Lunchtime Telugu Funny Jokes

Lunchtime Telugu Funny Jokes

ఆఫీసు లంచ్ టైం లో కార్తిక్, నరేందర్ అనే ఇద్దరూ స్నేహితులు సరదాగా

మాట్లాడుకుంటున్నారు.

" ఏరా కార్తిక్...నిన్న పర్మిషన్ తీసుకున్నావు కదా ! ఎక్కడికి వెళ్లావు ? " అని నరేందర్

అడిగాడు కార్తిక్ ను.

" ఎక్కడికి వెళ్తాను. ఇంటికి వెళ్లాను " అని వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు కార్తిక్.

" ఇంటి దగ్గరికి వెళ్లి ఏం చేశావురా ? "

" నేను ఇంటి దగ్గరికి వెళ్లేసరికి...."

" ఆ...నువ్వు ఇంటి దగ్గరికి వెళ్లేసరికి....ఏమయింది ? చెప్పరా..చెప్పు ? " అని ఆతృతగా

అడిగాడు నరేందర్.

" నేను ఇంటికి వెళ్లేసరికి మా ఆవిడ పక్కన ఎవడో పడుకున్నాడురా ? " అని దిగులుగా

చెప్పాడు కార్తిక్.

" అయ్యయ్యో...అప్పుడు నువ్వు వాడిని కొట్టి మీ ఆవిడను తిట్టావా ? " జాలి పడుతూ

అడిగాడు నరేందర్.

" లేదురా..చప్పుడు చేయకుండా మెల్లగా వంట గదిలోకి వెళ్లి స్టౌ వెలిగించుకుని కప్పు

కాఫీ కాచుకుని త్రాగాను " అని నెమ్మదిగా చెప్పాడు కార్తిక్.

" అదిసరేరా...నీ భార్య పక్కన పడుకున్న వాడి సంగతి ఏం చేశావు ఇంతకీ ? " అని

మరింత ఆతృతగా అడిగాడు నరేందర్.

" ఏడ్చాడు వెధవ...వాడి కాఫీ వాడే కాచుకుని తాగుతాడులే అని చప్పుడు చేయకుండా

మళ్ళీ బయటికి వెళ్ళిపోయాను " అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు కార్తిక్.

నవ్వాలో ఏడువాలో నరేందర్ కు అర్థంకాక అయోమయంగా ముఖం పెట్టి అలా చూస్తూ

ఉండిపోయాడు.

దూరంగా వెళ్ళిన కార్తిక్, తిరిగి నరేందర్ ను చూస్తూ పకపక నవ్వుకున్నాడు.