ఈతరం భార్య

ఈతరం భార్య

కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఒక రోజు సాయంత్రం సరదాగా విస్కీ తాగాలనుకొన్నారు.

ప్రిజ్ లో నుండి ఐస్ ముక్కలు పట్టుకురమ్మని భార్యను పంపాడు భర్త. కొంచెంసేపటికి

వంటగదిలో నుండి ఏడుపు శబ్దం వినిపించి పరుగున అక్కడికి వచ్చాడు ఆ భర్త.

" ఏం జరిగింది ? ఎందుకు ఏడుస్తునావు ? " అని భార్యను అడిగాడు.

" వేడినీళ్ళతో కడిగి తీసుకొద్దామని ఐస్ ముక్కలను కడిగాను. అవి కరిగిపోయాయి "

అని చెబుతూ ఏడుపు మొదలు పెట్టింది భార్య.

ఆ భర్తకు ఏడువాలో నవ్వాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు.