సిల్లీ ఫెలో - 2

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 2

 

- మల్లిక్

 

లత బెదురుగా ఏకాంబరం దగ్గరికి వెళ్ళింది.

"నీ చెవి ఇటు పారెయ్!" అన్నాడు ఏకాంబరం.

లత ముందుకు వంగింది.

"కిల్లారి కిత్తి అంటే..." అంటూ చెవిలో గుసగుసలాడ్తూ చెప్పాడు.

అతను చెప్పగానే లత మొహం కత్తివాటుకి నెత్తురు చుక్కలేనట్టుగా పాలిపోయింది. క్షణాల్లో ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది. నోట్లో చీర కొంగు దోపుకుని క్యాబిన్ లోంచి బయటకి రివ్వుమని పరుగుతీసింది.

బుచ్చిబాబు హుతాశుడయ్యాడు.

లతకు అంత దుఃఖం తెప్పించిన "కిల్లారి కిత్తి" అంటే ఏంటి?

ఏంటి? ఏంటి? ఏంటి?

సస్పెన్స్ భరించలేక మెల్లగా భయపడుతూనే ఏకాంబరాన్ని అడిగేశాడు బుచ్చిబాబు.

"కిల్లారి కిత్తి అంటే ఏంటి సార్"

"అది నువ్వడకూడదు నేను చెప్పకూడదు. అయినా వేరే వాళ్ళ విషయాల్లో తల దూరుస్తావేం. ముందు నీ విషయం చూస్కో టింగాల టిస్కీ!" అన్నాడు ఏకాంబరం సీరియస్ గా.

"అంటే ఏంటి సార్?"

"అర్థాలడక్కు... చెప్తే ఇక్కడ పొర్లి ఏడుస్తావ్. ఆఫీస్ అట్మాస్ఫియర్ పాడై పోతుంది."

అంతలో హెడ్ క్లర్క్ సదాశివం లోపలికొచ్చి ఓ ఫైలు తెచ్చి ఏకాంబరం ముందు పెట్టాడు.

ఫైలు మీద నోటింగ్ చదివిన ఏకాంబరం సదాశివంతో "డింగాల డిప్పి" అన్నాడు.

"ఏంటి సార్.. నేను రాసిన నోటింగ్ బాగాలేదా?" భయం భయంగా అడిగాడు సదాశివం.

ఏకాంబరం పకపకా నవ్వాడు.

"బాగుందయ్యా బాబూ... బ్రహ్మాండంగా రాసావ్. అందుకే డింగాల డిప్పి" అని నిన్ను పొగిడాను" అన్నాడు కులాసాగా కాళ్లూగిస్తూ.

"డింగాల డిప్పి అంటే ఏంటి సార్?" సంతోషంగా అడిగాడు సదాశివం.

"అర్థాలడక్కు. వెళ్ళి నీ పని చూస్కో" అంతలోనే సీరియస్ గా మొహం పెడ్తూ అన్నాడు ఏకాంబరం.

మేనేజర్ అర్థం కాని పదమైనా తనని డింగాల డిప్పి అని పొగిడినందుకు సంతోషంగా క్యాబిన్ బయటకి వెళ్ళిపోయాడు.

ఏకాంబరం బుచ్చిబాబు వంక తిరిగాడు.

"ఇందాకట్నుండీ చూస్తున్నా... అసలు నువ్వెందుకొచ్చావో చెప్పవేం?" అడిగాడు.

"అంటే నేను ఇందాకే చెప్దామనుకున్నానుగానీ ఇంతలోనే మీరు వాళ్ళని విచిత్ర తిట్లతోనూ, పొగడ్తలతోనూ ముంచెత్తుతుంటే సిల్లీగా వింటూ వున్నా సార్! అన్నాడు బుచ్చిబాబు వినయంగా.

"సరే ఏం పని మీదొచ్చావో చెప్పు"

"నాకు త్వరగా వెళ్ళడానికి పర్మిషన్ కావాలి సార్"

"వీల్లేదు... వీల్లేదు గాక వీల్లేదు!"

"సార్... మా నాన్నమ్మకి ఒంట్లో బాలేదు సార్... ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి!!" దీనంగా మొహంపెట్టి అన్నాడు బుచ్చిబాబు.

"నిజమేనా? అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు ఏకాంబరం.

"నిజమే సార్! మా నాయనమ్మ మీద ఒట్టు! మా నాయనమ్మంటే నాకు చాలా ఇష్టం సార్... నే చెప్పేది అబద్దం అయితే మా నాయనమ్మ మీద సిల్లీగా ఒట్టేస్తానా సార్?" బుచ్చిబాబు గొంతు జీరపోయింది.

"సరే... సరే... నువ్వెళ్ళు... కానీ ఎప్పుడైనా అర్జంటు పని వుండి కాస్త ఆలస్యంగా కూర్చోమంటే అప్పుడు మొహం మాడ్చుకోకూడదు."

"అలాగే సార్! అంటూ బుచ్చిబాబు అక్కడే నిలబడి వున్నాడు.

"ఇంకా వున్నావేం?" అడిగాడు ఏకాంబరం.

"చిన్న డౌట్ సార్"