సిల్లీ ఫెలో - 65

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 65

- మల్లిక్

 

"సార్! మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు!" ప్యూన్ వచ్చి చెప్పాడు.

బుచ్చిబాబు సీట్లోంచి లేచి మేనేజర్ మంగారావ్ క్యాబిన్ లోకి వెళ్ళాడు.

మంగారావ్ క్యాబిన్ లో అతని స్టెనో లిల్లీకూడా వుంది.

"పిలిచారా సార్!" అడిగాడు బుచ్చిబాబు.

మంగారావ్ లిల్లీకి ఇస్తున్న డిక్టేషన్ ఆపి "నేనా? అబ్బే.. లేదే? ఆ ప్యూన్ నీతో జోక్ చేసి వుంటాడు... అంతే!" అన్నాడు.

"అలాగా సార్! హయ్యో! ఆఫీసులో వాడికివేం సిల్లీ బుద్ధులు? వస్తానండీ".

బుచ్చిబాబు వెనక్కి తిరిగాడు.

"హత్తెరి! ఎక్కడక్యా పోతున్నావ్?" గట్టిగా అరిచాడు మంగారావ్.

బుచ్చిబాబు వెనక్కి తిరిగి అతనివైపు అయోమయంగా చూసాడు.

"లేకపోతే ఆ అడగటం ఏంటయ్యా "పిలిచారా సార్" అని? ఇది ఏమైనా ఆఫీసా లేకపోతే నీ యిల్లా వట్టినే జోక్ చేయడానికి... పిలిచారా అని కాదు.  "ఎందుకు పిలిచారు సార్ అని అడగాలి."

లిల్లీ కిసుక్కున నవ్వింది.

బుచ్చిబాబు ఓసారి లిల్లీ వంక చిరాకుగా చూసి "సారీ సర్. ఎందుకు సార్ పిలిచారు?" అంది అడిగాడు.

"ఎందుకా? ఈ ఫైలేంటి. ఈ డ్రాప్టింగేంటి? హత్తెరి! దీన్ని చొసి నా దగ్గరికి ఒక్క కస్టమర్ కూడా రాని ర్లు ఎంత బాధ పడతానో అంత బాధపడ్డాను" సీరియస్ గా చూస్తూ అన్నాడు మంగారావ్.

లిల్లీ మళ్ళీ కిసుక్కున నవ్వింది.

బుచ్చిబాబుకి మండింది గాని కంట్రోల్ చేసుకున్నాడు.

"ఏమైంది సార్?" మెల్లగా అడిగాడు.

"ఎవరికీ? నాకా? ఫైలుకా? నాకైతే నీ ఫైలు చూడగానే వెర్రెక్కింది. హత్తెరి! అదేం డ్రాప్టింగోయ్ బుచ్చిబాబూ! ఖాళీ జేబుల్తో వచ్చిన కస్టమర్లంతా దరిద్రంగా వుంది."

"మరీ అంత సిల్లీగా వుందా సార్? బుర్రగోక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు.

"సిల్లీగా కాదు. పరమ దరిద్రంగా వుంది. విసిరేశాడు మేనేజర్ మంగారావ్.

లిల్లీ కిసకిసా నవ్వింది.

బుచ్చిబాబుకి చాలా అవమానంగా అనిపించింది. ఓసారి లిల్లీ వంక సీరియస్ గా చూసి నేలమీద ఫైలు తీసుకుని క్యాబిన్ బయటకి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.

బుచ్చిబాబు మూడ్ అంతా పాడయింది. అసలే రాత్రి జరిగిన సంఘటనకి అతని మనసు బాగాలేదు.

తను యే ఆశయంతో విజయవాడకి ట్రాన్స్ ఫర్ చేయించుకుని వచ్చాడు? సీత తనని ఆలు ప్రక్కన కూడా పడుకోనివ్వకుండా కనీసం ముద్దుకూడా పెట్టుకోనివ్వకపోతే తన ఆశయాన్ని సాధించేది ఎలా?

రాత్రి సీత తోసిన తోపుకి నడ్డి అదిరిపోయింది. కాస్తలో సంసారానికి పనికిరాకుండా పోయి ఉండేవాడు.

అసలే మనసు బాగోపోతే ఈ హత్తెరిగాడు ఒకడు!

అయినా లిల్లీ చీటికిమాటికి సిల్లీగా అలా ఎందుకు నవ్వుతుంది? దాని పని పట్టాల్సిందే!