సిల్లీ ఫెలో - 64

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 64

- మల్లిక్

 

సీత బుచ్చిబాబు ప్రక్కన పడుకోలేదు. గడిమూల వున్న చాప చుట్ట తీసుకుని బయటకి నడవసాగింది.

"ఏయ్.. ఎక్కడికెళుతున్నావ్ సిల్లీగా?" గట్టిగా అరిచాడు బుచ్చిబాబు మంచంమీద లేచి కూర్చుంటూ.

"నేను హాల్లో పడుకుంటా" చెప్పింది సీత.

"హాల్లోనా? ఎందుకు?"

"ఎందుకంటే? ఇక్కడ నీ ప్రక్కన ఎలా పడుకుంటాను?"

"నిన్నయితే మనం అర్ధరాత్రి ఊర్నుండి వచ్చి అలసిపోయి ఏదో విడివిడిగా పడుకున్నాంగానీ ఈవేళ కూడా సిల్లీగా విడివిడిగా పడుకుంటామా?"

"ఏమో బాబు నాకు తెలియదు. నేను బయటే పడుకుంటా."

"రెండడుగులు ముందుకేసింది సీత.

బుచ్చిబాబు మంచం మీద నుండి క్రిందికి ఒక్క గెంతు గెంతి సీత చేతిలోని చాప లాక్కుని దూరంగా విసిరేసి సీతని రెండు చేతులహ్తో పైకెత్తి మంచం మీద పడేసాడు.

సీత కెవ్వుమని అరిచింది.

బుచ్చిబాబు మంచం మీదకి ఎగిరి సీత ప్రక్కన పడుకున్నాడు.

"నేను ట్రాన్స్ ఫర్ చేయించుకుని, నువ్వేమో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చింది మనం విడివిడిగా పడుకోవడానికా?" సీత నడుం చుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు బుచ్చిబాబు.

"పెళ్ళి కాకుండా ఇలా నీ ప్రక్కన ఎలా పడుకుంటాను?" బుచ్చిబాబు గుండెల మీద చెయ్యివేసి వెనక్కి తోస్తూ అంది సీత.

"హబ్బ! నీ లాంటి సిల్లీ ఆడదాన్ని నా జీవితంలో ఎక్కడా చూళ్లేదు!" తలకాయ పట్టుకుని బాధగా అన్నాడు.

"సరే... నేను పడుకుంటానుగానీ నువ్వు పిచ్చివేషాలు ఏమీ వెయ్యకూదు."

బుచ్చిబాబు భారంగా నిట్టూర్చి మంచం ప్రక్కనే వున్న స్విచ్ నొక్కి లైట్ ఆర్పేసాడు.

అయిదు నిమిషాలు మౌనంగా గడిపారు ఇద్దరూ.

"సీతా.. నిద్రపోతున్నావా?" మెల్లగా అడిగాడు బుచ్చిబాబు.

"ఊ..." అంది సీత.

బుచ్చిబాబు హఠాత్తుగా సీతని దగ్గరకు లాక్కుని పెదాలమీద ముద్దు పెట్టుకున్నాడు.

అప్పుడు బుచ్చిబాబు ఊహించని సంఘటన జరిగింది.

సీత అతని ఛాతిమీద రెండు చేతులూ పెట్టి బలంగా తోసినతోపుకి బుచ్చిబాబు మంచంమీద నుండి నేలమీద ధబెల్ మని పడ్డాడు.