ఏ ఆట?

ఏ ఆట?

అక్కడ నలుగురు కూర్చుని పేకాడుకుంటున్నారు.

ఇంతలో ఒకడు 'పేకాట' లో మహా పరిజ్ఞానం ఉన్నవాడిలా ఒకడి వెనకాల కూర్చున్నాడు

సలహాలు చెప్పడానికి.

"ఆ ఆసుని వేయకు, జాకీని వెయ్''

అతను, ఇతను చెప్పినట్లు చేసి ఆట నెగ్గాడు.

మళ్ళీ ఆడుతున్న వాడి చెవులో దూరి "ఒద్దొద్దు కళావర్ మూడు ఉంచు, డైమండ్

తొమ్మిది వెయ్'' అన్నాడు మళ్ళీ అతనే ఆట నెగ్గాడు.

మళ్ళీ పేక ముక్కలు పంచేరు ... ఈసారి పెకముక్కలన్నీ అయోమయంగా వచ్చాయ్

పెకాడుతున్న వాడు మెల్లిగా ఆ సలహాదారుణ్ణి మెల్లిగా అడిగాడు

"ఇప్పుడు ఆసు ఉంచనా. మదామ్ ఉంచనా?''

"నన్నడిగి మంచి పని చేసేవ్ ... అసలు నేనే నిన్నుఇంతసేపూ

అడుగుదామనుకుంటున్నా ఏ ఆట ఆడుతున్నారని?