Aahanagar Colony 18

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

18 వ భాగం

కోర్టు హాలు కిక్కిరిసి వుంది. కోర్టు బయట కూడా జనం విరగబడి వున్నారు. ప్రెస్

రిపోర్టర్లు, టీవి ఛానల్ వాళ్లు కెమెరాలు సిద్దం చేసుకున్నారు. అటు వైపుగా వెళ్తోన్న ఓ

వ్యక్తి ఈ హడావుడి చూసి, "ఏంటి సంగతి?" అని అడిగాడు.

ఎవరో తుంటరి "పాప ఏడ్చింది" అన్నాడు.

"బేగాన్ స్ప్రే కొట్టు ...పెళ్ళయ్యాక మా ఆవిడ కూడా అదే కొట్టేది" మరో తుంటరి అన్నాడు.

ఆ అడిగినతను జుట్టు పీక్కున్నాడు మెంటలెక్కిన ఫీలింగ్ తో. అతడ్ని చూసి జాలేసి, మరొకతను చెప్పాడు.

"ఈవేళ రివల్వార్ రాంబోని కోర్టులో హాజరుపరుస్తున్నారు.

"రివల్వార్ రాంబోనా?" ఆశ్చర్యంగా అడిగాడు నోరు తెరిచి.

ఓ దోమ అతని నోట్లోకి వెళ్ళింది.

"అవును...నాలుగు రాష్ట్రాలను గడ గడ లాడించిన రివల్వార్ రాంబో లక్కీగా ఓ

కానిస్టేబుల్ కు చిక్కాడు."

"అదెలా....?"

"బఠానీలమ్మే కుర్రాడ్ని రివాల్వర్ తో బెదిరించి, బఠానీలులాక్కోబోతుంటే...కానిస్టేబుల్

అవతారం, రివాల్వర్ రాంబో చొక్కా పట్టుకొని, ఫట్ ఫట్ మని నాలుగు పీకి, సెల్లో

పడేసాడు."

"నిజంగానా? పెద్ద పోలీసాఫీసర్లు భయపడే రాంబోని ఆర్డినరీ కానిస్టేబుల్ నాలుగు పీకి

సెల్లో పడేసాడు?" అతడ్ని అభినందించి డబుల్ పరమ వీరచక్ర అవార్డు ఇవ్వాలి.

"కాని....కుదర్దే....

"అదేం?"

"అతను కోమాలో వున్నాడు"

"రివాల్వర్ రాంబోని పట్టుకున్న ఆనందంతో కోమాలోకి వెళ్ళిపోయాడా."

" కాదు తను ఫట్ ఫట్ మని నాలుగు పీకి సెల్ లో వేసింది రివాల్వర్ రాంబోనని....

తెలిసి.."

"ఇంతలో పోలీసువ్యాన్, వెనకే నాలుగు జీప్ లు వచ్చి ఆగాయి. భారీ బందోబస్తు వుంది.

పోలీసులు వ్యాన్ చుట్టూ తుపాకులు ఎక్కుపెట్టి నిలబడ్డారు. వ్యాన్ డోర్ ఓ ఓపెన్ చేసారు.

టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రస్ తో రివాల్వర్ రాంబో కిందికి దిగాడు. బ్లాక్ షూ, బ్లాక్ ప్యాంటు,

బ్లాక్ షర్టు, బ్లాక్ గ్లవుస్... తలెత్తి, చుట్టూ చూసాడు రివాల్వర్ రాంబో...అతని చేతులకు

కాళ్ళకు సంకెళ్ళు వేసారు. అతని చేతిలో రివాల్వర్ వుంది. ఓ గొలుసుతో తన చేతికి

అటాచ్ గా వుండేలా ఫిక్స్ చేసుకున్నాడు. పిన్ డ్రాప్ సైలెన్స్.

"ఖాముష్.' అరిచారు రివాల్వర్ రాంబో ఆ జనాన్ని చూసి.

"అందరూ కామ్ గానే ఉన్నారు. ఓ యస్సయ్ వచ్చి, రాంబో చెవిలో గొణిగాడు రివాల్వర్

రాంబో సీరియస్ గా తలతిప్పి అతనివైపు చూసాడు.

యస్సయ్ కంగుతిన్నాడు.

ఇంకావుంది