Rating:             Avg Rating:       796 Ratings (Avg 2.98)

హలో... రాంగ్ నెంబర్.! - 74

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 74

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"అన్నట్టు మీ పేరు చెప్పనే లేదు" అడిగాడు శ్రీకర్. రెస్టారెంట్ లో ఏ.సి. సెక్షన్ లో కార్నర్ సీటులో కూచున్నాక.

"సారీ! స్టెలీనా..." చెప్పింది స్టెలీనా.

"సారీ...మీ ఇన్సియలా?" చిర్నవ్వుతో అడిగాడు.

"సారీ...కాదు..కాదు...కాదు" అంది కంగారుగా.

"మీకో విషయం తెలుసా..రోజులో ఎక్కువ మంది ఎక్కువసార్లు 'సారీ' అనే చెప్పకతప్పదేమో" అన్నాడు శ్రీకర్.

స్టెలీనా అతను చెప్పేది వింటోంది. ఏ విషయాన్ని అయినా తను కన్విన్సింగ్ అందంగా చెప్పే పద్ధతి ఆమెను థ్రిల్లింగ్ ఎక్సయిట్ మెంట్ కు గురిచేస్తోంది.

"చెప్పండి..వెజ్జా?" నాన్ వెజ్జా?"

"ఏదైనా అంటేప్పుడు విషయంలో నేనా?" అడిగాడు శ్రీకర్.

వెంటనే తలెత్తి శ్రీకర్ వైపు చూసింది. ఆ మనిషిలో ఏ తడబాటూ లేదు. చిర్నవ్వుతో అలానే వున్నాడు.

"మా ఆవిడెప్పుడూ ఓ వెజ్ మీల్స్, వైట్ రైస్, ఓ చికెన్ లేదా మటన్ కర్రీ ఆర్డర్ చేస్తుంది. ఇద్దరం షేర్ చేసుకుంటాం. అఫ్ కోర్స్ వెజ్ కర్రీస్ మొత్తం తనకే త్యాగం చేస్తాను"

"మీకు పెళ్ళయిందా?" ఆమె కంఠంలో విధమైన నిరాశ కనిపించింది.

"ఓ బాబు కూడా..అదేంటో మగవాళ్ళు తమ వయసు చెప్పుకోవడానికి యిష్టపడతారు. అలాగే వాళ్ళు దాచుకోవడానికి యిష్టపడతారు. చిన్న విషయాల్లో అంతే"

"కానీ మగవాళ్ళెప్పుడూ అమ్మాయిలతో పెళ్లయ్యిందన్న విషయం చెప్పరు. బహుశా ఎదుటివ్యక్తి నుంచి ఏదైనా ఎక్స్  పెక్ట్ చేసేప్పుడు, ఈ పెళ్ళి ఓ డిస్టర్బెన్స్ గా మారుతుందన్న భయం కావచ్చు అంది స్టెలీనా.

"అలా దాచి, తమకు కావలసింది నెరవేర్చుకోవడం అనే థియరీ నాకు నచ్చదు సర్లెండి...ముందు ఆర్డర్ చేద్దాం" అన్నాడు.

వెయిటర్ వచ్చాడు.

"వన్ వెజ్ థాలీ, వన్ ప్లెయిన్ రైస్, మటన్ కర్రీ" చెప్పింది స్టెలీనా.

శ్రీకర్ స్టెలీనా వైపు చూశాడు. మిడ్డీలో అందంగా వుంది. శ్రీకర్ తనవైపే చూడ్డంతో కాస్త సిగ్గుపడింది.

"మీకు పూలంటే ఎలార్జీనా?" అడిగాడు శ్రీకర్.

"అదేం?"

"కొంతమంది అమ్మాయిలకు ఎలర్జీ. ఇంకొందరికి పువ్వులు పెట్టుకోవడమంటే ఎంతో యిష్టం. మా ఆవిడ తన మూడు మూరల జడకు, ఆరు మూరల పువ్వులు పెట్టుకుంటుంది. జడలో పువ్వుల్తో తను భలే అందంగా వుంటుందిలే"

"ఇప్పటికీ మీరు మీ మిసెస్ గురించి రెండుసార్లు ప్రస్తావించారు. వేరే అమ్మాయిల ముందు భార్యల గురించి భర్తలు చెప్పుకోరనే నాకు అనుభవం."

నవ్వి చెప్పాడు శ్రీకర్. "దేవుడు పువ్వులు పెట్టుకోని అమ్మాయిలకోసం, ఆ పువ్వుల అందాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఒకటి సృష్టించాడు తెలుసా?"

"ఏమిటది?" అన్నట్టు ఆసక్తిగా చూసింది.

"ఇంతకూ మీకు పువ్వులంటే ఎలార్జీనా? చెప్పనే లేదు"

"అవును. ఒకప్పుడు చాలా యిష్టంగా వుండేది. ఆ యిష్టం ఇప్పుడు లేదు. అయినా మోడర్న్ డ్రెస్ కు పువ్వులు సరిపడవు..." నాపరిస్థితికి కూడా అని మనసులో అనుకుంది.

ఆమె చెప్పేది వింటున్నాడు.

"ఇంతకూ పువ్వుల బదులు ఆ దేవుడు కాంపెన్సేట్ చేసిందేమిటో చెప్పనే లేదు" అడిగింది స్టెలీనా.

"సిగ్గు...అందంగా, ముద్దుగా, వినయంగా పడే సిగ్గులో ఎన్నో అందాలు డిఫరెంట్ షేడ్స్ కి కనిపిస్తాయి. అచ్చంగా మీ మొహంలో కనిపించే అందాల్లా" చెప్పాడు శ్రీకర్.

స్టెలీనా మొహం ఎర్రబడింది సిగ్గుతో.

*           *               *