ..." ఆశ్చర్యంగా నోరు తెరిచింది కాంతం.