TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Comedy Audio Serial
(1)(1).png)
15 భాగం
" ఆ గొంతు వినిపించగానే ఆప్రయత్నంగా శివుడు శీర్షాసనం నుంచి డామ్మని నేలమీద పడిపోయాడు. ఆ గొంతుకి అంత పవరుంది. ఆ గొంతు పంకజానిదే ! అదే గొంతు! మాయగొంతు. మనిషిని నిలువుగా దగచేసే గొంతు. అతి ప్రయాసపడి ;లేచి కూర్చున్నాడు. ఆ తరువాత కూచునే పద్మాసనం వేశాడు. మహర్షి అయిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
" తలుపు తీయరూ " బయటి నుంచి ప్రాదేయత.
" తీయను. ఈ మెదలోకి ఆడవాళ్ళు రావటం నిషేధం " అన్నాడు శివుడు ఒక్కొమాట తుంచితుంచి మాటాడుతూ.
" ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి ?"
" ఆడవాళ్ళ మాటలు మేము వినిపించుకోము "
" అంతేనా "
అంతే...మంచీ మర్యాద ఉన్న మనిషివైతే వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళాలి. అవుట్ అయ్ సే లీవ్ ది హవుస్ " అంటూ బిగ్గరగా అరిచాడు. అలా అరిచి ఆయాసం రాగా రోప్పుతున్నాడు. క్షణం తరువాత తలుపు అవతలి నుంచి నిట్టూర్పు, చిరునవ్వుల శబ్దం వల్ల అక్కడి నుంచి మనిషి కదిలినట్టు అర్థమైంది.
ఆ శబ్దం క్రమక్రమంగా దూరమవడం వల్ల వెళ్ళిపోతున్నట్టు తెలిసింది.మళ్ళీ శబ్దం. వచ్చిన మనిషి వెళ్ళిపోయినట్టు నిర్థారణ చేసుకున్నాడు. పద్మాసనం నుంచి తెప్పరిల్లేడు. లేచేడు.తలుపు దగ్గరికి వచ్చి తలుపు మీద చెవి పెట్టి క్షణం గడిపాడు. అ పిదవ తలుపు తెరిచాడు. అక్కడ ఎవరూ లేరు. గట్టిగా నిట్టూర్పు విడిచాడు. తిరిగి గదిలోకి వెళ్ళపోతూ తలుపుమీద కొత్త దృశ్యం చూసి ఆగిపోయాడు.
ఆ తలుపు మీద భగవాన్ హనుమాన్ గుండెల్లో మునుపు సీతలేని శ్రీరామపట్టాభిషేకం బొమ్మ వుండాలి. అయితే ఇప్పుడు ఆ స్థానంలో వరూధినీ ప్రవరాఖ్యులున్నారు. పంకజం, శివుడు ఆ వేషాల్లో కౌగలించుకుని వున్నారు. దానికింద వరూధినీ ప్రవరాఖ్యు అని రాసి వుంది. అదంతా తన భ్రమ అనుకున్నాడు. కళ్ళు నులుముకుని మరీ చూసాడు. అదే దృశ్యం వరూధినీ ప్రవరాఖ్యు. వెంటనే చేత్తో తడిమేడు. అప్పుడే అంటించిన ఫోటో అని తెలిసిపోయింది. ఆ ఫోటోని లాగేశాడు. సీత లేని శ్రీరామపట్టాభిషేకం నిక్షేపంగా కనిపిస్తుంది ఇప్పుడు. తృప్తిగా నిట్టూర్చాడు.
అయితే తన చేతిలో ఉన్న ఫోటో చూడగానే వెంటనే శివుడి కళ్ళు నిప్పుల వర్షం కురిసేయి. అంటే...వచ్చి వెళ్ళిన ఆడది నూటికి నూరుపాళ్ళు పంకజమే. సినిమా వాల్ పోస్టర్లు అంటించినట్టు ఫోటోలు తలుపులకు అంటించి ఆడుకుందామని ఆరాటపడుతుంది పంకజం. ఈ ఆటకి తగిన శిక్ష విధించాలి. పంకజం అంటూ పళ్ళు పటపట కొరికాడు.
" నన్ను సాధించాలని చూస్తున్నావు కదూ...అది నీతరం కాదు " అని ఆ ఫోటోని ఎంతో కసిగా నాలుగు ముక్కలు చేసి కిటికిలోంచి కిందకి పారేశాడు. దూరంగా వున్నా చర్చీలో ముసలి డేవిడ్ గంట స్థంభం మేట్లేక్కెడు. గంటని పట్టుకుని గంటలు కొడుతున్నాడు. డేవిడ్ రిటైర్డ్ మిలట్రీ మనిషి. సర్వీసులో వుండగా బుల్లెట్ల వర్షం కురిపించాడు. రిటైరైన తర్వాత గంటలు కొడుతున్నాడు.
ఉదయం తొమ్మిది. బూజులు అనబడే శివుడి తమ్ముడు కిష్ణుడు కాలేజీకి వెళ్లేందుకు ఇంటిముందు సైకిల్ ఎక్కబోతుండగా అతని నెత్తిమీద ఫోటో ముక్కలు నాలుగూ నాలుగు ఆక్షింతల్లా పడ్డాయి. అది అన్నయ్య పూజ గది తాలుకూ కిటికీ. అనగా...ఆ ఫోటోని నాలుగు ముక్కలుచేసి పారేసిన కిందకు వ్యక్తి కేవలం అన్నయే! ఇంతకీ ఏమిటా ఫోటో! కృష్ణ అనబడే బుజ్జులు ఆ నాలుగుముక్కలూ ఏరి జతచేసి చూసేడు. ఆ దృశ్యం చూడగానే కిష్ణుడు నిశ్చేష్టుడయిపోయేడు.
ప్రవరాఖ్యుడి వేషంలో అన్నయ్య ఎంతో అందంగా వున్నాడు. అన్నయ్య పక్కన ఆ సుందరి ఎవరోగాని అప్సరసకి ఏ మాత్రం తీసిపోదు.ఆమె వరూధుని. అంతవరకూ బాగానే వుంది. అయితే దూరదూరంగా వుండాల్సిన వరూధినీ ప్రవరాఖ్యులు కౌగిలింతలో పరవశించడం ఏమిటో కిష్ణుడికి అతం కాలేదు. ముఖ్యంగా ఆడగాలి సహించని అన్నయ్య ఆడపిల్లతో నాటకమా? అందునా కథ అడ్డం తిప్పే ప్రయత్నంలో కౌగిలింతా? ఏమిటీ వింత? అసలీ ఫోటో అన్నయ్య దగ్గరికి ఎట్లా వచ్చింది? ఎవరు తెచ్చేరు ? ఎందుకు తెచ్చేరు ?"
" అన్నయ్యా నిన్నెవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ' అనుకున్నాడు ఆ ఫోటోలోకి చూస్తూ. సీజర్ మొరగడంతో కిష్ణుడు సర్దుకున్నాడు. ఆ ఫోటో ముక్కల్ని నోట్స్ పుస్తకంలో దాచేసి సైకల్ నడిపిస్తున్నాడు. అదే సమయంలో గజ్జల గుర్రంలాగా, ఎదురింటి నుడి వసుంధర జోరుగా సైకిల్ మీద వస్తూ కిష్ణుడు సైకిలుని డీ కొట్టింది.
సరిగ్గా పంకజం వాళ్ళ గేటుముందు రెండు సైకిళ్ళు పడిపోయి. కిష్ణుడు, వసుంధరా చెరోపక్కా పడ్డాడు. " యూ బ్లయిడ్ ఫూల్ ! డర్టీ స్కౌంద్రల్ !ఇడియట్ " అంటూ ఇంగ్లీషులో సహస్ర నామార్చన చేస్తుంది వసుంధర.
అదే మగాడయితే కిష్ణుడు కుస్తీ పట్టేసి దవడ పళ్ళు రాలగోట్టేవాడు. ఆడపిల్ల గనక కనీసం చెయ్యికూడా ఎత్తలేదు. మౌనంగా లేచి నిలబడ్డాడు. బట్టలమీద దుమ్ము దులుపుకున్నాడు.
సైకిల్ నిలబెట్టుకున్నాడు. వసుంధర ఇప్పుడు తెలుగులో అంటుంది " కళ్ళు నెత్తిమీద పెట్టుకున్నావా! ఒక ఆడపిల్ల సైకిల్ కి డ్యాష్ కొడితే హీరోయిజం అనుకున్నావా? సిగ్గులేదు? నిన్నే అడుగుతుంది. గుడ్డితనంతోపాటు చెవుడు కూడా వుందా ? లేక సమాధానం చెప్పడానికి నోరులేదా " అంటూ ఇంకా ఏ ఏ లోపాలు అంటగట్టేదో కాని ఆ వేళకి అక్కడికి పంకజం రానే వచ్చింది.
" బేబీ " అని మందలింపు ధోరణీలో పిలిచింది. అప్పుడే ఆమెను చూసేడు కిష్ణుడు. తల తిరిగినంత పనైంది. అన్నయ్య ఫోటోలో వరూధిని! సాక్షాత్తూ ఈమె! ఆలోచనలు అదుపులేకుండా వస్తున్నాయి.
ఏవేవో ఆలోచనలు ఒకదానికీ మరొకదానికీ సంబంధమే లేదు.
|
|