హలో... రాంగ్ నెంబర్.! - 50

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 50

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

రాత్రి పది గంటలు.

బబ్లూ, ప్రియంవద టీవీ చూస్తున్నారు.

శ్రీకర్ హాలులోకి వచ్చి, ఆ ఇద్దరి వంకా, చూసి, ప్రియంవద పక్కనే కూచుంటూ "ఏంటీ ! సీరియల్ చూస్తున్నావా?" అని అడిగాడు.

"కాదు...రేడియోలో వివిధ భారతి పాటలు వింటున్నాను" చెప్పింది ప్రియంవద.

బబ్లూ కిసుక్కున నవ్వి "డాడీ! నాకో డౌట్....హాస్పిటల్ కు పలకరించడానికి వెళ్ళి 'బాగున్నారా?' అని, పోలీసుస్టేషన్లో కనిపించిన వ్యక్తిని 'కుశలమా' అని, సినిమా హాలులో 'ఏంటీ. సినిమాకు వచ్చారా' అని అడగోచ్చా"

ఒక్కక్షణం ఆలోచించి చెప్పాడు "అడగొద్దు..."

"మరి చాలామంది అలా ఎందుకు చేస్తారు. ఇవ్వాళ రాజారావు తాతయ్య కలిసాడు....స్కూల్ కు వెళ్ళోస్తున్నావా బాబూ...అని అడిగాడు."

శ్రీకర్ బుర్ర గోక్కుంటూ "అన్నీ తిక్క ప్రశ్నలు" అంటూ లోపలికి వెళ్ళాడు.

"చూసేవా మమ్మీ....మనం సీరియల్ చూడకుండా అడ్డంగా వున్న డాడీని ఎలా ఇక్కడనుంచి పంపించానో" బబ్లూ గర్వంగా చెప్పాడు.

ప్రియంవద బబ్లూ చెప్పేది వినడం లేదు. శ్రీకర్ ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చాడో అని ఆలోచిస్తోంది.

*               *              *

శ్రీకర్ బెడ్ మీద వెల్లికిలా పడుకున్నాడు.

వీపు కింద ఏదో తగిలినట్టనిపించి చూసాడు. రిమోట్..

టీవీ సీరియల్స్ లో ఏం మత్తు వుందని చూస్తారు? ఆలోచిస్తూ బెడ్ రూమ్ లో వున్న టీవీ ఆన్ చేసాడు. బబ్లూ బెడ్ రూమ్ లో నుంచి టీవీ సౌండ్ వినిపించడంతో, బెడ్ రూమ్ వంక చూసి "మమ్మీ నీకు ఎయిత్ వండర్ చప్పనా...డాడీ కూడా టీవీ సీరియల్స్ కు ఎడిక్టయ్యాడు. నాకిక నీ కంపెనీ అక్కర్లేదు. డాడీతో కలిసి చూస్తా" అంతో బెడ్ రూమ్ లోకి పరుగుపెట్టాడు.

శ్రీకర్ యథాలాపంగా సీరియల్ చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే బబ్లూ వచ్చాడు.

"ఏంటి డాడీ...నువ్వు కూడా టీవీ చూస్తున్నావు" అని అడిగాడు.

"ఊర్కే...మీరెందుకలా చూస్తారో తెలుసుకుందామని చూస్తున్నాను. నాకసలు టీవీలో నటించేవాళ్ళ పేర్లే తెలియదు. ఆమధ్య బాపూ సినిమా కదాని పెళ్ళి పుస్తకం చూసాను. ఆ ఆతర్వాత మళ్ళీ థియేటర్ కు వెళ్ళలేదు" చెప్పాడు కొడుకుతో శ్రీకర్.

"అయితే నీకో క్విజ్ డాడీ. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఎవరో చెప్పు"

"బాపు సినిమాలో నటించే అమ్మాయిని హీరోయిన్ అనరు, బాపూ బొమ్మ' అని అంటారు. ఆ బాపూ బొమ్మ దివ్యవాణి అని గుర్తు.

"గ్రేట్ మెమోరి డాడీ. ఇప్పుడా బాపూబొమ్మ ఈ సీరియల్ లో వుంది. ఎక్కడుందో చెప్పుకో చూద్దాం?" అన్నాడు బబ్లూ.

"బాపూ బొమ్మా...అదే దివ్యవాణా...ఈ సీరియల్ లోనా?" అంటూ ఇరవై నిమిషాలు కాన్ సెంట్రేషన్ గా చూసి "అబ్బే~! ఇందులో లేదురా" అన్నాడు.

"ఉంది డాడీ...బెట్"

"బెట్...కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, తప్ప ఏదైనా సరే...ఆ పురుగులు నువ్వు తిని డైజెస్ట్ చేసుకోలేవు"

"అయితే ఆ బాపూబొమ్మ ఎవరో చూపిస్తానుండు" అంటూ డైలీసీరియల్ క్లయిమాక్స్ లో చూపించాడు.

"ఆవిడ లత కాదూ...అందాల రాముడు'లో నాగేశ్వరరావు పక్కన వేసింది...బాపూబొమ్మ"

"అయితే, ఆవిడ పక్కనే ఇంకో బాపూబొమ్మ కూడా వుంది...చూడు.." అన్నాడు.

"అరే...దివ్యవాణా.."

"అవును..రెండు బాపూ బొమ్మలు" చప్పట్లు కొడుతూ చెప్పాడు బబ్లూ.

'ఎంత మార్పు?" అనుకున్నాడు శ్రీకర్.

సరిగ్గా అప్పుడే అతని మెదడులో చిన్న క్లాష్. చిన్న బ్రేక్..ఎంత మార్పు...అవును...ఎంతమార్పు...ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నాడు.

ఇన్స్పెక్టర్ చండి...ఆవిడ్ని తనెక్కడ చూసాడు...తన పెళ్ళికి ముందు...యస్ ..ప్లాష్ బ్యాక్ లో...

*             *           *

చుడిదార్ లో వెళ్తోన్న ఓ అమ్మాయిని ఫాలో అయి, "డెడ్ బాడీని సైతం బెడ్ మీదికి రప్పించే స్ట్రక్చర్ మీది" అని తను అనగానే...

"థాంక్యూ.." అంటూనే "అయామ్ చండి..ఇన్స్పెక్టర్ చండి" అంటూ తనని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి కోటింగ్ యిచ్చింది.

*             *            *

ప్లాష్ బ్యాక్ లో నుంచి బయటకు వచ్చాడు. అతని మనసు తేలికైంది. లేడీ ఇన్స్పెక్టర్ ని తను ఎక్కడ చూసాడో గుర్తుకు వచ్చింది. మరోసారి ఆవిడ జోలికి వెళ్లొద్దు అనుకున్నాడు.

సరిగ్గా అప్పుడే మోబిటెల్ రింగయింది. తనకు తెలియని నెంబర్...సెండ్ బటన్ నొక్కి "శ్రీకర్...ఎట్ యువర్ సర్వీస్" అన్నాడు.

"సార్...నేను లూసీని..ఇండియా వచ్చేసాను" వినిపించింది అటువైపు నుంచి.