తాతా ధిత్తై తరిగిణతోం 62

తాతా ధిత్తై తరిగిణతోం 62

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

విష్ణుమూర్తి బంగళాముందు టాక్సీ ఆగేసరికి అర్దరాత్రి దాటింది.

శ్రీరామ్ అశ్వినీ టాక్సీ దిగి, గేటు తెరచుకుని నెమ్మదిగా లోపలకు వచ్చారు. పరిసరాలన్నీ నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా వున్నాయి. తలుపు దగ్గర నిలబడి 'బజర్' నొక్కబోయిన అశ్వినికి, లోపల్నించి ఎమో మాటలు వినిపించడంతో అక్కడే ఆగిపోయింది.

"ఇప్పటికే చాలా సమయం వృధాచేశావ్! నా చెల్లెలి మొగుడివి కదా, సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోతావా' అని ఇంతసేపూ వెయిట్ చేశాను. కోట్లు వెనకేసినవాడివి, 'బావమరిదికి ఆఫ్ట్రాల్ ఓ యాభైలక్షలు ఇవ్వలేకపోతావా' అని ఆశపడ్డాను కానీ నువ్వు చాలా మొండిగా ప్రవర్తించావ్. నువ్వేకనక పరాయి వాడివైయుంటే మా గోపాలం ఈ పాటికి నీ ప్రాణాలు తీసేసేవాడు కానీ నువ్వువాడికి మేనమామవైపోయావ్. అందుకే కిరాయి రౌడీల్ని పిలిపించవలసి వచ్చింది.! మర్యాదగా నీ లాకర్ తాళం చెవులు ఎక్కడున్నాయో చెప్పు"

"అది ఆ హనుమంతుగాడి గొంతు మా నాన్నని బెదిరిస్తున్నాడు" శ్రీరామ్ తో చెప్పింది అశ్విని.

ఆ తలుపుకి వున్న 'కీ' హాల్ లోంచి చూశాడు శ్రీరామ్. సోఫాలో కూర్చుని వున్న విష్ణుమూర్తి చేతులు రెండూ వెనక్కి విరిచి కట్టినట్టు తెలిసింది అతనికి ఎదురుగా ఓ గుండాలాంటి మనిషి కూర్చుని వున్నాడు.

"చూడు పెద్దమనిషి నాకు అవతల చాలా పనులున్నాయి. ఇంక నీకు పావుగంట టైం ఇస్తున్నాను ఈలోగా వాళ్ళడిగిన డబ్బు తెచ్చి ఇవ్వకపోతే నిన్నిలాగే, మాతో తీసుకుపోయి మధ్యలోనే మాయం చేసేస్తాం." ఆ గుండా అన్నాడు.

వాడి పక్కన హనుమంతూ, గోపాలం వున్నారు...సోఫావెనకాల మరో ఇద్దరు మనుషులు కూడా కనిపించారు.

"ఇదివరకోసారి మన కారుకి అడ్డంపడి మనమీద దాడిచేసిన వాళ్లే అక్కడున్న బాషాగాడి మనుషులు!...ఆ సోఫాలో కూర్చుని బీరుతాగుతున్నవాడు బాషాయే అయ్యుండాలి"

"అటు చూస్తూనే చెప్పాడు శ్రీరామ్.

అశ్విని కూడా 'కీ హాల్' లోంచి లోపలకు చూసింది....తండ్రి దీనావస్థను గమనించి భయంతో వణికిపోయింది. అమ్మో! ఆ దుర్మార్గులు మా డాడీని ఏం చేస్తారో?" అంటూ శ్రీరామ్ చేయి పట్టుకుంది.

"ఏం భయంలేదు...నేనున్నాను. నా దగ్గర బాబా ఇచ్చిన తాయెత్తుంది. దీని పవర్ తో వాళ్ళ భారతం పడతాను!" అంటూ తాయెత్తును ఎప్పటిలా కళ్ళకద్దుకునెందుకు కుడిచేతి దండను తడిమి చూసుకున్నాడు.

చేతికి తాయెత్తు తగలకపోవటంతో షాకయ్యాడు.

"అయ్యో! తాయెత్తు ఏమైందీ?" అనుకున్నాడు.

"చేతికి లేదా?" అడిగింది అశ్విని.

"లేదా...! బహుశా ఎప్పుడో తెగిపోయి, ఆ నీళ్ళల్లోనే పడిపోయుండాలి." గుర్తుచేసుకునే ప్రయత్నంలో అన్నాడు.

"పోతే పోయిందిలే అది వున్నా ఒకటే, ఊడినా ఒకటే! నువ్వు తలచుకుంటే, ధైర్యంగా ఆ రౌడీల అంతు తేల్చగలవ్!" అతని భుజం తట్టి చెప్పిందామె.

"కానీ ఆ బాబా ఎవరో పూజలు చేసి ఇచ్చిన తాయెత్తు కదా అదీ?"

"చెప్తున్నానుగా. అది తాయెత్తు కాదు. పిచ్చితాడు అంతే."

"తాదా?" ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీరామ్.

"అవును దాన్ని ఇచ్చిన బాబాకి ఎలాంటి శక్తులూ, మహిమలూ లేవు. అసలు అతను బాబాయే కాదు...అతని పేరు రసూల్ ఖాన్ పూర్వం మా ఇంట్లో డ్రైవర్ గా పనిచేసేవాడు చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని పెంచాడు పెద్దవాడై చూపు తగ్గటంతో మా దగ్గర పని మానేశాడు. నీలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించటానికీ నీకు ధైర్యాన్ని నూరిపోసి, నీ శక్తియుక్తల పట్ల నమ్మకం కలిగేలా చేయటానికే, అతనితో కలిసి, ఆ రోజు అలా నాటకం ఆడాను.

నిన్ను నావాడిగా దక్కించుకోగలిగాను."

"మరి...ఆరోజు రోడ్డు మీద పర్సు పారేసుకున్న రౌడీలను నువ్వు కొట్టడం....అంటూ అడగబోతూంటే, అశ్విని మధ్యలోనే కల్పించుకుంటూ చెప్పింది.

"అదీ ద్రామాయే! ఆ కుర్రాళ్ళు మా డాడీ కంపెనీలో పనిచేసే వర్కర్లు. నిన్ను నావైపు తిప్పుకోవటానికి అలా, వాళ్ళను కూడా ఉపయోగించుకున్నాను...అఫ్కోర్స్...నాకు కరాటే వచ్చుననుకో!"

శ్రీరామ్ ఆమె వైపు విష్మయంగా చూశాడు.