సిల్లీ ఫెలో - 85

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 85

- మల్లిక్

 

"జయ్ య్ య్..."

బుచ్చిబాబు పెట్టిన చారు తాళింపు పెద్దగా శబ్దం వేసింది. అంతకంటే పెద్దగా శబ్దం చేస్తూ బుచ్చిబాబు డజన్ తుమ్ములు తుమ్మాడు ఆ తాళింపు ఘాటుకి.

"నాకైతే ఇన్ని తుమ్ములు వస్తున్నాయి. ఈ ఆడవాళ్ళు దగ్గకుండా తుమ్మకుండా వంటెలా చేస్తారబ్బా!" అనుకున్నాడు బుచ్చిబాబు.

చారు దించేలోగా ప్రక్క స్టవ్ మీద అన్నం కుతకుత ఉడికిపోతూ తెర్లిపోతోంది.

"సీతా.... సీతా...." గావుకేకలు పెట్టాడు బుచ్చిబాబు.

"ఏంటి?" వంటింటి గుమ్మం దగ్గరకొచ్చి చాలా క్యాజువల్ గా అడిగింది సీత.

"నువ్వు కాస్త ఈ అన్నం సంగతి చూడు. నేను చారు సంగతి చూస్తాను" అన్నాడు బుచ్చిబాబు గరిటతో అన్నం కలియబెడ్తూ.

"ఏం? నేను వంట చేస్తున్నప్పుడు నీ హెల్ప్ ఏమైనా అడిగానా? నేనైతే ఒక్కదాన్నే ఒక ప్రక్కన చారు మరుగుతూ మరో ప్రక్క అన్నం ఉడుకుతూ వున్నా కూరగాయలు కూడా తరిగేదాన్ని. నీ ఆదర్శాలకోసం కాసింత కష్టపడితే తప్పేంలేదు. మీ సుందర్ అమెరికాలో అతని జూలీ చెప్పులు కూడా పాలిష్ చేస్తాడని చెప్పాడుగా! మర్చిపోయావా" వ్యంగ్యంగా అనేసి అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోయింది సీత.

బుచ్చిబాబు అన్నం కలుపుతున్న గరిటతో కసిగా నెత్తిన ఠంగ్మంటూ కొట్టుకున్నాడు.

మళ్ళీ బాధగా హబ్బ అనుకున్నాడు.

అతను గరిటతో బుర్రమీద కొట్టుకున్నప్పుడు సరిగ్గా ఏ నరంమీద దెబ్బ తగిలిందో గానీ అతని బుర్రలో బల్బులా ఓ ఆలోచన వెలిగింది.

"అవునూ ఆదర్శం, ఆదర్శం అంటూ వంటపనీ, ఇంటిపనీ అన్నీ చేస్తున్నా గానీ అసలు నేనే ఆదర్శం కోసం ఈ పనులన్నీ చేస్తున్నాను? పెళ్ళికాకుండా సీతతో కాపురం చెయ్యడానికి! వంటపని ఠకీమని మొదలయింది కానీ సీతతో కాపురం మొదలయిందా? కాపురందాకా ఎందుకు? కనీసం ఒక్కసారైనా తృప్తిగా ముద్దుపెట్టుకోనిచ్చిందా? హమ్మ సీతా.. తెలివైనదానివే!" అనుకున్నాడు బుచ్చిబాబు.

అప్పుడే సుందర్ తనతో అన్నమాటలు బుచ్చిబాబుకి గుర్తుకు వచ్చాయి.

"మగవాడి వలె బ్రతుకుము... ఫోర్స్ ఉపయోగించుము"

యస్!

నేను మగాడిని!

సీత చెప్పినదానికి చెవలాయ్ తలూపుతూ ఉపయోగం లేని పన్లు చెయ్యడం శుద్ధ దండగ.

ఈ రాత్రి సీత సంగతి చూడాల్సిందే!

ఆలోచనల్లో మునిగి ఉన్న బుచ్చిబాబు ముక్కు పుటాలకు గ్యాస్  వాసన సోకి స్పృహలోకి వచ్చి కంగారుగా స్టవ్ వంక చూసాడు. అన్నం ఎప్పుడు పొంగిపోయిందో గానీ స్టవ్ ఆరిపోయింది ఉంది.

బుచ్చిబాబు నెత్తి కొట్టుకున్నాడు.


*           *              *

రాత్రి పదకొండు గంటలయింది.

టీవీలో ఏదో సినిమా, అప్పుడే బుచ్చిబాబు సీత మంచం మీద నడుం వాల్చారు. ఆ సినిమా చూసిన తరువాత ఆ ఇద్దరి మనసుల్లో ఎంతో అలజడి చెలరేగింది.

కారణం... ఆ సినిమాలో హీరో, హిరోయిన్ మధ్యన ఇంటిమేట్ సీన్సు రెచ్చగొట్టే విధంగా తీసాడు డైరెక్టర్. బుచ్చిబాబు, సీతా ఎంతో కదిలిపోయారు.

కానీ....

ఇద్దరూ మౌనంగా ఎంతో గంభీరంగా మొహం న్పెట్టి ఆ సినిమా చూసారు.

సినిమా అయిపోయాక టీవీ కట్టేస్తూ "ఏంటోలే చెత్త సినిమా!" అంది సీత.

ఆమె అలా అన్నా కూడా ఆమెకి ఆ సినిమా నచ్చిందని బుచ్చిబాబుకి తెలుసు. అది బుచ్చిబాబుకి తెలుసన్న విషయం సీతకు తెలుసు!

మళ్ళీ మనసుల దొంగాట!

ఆ సమయంలో బుచ్చిబాబు హృదయంలో సుందర్ మాటలు ప్రతిధ్వనించాయి.

"మగవాడి వలె బ్రతుకుము.. ఫోర్స్ ఉపయోగించుము"

అవును... నేను మగవాడిలా బతకాలి! సీతకి వండి పెట్టడానికా నేను హైదరాబాద్ నుండి ట్రాన్సుఫర్ చేయించుకుని ఇంతదూరం వచ్చింది? అనుకున్నాడు.

బుచ్చిబాబు ప్రక్కకి తిరిగి సీత నడుం మీద చెయ్యేశాడు.

సీత కదల్లేదు మెదల్లేదు.

కొన్ని క్షణాలు భారంగా గడిచాయ్.

ఈసారి బుచ్చిబాబు సీత భుజం మీద చెయ్యేసి తనవైపుకి తిప్పుకున్నాడు.

సీత అతని వైపు ఈజీగానే తిరిగిపోయింది.

ఆమె కళ్ళు మూస్కునే వుంది.

బుచ్చిబాబు ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు.

ఆమె కళ్ళు తెరవలేదు.

బుచ్చిబాబు ఆమెని గాఢంగా కౌగలించుకున్నాడు.

అతనిలో ఆవేశం కడలిలోని మహోత్తుంగ తరంగంలా ఎగిసి పడింది.

బుచ్చిబాబు ఇంక ఆగలేకపోయాడు.

కానీ...