Sametalalo Telugu Cinemalu

Sametalalo Telugu Cinemalu

సామెతలలో తెలుగు సినిమాలు

ఈ మధ్య కాలంలో రిలీజైన సినిమా పేర్లను పరిశీలన చేస్తే అందులో కొన్ని

సామెతలతో కూడిన సినిమాల పేర్లు ఉండటం నేను గమనించాను. అవి ఏమిటో

ఇప్పుడు మనం చూద్దాం ! అందరం సరదాగా నవ్వుకోవడానికే తప్ప మరెవరినీ

కించపరచడానికి కాదు అని మనవి చేసుకుంటూ సామెతలలో తెలుగు

సినిమాలు అంటూ మీ ముందుకురావడం జరుగుతుంది. దీని మీద మీ

అభిప్రాయం తెలియజేస్తారని ఆశీస్తూ మీ తెలుగువన్.కామ్/కామెడీ.

 

* ఆది లోనే హంసపాదు

* ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తుడు

* అతి రహస్యం బట్టబయలు

* ఇంటిగుట్టు లంకకు చేటు

* వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి

* నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు

* గోరంతదీపం కొండంత వెలుగు

* వానరాక, ప్రాణం పోక తెలీదు

* ఆరాటమే గానీ పోరాటం లేదు

* ఇంటిదొంగను ఈశ్వరుడైన పట్టలేదు

* ఎవరిపిచ్చి వారికి ఆనందం

* ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి

* అదృష్టం అందలమెక్కిస్తే, బుద్ది బురదలోకి లాక్కెళ్ళింది

* తనకోపమే తన శత్రువు

* దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వనట్టు

* ఏరు ఎన్ని వంకలు పోయినా, సముద్రంలోనే పడ్డట్టు

* ధైర్యంలేని రాజు, యోచన లేని మంత్రి

* సంసారం గుట్టు వ్యాధి రట్టు

రచన - శాగంటి నర్సింగరావు