అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు

అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు

ఇంటర్నేషనల్ హై స్కూల్లో ఫిజికల్ ట్రైనర్ ఉద్యోగం కోసం వెళ్లాడు అరవింద్.

అక్కడ అతనికి ఇంటర్వ్యూ జరిగింది.

" మీకు ఏ ఆటంటే ఎక్కువ ఇష్టం ? " అని అడిగాడు అధికారి.

" క్రికెట్ " అని చెప్పాడు అరవింద్.

" బౌండరీ అంటే ఏమిటి ?" అడిగాడు అధికారి.

" నాలుగు పరుగులు " అని టక్కున చెప్పాడు అరవింద్.

" సిక్సర్ అంటే ?" మళ్ళీ అడిగాడు అధికారి.

" ఆరు పరుగులు " అని చెప్పాడు అరవింద్.

" చాల సులభమైన ప్రశ్నలు అడుగుతున్నాను కదూ ?" కొంచెం గర్వంగా అన్నాడు

అధికారి.

" తెలియనివి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు సార్ " అని గబుక్కున

నాలిక్కరుచుకున్నాడు అరవింద్.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ అధికారి.