హలో... రాంగ్ నెంబర్.! - 2

Read and enjoy latest telugu comedy serial Hello Wrong Number Telugu Serial

 

హలో... రాంగ్ నెంబర్.! - 2

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

హోటల్ పెనిన్ సులా.
థర్డ్ ఫ్లోర్ లో వున్న లగ్జరీ సూట్ లో రిలాక్సవుతున్నాడు శ్రీకర్.
లూసీ ఓ సోఫాలో కూచుని శ్రీకర్ వంకే చూస్తోంది. రెండు చేతులు తల కింద పెట్టుకుని, సీలింగ్ వంక చూస్తూ పడుకున్నాడు.
"లూసీ...ఇక్కడ మన బ్రాంచ్ భవిష్యత్తు ఎలా వుంటుంది?" అడిగాడు శ్రీకర్.
"ప్రపంచంలోని చాలా దేశాల నుండి ఇక్కడికి వస్తూంటారు. మంచి బిజినెస్ సెంటర్. దుబాయ్ అనగానే  చాలా మందికి ఇది కేవలం ముస్లింల ప్రపంచమేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ మీకు తారసపడే ప్రతీ పదిమందిలో ఇద్దరైనా తెలుగు వాళ్ళుంటారు. అన్ని భాషల వాళ్ళు ఇక్కడ వుంటారు. ఏ భాష మాట్లాడినా వీళ్ళకు అర్ధమవుతుంది.
ఎట్ యువర్ సర్వీస్ లాంటివి ఇక్కడ తక్కువే. మీరు తలుగు వాళ్ళను టార్గెట్ గా పెట్టుకున్నా చాలు. ఇక్కడ వుండే తెలుగు వంటకాలు, తెలుగువారి హోటళ్ళు...తెలుగు వారి చిరునామాలు మనం కంప్యూటర్ లో ఫీడ్ చేస్తాం. ఎవరైనా ఐడియా నుండి వచ్చి...ఫలానా తెలుగువారు మాకు బంధువులు అని చెప్పారనుకోండి. అతని పేరు, వృత్తి చెబితే చాలు...అడ్రస్ తో సహా మనం ఐడింటిఫై చేయగలం. వాళ్ళు కోరితే, అక్కడికి మనం చేర్చగలం. ఈ ఫెసిలిటీ మనం మాత్రమే అందిస్తున్నాం...అనుకోండి." ఆగింది లూసీ.
"ఈ కాన్సెప్ట్ బావుంది. ఇది విన్సెంట్ ఐడియానా?" అడిగాడు శ్రీకర్.
ఒక్కక్షణం తడబడి" యస్..అతని ఐడియానే సర్. విన్సెంట్ ఈజె జీనియస్" అంది లూసీ.
ఎందుకో లూసీ అబద్దం ఆడుతూందనిపించింది.
"మనం ఇంకా ఏం చేస్తే ఇక్కడి బ్రాంచీని సక్సెస్ చేయగలమంటావ్?" ఆమె వైపే చూస్తూ అడిగాడు శ్రీకర్.
"ఒంటరిగా ఇండియా నుంచి వచ్చే మహిళల కోసం మనం 'లేడీస్ స్పెషల్ కేర్ సెంటర్' అని ఒకటి ఏర్పాటు చేస్తే బావుంటుంది సర్"
"అంటే..."
"మనం ఇండియాలో వున్న అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రకనలిస్తాం. ఇండియా నుండి ఒంటరిగా వచ్చే మహిళల కోసం, దుబాయ్ లో వున్న ఎట్ యువర్ సర్వీస్ బ్రాంచీ

లేడీస్ స్పెషల్...వీళ్ళ కోసం సిద్ధంగా ఉంటుంది. ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకోవడం దగ్గర్నుంచి, వాళ్ళకు కావలసిన అన్ని అవసరాలు చూసుకొంటుంది. ఇక్కడ తెలిసిన వారెవరూ లేకపోయినా ఫర్లేదు. మన బ్రాంచీకి సంబంధించిన గిస్ట్ హౌస్ లో మహిళల పర్యవేక్షణలో వాళ్ళు ఇక్కడ వుంటారు. అంతేకాదు....

ఇక్కడ గోల్డ్ ఆర్నమెంట్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోలు చేయాలన్నా మన దగ్గర వున్న నిపుణులు వారికి సలహాలిస్తారు. ఎక్కడ ఏ వస్తువులు రీజనబుల్ గా దొరుకుతాయో గైడ్ లైన్స్ ఇస్తారు. ఇంకా కావాలంటే వాళ్ళతో షాపింగ్ కి కూడా వెళ్తారు. కొన్ని షాపింగ్ మాల్స్ లో బార్గేనింగ్ వుంటుంది. మనం ఏ రేటులో ఏ ఐమ్స్ కొనొచ్చో ఎక్ప్ ప్లయిన్ చేస్తాం. అంతెందుకు...తిరిగి వాళ్ళను ఇండియా ఫ్లయిట్ ఎక్కించే వరకూ మనదే రెస్పాన్సిబిలిటీ అన్నమాట."
"వెరీగుడ్ ఐడియా. ఇది దుబాయ్ లో క్లిక్ అయితే మనం అన్ని కంట్రీస్ లో ఎ౩ఎ నెట్ వర్క్ ప్రారంభిద్దాం." ఉత్సాహంగా అన్నాడు శ్రీకర్.
"థాంక్యూ సర్." అంది లూసీ.
అప్పటికే అర్థరాత్రి రెండు దాటింది. అక్కడి టైమ్ ప్రకారం. ఆ టైమ్ కి ఇంకా ఎడ్జస్ట్ కాలేదు శ్రీకర్.
"లూసీ...నీకు చాలా లేటయిందనుకుంటా. నువ్వు ఇంటికి వెళ్తావా?"
"నో సర్....మీరు వెళ్ళే వరకూ మీ బాధ్యతలన్నీ నావి. సెకండ్ ఫ్లోర్ లో ఓ రూమ్ బుక్ చేసాం. అందులో నేనుంటాను. ఉదయమే మిమ్మల్ని నిద్రలేపడానికి వస్తాను. గుడ్

నైట్ సార్...." అంది సోఫాలో నుంచి లేస్తూ.
*                      *                      *
ఉదయాన్నే విన్సెంట్, లూసీ కలిసి శ్రీకర్ సూట్ కు వచ్చారు.
"గుడ్ మానింగ్ సార్..." విన్సెంట్ విష్ చేసాడు.
లూసీ కూడా విష్ చేసింది. లూసీలో నిన్నటి హుషారు, మెరుపు కనిపించలేదు.
"గుడ్ మానింగ్ సార్..." చెప్పాడు శ్రీకర్.
"అప్పుడే రెడీ అయ్యారా? ఆర్యూ కంఫర్టబుల్ సర్? ఎనీ ప్రాబ్లమ్?"
"నో ప్రాబ్లెమ్...ఎర్లీ మార్నింగ్ కేరీఫోర్ వరకూ వాకింగ్ కి కూడా వెళ్ళాను తెల్సా....." ఉత్సాహంగా చెప్పాడు శ్రీకర్.
"వెరీగుడ్ సర్. అన్నట్టు ఇక్కడ కొన్ని ఫార్మాల్టీస్ పూర్తి చేస్తే మన బ్రాంచీ ప్రారంభమైనట్టే. ఇక్కడ స్థానికంగా వుండే ప్రముఖుల్ని ప్రారంభోత్సవానికి పిలుద్దాం."
"ఓ..కె... అలాగే చేద్దాం..." చెప్పాడు శ్రీకర్.
"సర్...మన బ్రాంచ్ ఓపెనింగ్ రోజున వివిధ దేశాల్నుంచి వచ్చిన టూరిస్టులను గెస్టులుగా పిలిస్తే బావుంటుంది. మన బ్రాంచ్ గురించి వారికి తెలియజేసినట్టు వుంటుంది. అంతేకాదు, ఇనాగ్యురేషన్ ఆఫర్ గా సర్వీస్ ఛార్జ్ లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్  కూడా అనౌన్స్ చేయవచ్చు" అంది లూసీ.
విభ్రాంతిగా లూసీ వైపు చూసాడు. ఆమె చాలా షార్ప్ అని అర్థమైంది. బిజినెస్ టెక్నిక్స్ బాగా తెలిసిన లేడీ.
అదే క్షణం విన్సెంట్ లూసీ వైపు చూసాడు. ఆ చూపులో కోపం, కసి సృష్టంగా తెలుస్తున్నాయి. వెంటనే లూసీ సర్దుకొని అంది.
"సర్...ఇది నా ఐడియా కాదు. మిస్టర్ విన్సెంట్ ఇందాక నాతో చెప్పిన ఐడియా" అంది తడబాటుగా.
"ఐ ...సి..." అన్నట్టు తల పంకించాడు.
"సర్...మీకు ఏదైనా షాపింగ్ వుంటే చేసేసుకుని, ఈవెనింగ్ ఫోర్ కి రెడీగా వుంటే డిసర్ట్ సఫారీకి బయల్దేరొచ్చు. అన్నట్టు మీరు బయలుదేరడానికి రెండు గంటల ముందు నుండి ఏమీ తినకండి. మీరు బయలుదేరే సమయానికి డైజెస్ట్ అయిపోయి వుండాలి. మీకు అసిస్టెంట్ గా మరో అమ్మాయిని అరేంజ్ చేస్తాను."
"అదేంటి...లూసీ వుందిగా"
"అంటే...అది...ఆ అమ్మాయికి డిసెర్ట్ సఫారీ గురించి ఇంకా ఎక్కువగా తెలుసు. లూసీకి పూర్తి డిటెయిల్స్ తెలియవు" నసిగాడు విన్సెంట్.
"నో ప్రాబ్లెం. నేను వెళ్ళేవరకూ లూసీకి మరె అస్సయిన్ మెంట్ అప్పగించకండి"
"సర్...నాకు వేరే వర్క్..." లూసీ ఏదో చెప్పబోయింది.
"నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ" శ్రీకర్ కావాలనే కటువుగా అన్నాడు.
విన్సెంట్ తల వంచుకొని "ఓ..కె. సార్...ఇవ్వాళ షాపింగ్, డిసర్ట్ సఫారీ చూసుకోండి. రేపు మనం ఓసారి కూచుని బ్రాంచి ఆఫీసు గురించి డిస్కస్ చేసుకుందాం."
"ఇక మీరు వెళ్ళొచ్చు" అన్నాడు శ్రీకర్.
విన్సెంట్ ఓసారి లూసీ వైపు చూసి బయటకు నడిచాడు.
*            *                    *
ఇద్దరికీ వంద డాలర్స్ పేచేశాడు శ్రీకర్.
"మనం విడిగా కాకుండా, కొందరితో కలిసివెళ్తే అమౌంట్ తగ్గేది. మనమిద్దరి కోసం ఫోర్ బై ఫోర్ వేన్ బుక్ చేయడం ఖర్చుకదా సార్." డిసర్ట్ సఫారీకి అందరితో కలిసి

కాకుండా, విడిగా తమకోసమే వెహికల్ అరేంజ్ చేయటం చూసి చెప్పింది లూసీ.
"సీ...లూసీ! నాకు ప్రయివసీ ఇష్టం. మనమే విడిగా వెళ్తే సఫారీ అందాలు చూడొచ్చు. వాడ్డూ యూ సె" ఆమె వంక చూసి అన్నాడు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఇద్దరూ షాపింగ్ చేసారు. ఆఫీస్ పర్పస్ కోసం కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్నాడు శ్రీకర్.
"సార్ ! మీకు ఆవకాయ, గోంగూర పచ్చడితో హోమ్లీగా వుండే హోటల్ కి తీసుకువెళ్తాను. మీకు బాగా నచ్చుతుంది."
"ఏవిటీ! ఆవకాయ దొరుకుతుందా?"
"అవును. ఆవకాయ, చక్కర పొంగలి...మీరే చూస్తారుగా."
"చెప్తోంటే ఇప్పుడే నోరు వూరుతోంది." అన్నాడు శ్రీకర్.
వాఫీ సిటీలో వున్న శరవణ హోటల్ కి తీసుకువెళ్ళింది. శ్రీకర్. తృప్తిగా భోజనం చేశాడు. పక్కా ఆంధ్రా భోజనం చేసినట్టు అనిపించింది. చివరలో ఓ పెద్ద అరటిపండు,

స్వీట్ పాన్ కూడా ఆఫర్ చేశారు వాళ్ళు.
"థాంక్యూ లూసీ ! నేను మా వూర్లో కూడా ఇంత తృప్తిగా తిని వుండను." మనస్పూర్తిగా అన్నాడు శ్రీకర్.
*                   *                   *