Rating:             Avg Rating:       595 Ratings (Avg 2.94)

వడదెబ్బకు వ్యక్తి మృతి

వడదెబ్బకు వ్యక్తి మృతి

బాల్కనీలో కూర్చుని పేపరు చదువుతున్నఅభిరాం దగ్గరికి టీ తాగుతూ వచ్చింది

కల్పన.

" నాకు టీ ఏది ? " అని కల్పనని అడిగాడు అభిరాం.

" మీరు ఇంతకు ముందు తాగారు కదా అని తేలేదు. సరేగాని పేపర్లోని విశేషాలు

ఏమిటో చెప్పండి ? " అని అంది కల్పన.

" వడదెబ్బకు వ్యక్తి మృతంట " అని కొంచెం కోపంగా చదివాడు అభిరాం.

ఆ కోపాన్ని పట్టించుకోకుండా " వానకాలంలో వడదెబ్బ ఏమిటి ? " అని కొంచెం

ఆశ్చర్యంగా అడిగింది కల్పన.

" ఒక స్టార్ హోటల్లో ఒక కస్టమర్ దోశకి ఆర్డర్ ఇస్తే సరిగ్గా వినిపించుకోని సర్వర్ వడ

తీసుకురావడం జరిగింది. దాంతో అక్కడిక్కడే వాళ్ళిద్దరి వాగ్వివాదం జరిగింది. కోపం

పట్టలేని కస్టమర్ వడతో సర్వర్ ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బకు సర్వర్ అక్కడికక్కడే

మృతి చెందాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కష్టమర్ ని కస్టడీలోకి

తీసుకున్నారు...." అని గబగబా చదువుతూ వెళ్ళిపోయాడు అభిరాం.