Matala Chamatkaralatho Navvulu

Matala Chamatkaralatho Navvulu

మాటల చమత్కారాలతో నవ్వులు

పన్ చేయడానికి భాషపై మంచి పట్టు ఉండాలి.మాటను విరిచో,వేరే అర్థంలో ప్రయోగించే

చమత్కారాన్ని పన్ డించడం అంత సులభమేమీ కాదు. తెలుగు,ఇంగ్లీష్ , హిందీ,

సంస్కృతం భాషా పరిజ్ఞానాలను కలగలిపిన ప్రయోగంలోని వివిధ అధ్యాయాలను

పరిశీలించి చూస్తే, పూర్తి ఇంగ్లీష్ మాటనే విరిచి, లేదా వేరే అర్థంలో పుట్టించిన హాస్యం

ఏమిటో చూద్దాం.

 

* బీరువా ఉంటేనే 'సేఫ్' సైడ్.

* 'టిప్' టాప్ గా ఉండాలంటారు సర్వర్లు.

* ప్రవాసులది ఆ 'బ్రాడ్ మైండ్'.

* ఓన్ హౌసుల్లో చాలామటుకు లోన్ హౌసులే.

* రోడ్దేక్కితే ఎవడయినా 'లెప్టిస్టే'.

* చేపల వ్యాపారం సెల్ 'ఫిష్' బిజినెస్.

* వారసులకు 'విల్లు' పవర్ అవసరం!

* డబ్బు విషయంలో 'ఫ్రాంక్' గా ఉండాలంటారు ఫ్రాన్స్ వాళ్ళు.

* మేరేజి అంటే 'క్యాస్ట్' లీ అఫేయిర్.

* ఇన్విజిలేటర్లు 'హాల్ రౌండర్లు '

* నృత్య దర్శకురాలు ' స్టిప్ మదర్ '.

* సర్కారు ఆయుధాలు స్టాటి ' స్టిక్స్ '

* షేర్లపై చెప్పేవి 'స్టాక్ ' ఆన్సర్లు.

* మంత్రులకు అవసరమయింది 'ఫోటో' కాల్

* డెమోక్రసీ 'పోల్ సేల్ ' బిజినస్.

* 'మాజీ' లకు ఉండేది 'ఎక్స్ పీరియన్స్'.

* భార్యాభర్తలు 'ప్యాచ్'మేట్లు.

* బామ్మ చెప్పేవన్నీ పద్యాలూ, 'తాత 'పర్యాలూ.

* పళ్ళు ఊడిపోవడం యాక్సి 'డెంటల్ '.

* ఆత్మహత్య 'గ్రేవ్' మిస్టేక్.

ఇప్పుడు హిందీ భాషలోని పదాలను కాస్త మార్చి వేసిన తమాషా చూద్దాం.

* మందుల షాపుల్లో 'గోలీమాల్ '.

* ములాయం సింగ్ ది 'నమాజ్' వాదీ పార్టీ.

హిందీ - తెలుగు అర్థాలలో వేర్వేరుగా ప్రయోగించిన మాటల గురించి చూద్దాం.

* కుళాయిల కొట్లాట 'పానీ'పట్టు యుద్ధం

* డబ్బుకోసం హత్య 'పైసా 'చికత్వం.

* 'భేటీ' లో చివరిది 'టీ'.

* శృంగార సంభాషణ 'బూత్ చీత్ '.

* తెలుగు- సంస్కృత అర్థాలలో వేర్వేరు ప్రయోగించి నవ్వు పుట్టించారు.

* శారీ హౌసుకు స్త్రీలు 'చీరపరిచితులు '.

* 'దావా 'నలం పుట్టించే వారు లాయర్లు,మందు ప్రియులు.

* డిపార్టుమెంటులపై శంకరనారాయణ చెమక్కులు.

* 'కొత్త గుంతలు ' తొక్కుతోంది ఆర్టీసీ.

* యూనివర్సిటీ డీనులూ గొడవలేస్తే దీనులు.

* కాటేజీ పరిశ్రమ నిన్నటి మాట.కాలేజీ పరిశ్రమ నేటిమాట.

* హౌసింగ్ బోర్డులో 'గూడు'పురాణీ.

* ఫారెస్టు వారిదంతా 'కర్ర' పెత్తనం.

* 'మూడు చెరువుల నీళ్ళు ' తాగించేది మెట్రో వాటర్ వర్క్స్.

* ఫారెస్టు డిపార్టుమెంటు అంటే 'కలప వల్లి'.

* ఫారెస్టు వారు కోరుకునేది 'మృగసిరి'.

* పైర్ సర్వీస్ వారికీ ఎప్పుడూ అగ్ని పరీక్షలె.

* సర్కారు ఆఫీసులో అన్నీ 'నోట్ మాటలే'.

 

మాటల చమత్కారాలు చదువుకుని హాయిగా నవ్వుకున్నాం కదా. మరి మరిన్నిఇలాంటి

మాటల చమత్కారాలతో మళ్ళీ కలుసుకుందాం .

- శాగంటి శ్రీకృష్ణ