Rating:             Avg Rating:       458 Ratings (Avg 2.90)

మేకప్ లేకుండా సినీనటి కనిపిస్తే

Telugu Jabardasth Comedy Special

'' తెలుగు జబర్దస్తీ కామెడీ స్పెషల్ ''

ఈ రోజు మంగళవారం కదా ! మరి మన తెలుగువన్.కామ్/కామెడీ లో '' తెలుగు జబర్దస్తీ

కామెడీ స్పెషల్ '' అంటూ స్పెషల్ గా మిమ్ముల్నినవ్వించడానికి రెడీ అయి వచ్చింది.

ఈ వారం ఈ శీర్షికలో " మేకప్ లేకుండా సినీనటి కనిపిస్తే " అనే ప్రశ్నకి జవాబు ఏమిటో

సరదాగా చదివి తెలుసుకుందాం !

మరి ఆలస్యం ఎందుకు తెలుగు జబర్దస్తీ కామెడీ స్పెషల్ ల్లో " మేకప్ లేకుండా సినీనటి

కనిపిస్తే " అంటూ చదువుకొని హాయిగా నవ్వుకోండి. ఈ శీర్షిక మీద మీ అభిప్రాయాలు

కామెంట్స్ తెలియజేయగలరు.

మేకప్ లేకుండా సినీనటి కనిపిస్తే

కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక సినీనటి తన భర్తతో కలిసి కొత్తింట్లో అడుగుపెట్టింది.

వారం రోజులుగా ఎదురింటి కుర్రాడు కర్టెన్ల చాటునుండి ఆమెను చూడటం గమనించింది.

ఆ విషయాన్నే భర్తతో చెప్పింది.

" ఏవండీ...ఎదురింటి అబ్బాయి కర్టెన్లచాటునుండి నన్ను దొంగ చూపులు

చూస్తున్నాడు " అని.

" ఓస్ అంతే కదా ! ఓ పని చెయ్ ! " అని తేలిగ్గా అన్నాడు ఆ భర్త.

" చెప్పండి చేస్తాను " అని ఉత్సాహంగా అడిగింది సినీనటి.

" రేపు ఉదయం నీవు షూటింగ్ కి వెళ్లేముందు ముఖానికి మేకప్ వేసుకోకుండా

ఒకసారి ఆ అబ్బాయికి కనిపించు. అంతే ! మళ్ళీ నీ ముఖం చూడకుండా తనే కర్టెన్లు

వేసుకుంటాడు..." అని చెప్పి ముసిముసిగా నవ్వుకున్నాడు భర్త.