Telugu Comedy Kavithalu

Telugu Comedy Kavithalu


ప్రతి శుక్రవారం '' తెలుగు కామెడీ కవితలు '' అంటూ స్పెషల్ గా మిమ్ముల్ని

నవ్విస్తున్నఈ శీర్షిక ఈ వారం కూడా మరిన్ని సరికొత్త కామెడీ కవితలతో

నవ్వించడానికి రెడీ అయి వచ్చింది. మరి ఆలస్యం ఎందుకు మన తెలుగు

కామెడీ కవితలు అంటూ చదువుకొని హాయిగా నవ్వుకోండి. ఈ శీర్షిక మీద మీ

అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయగలరు.



మ యింటి ముందున్న మడేలు

బాగా వాయిస్తాడు ఫిడేలు

అతని శృతి వింటే చాలు

సహకరిస్తాయి తోడేళ్ళు !

తడు రాగం ఆలపిస్తే చాలు

భూతాలూ, ప్రేతాలు వినిపిస్తాయి

వెనువెంటనే మృత్యుగీతాలు

అతని సంగీతం వల్లే

విభిన్నదేశాల్లో భూకంపాలు

వివిధ రాష్ట్రల్లో బాంబు పేలుళ్లు

అంటారు ఇరుగు పొరుగు జనం

వారికేం తెలుసు అతని వల్ల ప్రయోజనం

సరిహద్దుల్లో అతన్ని పెట్టేస్తే కాపలా

శత్రువు ఎవరైనా చచ్చురుకుంటాడు

కాలు పెట్టె లోపల !


హలో...

హైదరాబాద్ రోడ్డులో

కళ్ళు మూసుకు చలో

రూలు రూలంటూ బండి నడిపితే

వెంటనే చేరుతావు ఉస్మానియాలో

ఆ మర్నాడే నీ ఇంట్లో

ఏడుపులో, పెడబొబ్బలో...


రోజూ తప్పదు

చతుర్ముఖ పారాయణం

అప్పుడప్పుడు మధ్యలో ధూమ పానం

ఓడినప్పుడల్లా ఆలితో

అసత్య సంభాషణం

అప్పుడు నెలకొంటుంది

ఇంట్లో రణ వాతావరణం

అది మరుచుటకు

మళ్ళీ మద్యపాన సేవనం

ఆ కిక్కులో

ఎర్రదీపాల ఏరియాలకు పయనం

చివరకు మిగిలేది ఓ చిన్ని కౌపీనం

దాంతో ఇంకేముంది

బతుకు హీనాతి హీనం దీనాతి దీనం