సిల్లీ ఫెలో - 87

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 87

- మల్లిక్

 

"అడిగే అవసరం కలిగింది కనుకనే అడుగుతున్నాను. రాత్ర్హి నువ్వు చేసినపనే నన్నీ ప్రశ్నని అడిగిస్తుంది.

బుచ్చిబాబు తేలిగ్గా నవ్వేశాడు.

"ఓ.. అదా నీ భయం? నేనెవరికీ చెప్పనులే... నువ్వేం భయపడకు."

"నాకేం భయంలేదు! నువ్వు ఎవరికీ చెప్పకపోవడం కాదు..." అందరికీ చెప్పడమే నాక్కావాలి" ఒక్కక్క పదాన్ని పట్టి పట్టి అంది సీత.

బుచ్చిబాబు తెల్లమొహం వేసుకుని సీతవంక చూశాడు. రెండు క్షణాల తరువాత తేరుకుని ఇలా అన్నాడు.

"అయినా ఆఫీసులో నీ గురించి చెప్పడానికి సందర్భం అంటూ రావాలికదా!"

"సందర్భం వచ్చినప్పుడన్నా నా గురించి ఏం చెప్తావ్" నిలదీసి అడిగింది సీత.

"ఆ టైంరానీ.... అప్పుడు చూద్దాం!"

"అంటే నా గురించి ఏం చెప్పాలన్నది నువ్వు నిర్ణయించుకోలేదా?" నీకు మనమున్న సిచ్యుయేషన్ గురించి అభిప్రాయం ఏమీలేదా? కనీసం నీ మోహన్ తో ఆ సందర్బం వచ్చి ఉండాలే... మరి మోహన్ కి నా గురించి ఏమని చెప్పావ్?"

"ఏమీ చెప్పలేదు"

"మోహన్ నేను నువ్వు తాళికట్టిన భార్యవని అనుకుంటున్నాడు. అతను అలా అనుకుంటే అనుకోనివ్వమని నువ్వనుకున్నావు కన్వీనియంట్ గా, అంతేగానీ సీత నా భార్య కాదు. ఫెండ్ అని చెప్పావా?"

"అలా పనిగట్టుకుని చెప్తే నీ కిష్టం లేదేమోనని...." గొణిగాడు బుచ్చిబాబు.

"పెళ్ళి కాకుండా అది ఇష్టంలేదు. కానీ నిన్నరాత్రి నువ్వాగావా?" అతని మొహంలో సూటిగా చూస్తూ ప్రశ్నించింది సీత.

బుచ్చిబాబు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా వుండిపోయాడు.

"నా తో ఆపని చెయ్యడానికి నీకు ధైర్యం అక్కర్లేదు కానీ పెళ్ళి చేసుకోకుండా నాతో కాపురం పెట్టానని అందరికీ చెప్పడానికి నీకు ధైర్యం కావాలి. అది నీకు లేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు సుందర్ ని చూసి నువ్వు..."

"నాకెందుకు ధైర్యం లేదు. ఏదో ముందుతరాలవారికి ఆదర్శం కావాలనీ, ప్రేమైక సామ్రాజ్యం నిర్మించాలనీ అనుకుంటున్నావుగానీ దానికి చాలా గుండె ధైర్యం కావాలి?"

"నాకా ధైర్యం వుంది!

"అలాగయితే మన రిలేషన్ గురించి అందరికీ ధైర్యంగా చెప్పు... ఆ తరువాత ఎదురయ్యే పరిస్థితుల్ని కూడా ధైర్యంగా ఎదుర్కో.... అప్పుడు నిన్ను నేను మెచ్చుకుంటా"

ఖచ్చితంగా కుండ బద్దలుకొట్టినట్లుగా చెప్పింది సీత.


*             *           *

ఆరోజు నిద్ర లేవగానే బుచ్చిబాబు చాలా హుషారుగా వున్నాడు గానీ సీత అతనిమీద చల్లగా నీళ్ళు కుమ్మరించేసింది.

ఆఫీసుకెళ్ళి డల్ గా తన సీట్లో కూర్చున్నాడు.

ఆలోచించగా సీత చెప్పింది కరెక్టే అనిపించింది బుచ్చిబాబుకి.

నేను ఇంకాస్త ధైర్యం తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఈలోగా ప్యూన్ వచ్చి బాస్ పిలుస్తున్నట్లు చెప్పాడు.

బుచ్చిబాబు ఏకాంబరం క్యాబిన్ లోకి వెళ్ళాడు.

"రావోయ్ రా... నా డింగాల డిప్పీ! నా టింగాల టుంగి" అన్నాడు ఏకాంబరం చిరునవ్వు నవ్వుతూ.

"ఏంటి సార్! మీరిమధ్య నన్ను మరీ ఇదిగా పొగిడేస్తున్నారు," సుగ్గుపడుతూ  అన్నాడు బుచ్చిబాబు.

"మరి పొగడనా? నీ వల్లేగా నాకు ట్రాన్స్ ఫర్ వచ్చింది. అన్నట్టు చెప్పడం మరిచానయ్యోయ్. ఆ కిల్లారి కిత్తిగాడు అదే... ఆ మినిస్టర్ మిన్నారావ్ గాడి దగరికి మా బంధువులబ్బాయ్ ని పంపించాను. మళ్ళీ అదే న్యూస్ పేపరు ఇచ్చి పంపించాను. ఈసారికూడా ఆ ఉపాయం భలే పనిచేసిందయ్యోయ్. దెబ్బకి ఆడికి ప్రమోషనిప్పిస్తానాని చెప్పాట్ట. ఇప్పుడే హైదరాబాద్ నుండి మావాడు ఫోన్ చేసి చెప్పాడు," సంబరంగా అన్నాడు ఏకాంబరం.

బుచ్చిబాబు కంగారుగా ఆయనవంక చూసాడు.