Home » Comedy Stories » One day in Five Star Hotel

One day in Five Star Hotel

One day in Five Star Hotel

ఐదు నక్షత్రాల హోటల్లో ఒక రోజు....

సుందరం ఒక రోజున ఐదు నక్షత్రాల హోటల్ కి వెళ్లాడు.

సర్వర్ వచ్చి " ఏం కావాలి సార్ ? " అని వినయంగా అన్నాడు.

" పోట్లాట మొదలయ్యే లోపల అర్జంటుగా ఓ చికెన్ బిర్యాని ఇవ్వు " అని చెప్పాడు

సుందరం. వెంటనే సర్వర్ సుందరానికి చికెన్ బిర్యాని తెచ్చిచ్చి కిటికీలో నుండి

బయటకు చూశాడు. బయట ఎవరు కనబడలేదు.

ఆ చికెన్ బిర్యానిని గబగబా తినేసిన సుందరం " ఇంకా టైమున్నట్లుంది. పోట్లాట

మొదలయ్యే లోపల ఇంకో బిర్యాని తీసుకురా " అని చెప్పాడు.

సర్వర్ వెళ్లి తీసుకొచ్చి ఇస్తూ ఆసక్తిగా " పోట్లాట ఎవరితో అవుతుంది సార్ ?" అని

అడిగాడు.

" నీతోటే మిస్టర్ "

" నాతోటా ? ఎలాగా ? " అర్థంకానట్టు అడిగాడు సర్వర్.

" నీకు బిల్లు చెల్లించడానికి నా దగ్గర డబ్బులు లేవుగా..." అని చెప్పి పకపక నవ్వాడు

సుందరం.

" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ సర్వర్.

google-banner