సిల్లీ ఫెలో - 92

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 92

- మల్లిక్

 

"ఓ... అయితే మీ ఆఫీసును కొత్త బిల్డింగ్ లోకి షిఫ్టింగ్స్ సేస్తావుంటే దాన్ని ఓపెనింగ్స్ సెయ్యడానికి నన్ను పిలుస్తా వుండారు అవునా? కులాసాగా అడిగాడు మినిస్టర్ మిన్నారావు.

నటరాజన్ మిన్నారావు అన్నదానికి సమాధానం చెప్పకుండా మొహం చిట్లిస్తూ ముక్కు మూస్కున్నాడు.

అది చూసి మినిస్టర్ మిన్నారావు మొహం చిట్లించాడు.

"ఏందయ్యోవ్... నేను మాట్లాడ్తా వుంటే ముక్కు చూస్కుంటా వుండడానికి అంత కంపు కొట్టడానికి నేనేమయినా పళ్ళు తోముకోని పాచీ పళ్ళవాడిననుకున్నావా? నేను క్లోజప్ టూత్ పేస్ట్ తో పళ్ళను రుద్ది రుద్ది తోముకుంటాం కావాలంటే మొహంమీద మొహమెట్టు.... హా - హా అంటా! నీకే తెలుసుద్ది."

నటరాజన్ చెంపలు వాయించుకున్నాడు.

"హయ్యో హయ్యో! లేదప్పా నీది నోరు కంపు అని నాన్ దా ఎట్లు సొల్లుదును? ఇక్కడ ఎలక సచ్చిన వాసన మాదిరి వస్తా వుండాది... ఏంది మురుగా అని అలోసిస్తా వుంటిని."

మినిస్టర్ మిన్నారావు పకపకా నవ్వాడు.

"మీరు భలేవారండీ బాబూ! అది ఎలక సచ్చిన వాసన కాదు. మాయావిడ ఉప్పుసేపల కూర సేత్తావుంది. ఈ కమ్మటి వాసన దాందే. ఆ కూరంటే నాకెంతో ఇష్టం!" లొట్టలు వేసాడు మినిస్టర్ మిన్నారావు.

"హా! మురుగా!" మనసులోనే అనుకున్నాడు నటరాజన్.

"ఇంతకీ తమరొచ్చిన పని గురించే సెప్పలేదు... ఓపెనింగ్స్ కదూ!" అడిగాడు మిన్నారావు.

"ఓపెనింగ్స్ ఇల్లే" అన్నాడు నటరాజన్.

"ఓహో ఇంటిని ఓపెనింగ్స్ చెయ్యాలా! అట్టాగే... దాందేముంది?" సంతోషంగా అన్నాడు మిన్నారావు.

"ఇల్లే... ఇల్లే... ఓపెనింగ్ ఇల్లే అంటే లేదు... ఓపెనింగ్ లేదు అనిదా" కంగారుగా అన్నాడు నటరాజన్.

"మరి?"

"నాన్ దా డిప్పూటి జనరల్ మేనేజర్ పోస్టులేదా వుంటిని! నాకు జనరల్ మేనేజర్ పోస్టుకు ప్రమోషన్ కావలెను."

"చాల్చాల్లెవయ్యా?" విసుగ్గా అన్నాడు మిన్నారావు.

"అమా... తమరి జేబులోదా ఇరికి!" అన్నాడు నటరాజన్.

"ఎలా ఇరికి?" పళ్ళు కొరుకుతూ అడిగాడు మిన్నారావు.

"సెప్తును.... సెప్తును"

నటరాజన్ చేతిలోని హ్యాండ్ బ్యాగ్ తెరచి అందులోంచి పాత న్యూస్ పేపర్ ఒకదాన్ని తీసి "ఇది సూడప్పా!" అన్నాడు.

మినిస్టర్ మిన్నారావు గుండెలు దడదడలాడాయ్?

"ఏందది? అడిగాడు.

"సూడప్పా.... నీకే తెలియును"

మినిస్టర్ మిన్నారావు ఆ న్యూస్ పేపర్ ని అందుకున్నాడు. దాన్ని చూడకుండానే అర్థమయిపోయింది అది రాజేంద్ర హత్యకి సంబంధించిన వార్త పడిన న్యూస్ పేపర్ అని.

"కెవ్ వ్ వ్!"

గట్టిగా అరిచాడు మినిస్టర్ మిన్నారావు.

*         *             *