సిల్లీ ఫెలో - 29

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 29

- మల్లిక్

 

"రావోయ్ రా... ఏంటీ కాళ్ళీడ్చుకుంటూ అడుగులో అడుగేసుకుంటూ వస్తున్నావ్. మళ్ళి శలవో,లేకపొతే పర్మిషనో కావాలా?" తన క్యాబిన్ లోకి వచ్చిన బుచ్సిబాబుతో అన్నాడు ఏకాంబరం.

బుచ్చిబాబు గతుక్కుమన్నాడు. కిల్లారి కిత్తిగాడు మనసులోవున్నది ఎలా కనిపెట్టేస్తాడో ఏంటో!... అనుకున్నాడు.

"ఏంటీ? మనసులో వున్నది ఎలా కనిపెట్టేశానా అని ఆశ్చర్యపోతున్నావా? లింగాల చింగీ?"

"అబ్బే... నోనోనో... లా నేనెందుకు అనుకుంటాను సార్ సేల్లీగా!" కంగారుగా అన్నాడు బుచ్చిబాబు.

"ఓహో! అలా అనుకోవడం లేదా.... మరి ఏం అనుకున్నావు? మనసులో ఏముందో తెలుసుకోలేని లిప్పాలటిప్పిని అనుకున్నావా?" కళ్ళు ఎగరేశాడు ఏకాంబరం.

"అబ్బే అలా అనుకోవడం లేదు సార్. మీరు ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టేస్తారని అనుకున్నాసార్"

"అలారా దారికి... ఇంతకీ క్యాబిన్ లోకి ఒట్టి చేతులు ఊగించుకుంటూ వచ్చావ్ ఏంటి కత?"

"అదీ... అదీ..." బుర్రగోక్కున్నాడు బుచ్చిబాబు. "రెండు రోజులు శలవు కావాలండి. మద్రాసు నుంచి నా క్లోజ్ ఫ్రెండ్ వస్తున్నాడు" మెల్లగా అన్నాడు.

"నిన్నేమో నాక్కాబోయే ఆవిడతో షాపింగండీ... గంట పర్మిషన్ కావాలని అన్నావు కదా అని సరే అన్నాను. ఈ వేళేమో మద్రాసు నుండి ఫ్రెండొస్తున్నాడు అని రెండు రోజులు శలవడిగావు. తర్వాత బొబ్బర్లంక నుండి మరో ఫ్రెండ్ వస్తాడు అప్పుడు నాలుగు రోజులు శలవు కావాలని అంటావు... నోనోనో"

"మద్రాసు అంటే మద్రాసు అని కాదండీ. స్టేట్స్ నుండి ఈ వేళ మద్రాసు వచ్చాడు. రేపు మద్రాసు నుండి ఇక్కడికి వస్తున్నాడు సార్..."

"ఏంటీ... స్టేట్స్ నుండా? మరి చెప్పావు కావేమోయ్?"

"అవును సార్... స్టేట్స్ నుండే. వాడు మూడేళ్ళ క్రితం స్టేట్స్ కి వెళ్ళాడు. అప్పటి నుండి వాడు ఇండియాకి రాలేదండీ. వాడిని చూసి మూడు సంవత్సరాలు అయింది కదా అని వాడితో గడపటానికి సెలవు పెడుతున్నాను సార్. అంతేగానీ బొబ్బర్లంక నుండీ, లంకలకోడేరు నుండి చీటికి మాటికీ వచ్చేవారి గురించి సెలవు పెడ్తానా సార్?"

బుక్చిబాబు నీళ్ళు నమిలాడు.

"నిజమేనోయ్. అంత దూరం నుండి క్లోజ్ ఫ్రెండ్ వస్తుంటే సెలవు పెట్టకపోతే ఎలా? మళ్ళీ అతను నిన్ను కిల్లారికిత్తిగాడని అనుకుంటాడు. నీకు సెలవు ఇవ్వనందుకు నన్ను లబ్బీలగబ్బు అనుకుంటాడు. సరే సరే... వెళ్ళు వెళ్ళు... ఒకవేళ అతనిథిఒ నాలుగు రోజులు గడపాలనుకుంటే నాలుగు రోజులు సెలవు పెట్టు.. మరేం పర్లేదు!"

"అలాగే సార్... థాంక్యూ సార్" బుచ్చిబాబు వెనక్కి తిరిగాడు.

"ఆగవోయ్"

బుచ్చిబాబు ఆగి వెనక్కి తిరిగాడు.

"మీ ఫ్రెండ్స్ స్టేట్స్ నుండి మంచి స్ప్రేలు తెచ్చి నీకిస్తే అవితెచ్చి నాకివ్వు" ఇకిలిస్తూ అన్నాడు ఏకాంబరం. "అలాగే సార్" అన్నాడు బుచ్చిబాబు.

"మనసులో మాత్రం "ఓరి ముసలి లబ్బీలగబ్బూ... నీకు సెంట్లూ, స్ప్రేలూ కావాల్సి వచ్చాయా? నేనింకా నా సీతకి ఇద్దామని అనుకున్నానే" అని కసిగా తిట్టుకున్నాడు.

*          *        *


బుచ్చిబాబు చాలా ఆలోచనలో పడిపోయాడు. మద్రాస్ ఫ్లయిట్ వచ్చింది. పాసింజర్లు అందరూ వెళ్ళిపోయారు కానీ సుందర్ ఆ వచ్చిన వాళ్ళలో ఎక్కడ కనబడలేదు. సుందర్ రాలేదా? హైదరాబాదు ప్రయాణం పోస్టుపోను   చేసుకున్నాడా? పోనీ లీవ్ కాన్సిల్ చేసుకుని ఇటునుండి ఇటే ఆఫీసుకి వెళ్ళి పోతేనో?

అతను పూలపూల షర్టుతో, పొడవయిన జుత్తుని వెనక్కి గట్టిగా దువ్వి రాబ్బరుబ్యాండు పెట్టి పోనీటెయిల్ వేసుకుని వున్నాడు. కాళ్ళకి రేబాస్ గ్లాసెస్ పెట్టుకుని వున్నాడు. ప్యాంట్ మోకాళ్ళకి క్రిందగా, కాళ్ళ మడమలకి కాస్త పైకివుంది.

బుచ్చిబాబుని చూస్తూ చాలా పరిచయస్తుడిని చూసినట్లు నవ్వుతున్నాడు.

"ఎవరండీ మీరూ?" అయోమయంగా అడిగాడు బుచ్చిబాబు.

"ఓ.... కమాన్.... నో జోక్స్" అంటూ బుచ్చిబాబు వీపులో గట్టిగా గుద్దాడు ఆ దెబ్బకి కాస్త మూలిగాడు.

"సారీ సార్.. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు" అన్నాడు బుచ్చిబాబు" ఎవడ్రా వీడు ఇంత గుద్డుగుద్దాడు' అని మనసులో తిట్టుకుంటూ.

"హ్హహ్హహ్హ... ఆర్ యూ జోకింగ్.. ఆర్ యాక్టింగ్?" అంటూ మరో పిడిగుద్దు బుచ్చిబాబు భుజం మీద గుద్దాడు.

బుచ్చిబాబు మళ్ళీ బాధగా మూలిగాడు. ఈసారి అతనికి చాలా కోపం వచ్చింది.