Businessman Related Funny Dialogues

Businessman Related Funny Dialogues

సారోస్తారోస్తారే..... అంటూ నేను మెల్లగా ఎలాగోలాగ బ్రతికేయడానికి రాలేదంటూ వచ్చి

కుదురుగా ఉండలేక ప్రియా ప్రియతమా రాగాలు అంటూ అమ్మాయి వెనకాల పడ్డాను.

రొటీన్ ట్రెండ్ లో వెళ్ళితే అమ్మాయి పడటం లేదని గ్రహింఛి

కొత్త ట్రెండ్ సెట్ చేద్దామని ఇలా ట్రై చేశాను.

ఎలాగంటె " ఓ పిల్ల నువ్వు లేని జీవితం నల్లరంగు అంటుకున్న తెల్ల కాగితం" అంటూ !

70 KM వేగం తో వెళ్ళే రైలు ప్లాట్ ఫారం మీద ఆగదు కదా ఏమి చేస్తాము అనుకుని

మనసు పలికే మాయే ఈ ప్రేమ అంటూ సర్దుకుని, లెంప లేసుకుని " నీ పదముల

ప్రవహించిన గంగ యమునా నా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ " అంటూ దేవుడి

మార్గం పట్టాను.

ఇంతలో ఎక్కడ నుండి వచిందో తెలియదు సక్కు భాయి... గరం గరం చాయ్ అంటూ

వచ్చింది. టీ అంటే పడి చస్తాంగా తాగుతుంటే ఆకాశ వాణి లోంచి మాటలు

" జరుగుతున్నది జగన్నాటకం " అంటూ !

ఛి దీనమ్మ జీవితం రచ్చ రంబోల అంటూ మనసులో జపించి ముస్కుని కూర్చున్నాను.

దీనమ్మ జీవితం ఏదో అలా అలా గడిచిపోతుంది కదా అని అనుకుంటే యుగాంతం

బొక్క.... అంటూ డైవర్ట్ చేసారు మొహం మీద గుద్దేయాలి ఎదవల్ని...!

జీవితం అనేది గోధుమ గింజ లాంటిది భయ్యా ఏది చపాతి అవుద్దో ఏది పిజ్జా అవుద్దో

తెలియదు.....