Rating:             Avg Rating:       472 Ratings (Avg 2.83)

Pelli Chupullo Paatalu Padite

Pelli Chupullo Paatalu Padite

పెళ్లి చూపుల్లో పాటలు పాడితే

 

మా ప్రెండ్ మౌనికకు పెళ్లి జరుగుతున్నాయి ఆ రోజు.

మగపెళ్ళివారు " అమ్మాయి..నీకు పాటలు పాడటం వచ్చా ? " అని అడిగాడు.

" వచ్చండీ....." అని తలెత్తకుండా చెప్పింది మౌనిక.

" అయితే ఒక పాట పాడు " అని అన్నారు మగపెళ్ళివారు.

" అమ్మో ! నకు భలే సిగ్గు......మీరంతా బయటకు వెళ్తేనే పాడుతాను " అని కాస్త

సిగ్గుపడుతూ చెప్పింది మౌనిక.

" పరువాలేదమ్మా...మేమంతా బయటికి వెళ్ళామానుకొని పాడు లేదా కళ్ళుమూసుకొని

పాడు " అన్నారు మగపెళ్ళివారు.

" మీరు బయటికి వెళ్తేనే పాడతాను " అని ఖచ్చితంగా చెప్పింది మౌనిక.

ఇంతలో నేను కల్పించుకొని " మౌనిక...ముందు నువ్వు పాట మొదలు పెట్టవే ! ఆ

తరువాత వాళ్ళే బయటికి పారిపోతారు " అని పకపక నవ్వుతూ అక్కడి నుండి

పరుగులు తీశాను.