Diwali Funny Jokes

 

ముందు వెలుతురు ఎందుకు?

తండ్రి: తారాజువ్వని పేల్చిన తరువాత ముందు వెలుతురు కనిపిస్తుంది, తరువాత శబ్దం వినిపిస్తుంది ఎందుకు?

చింటూ: ఆ మాత్రం తెలియదా నాన్నా! మన కళ్లు ముందుటాయి కాబట్టి, వెలుతురు ముందు కనిపిస్తుంది. కళ్ల వెనుక చెవులు ఉంటాయి కాబట్టి వాటికి శబ్దం చేరడానికి కొంత ఆలస్యం అవుతుంది.

 

బాగానే ఉన్నాయిగా!

తండ్రి: పదిరోజుల ముందు తెచ్చి ఎండపెట్టినా కూడా ఈ చిచ్చుబుడ్లు వెలిగిచావడం లేదు.

కొడుకు: అదేంటి నాన్నా! నిన్న నేను వెలిగించినప్పుడు బాగానే వెలిగాయే!!!

 

ఛాదస్తం

ఇరుగింటావిడ: మా ఆయనకి రోజురోజుకీ ఛాదస్తం ఎక్కువైపోతోంది.

పొరుగింటావిడ: ఎందుకని అలా అనిపిస్తోంది.

ఇరుగింటావిడ: నిన్న రాత్రంతా వెలిగిపోయిన చిచ్చుబుడ్డినే మళ్లీ మళ్లీ వెలిగిస్తూ కూర్చున్నారు.