హలో... రాంగ్ నెంబర్.! - 62

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 62

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

సాయంత్రం లూసీ దగ్గరకు బయల్దేరాడు. హోటల్ గదిలో లూసీ శ్రీకర్ కోసమే ఎదురుచూస్తోంది. శ్రీకర్ ని చూడగానే ఆమె కళ్ళు వింత ఆనందంతో మెరిసాయి.

"వెల్ కమ్...సర్...మీకోసమే వెయిటింగ్" అంది లూసీ. ఓసారి ఆ గది వంక చూసి "బావుంది..డబుల్ ఆక్యుపెన్సీలా వుందే.." అన్నాడు.

అతని మాటలు అర్థమైనా, అసలా మాటలే వినతు "ఏం తీసుకుంటారు సార్" అని అడిగింది.

"ఏమిచ్చినా తీసుకుంటాను" అన్నాడు శ్రీకర్ ఆమె వంక చూస్తూ. మిడ్డీలో చాలా అందంగా కనిపిస్తోంది.

"టిఫిన్ తెప్పించనా?" అడిగింది అతని చూపులు గమనిస్తూ.

"ఏకంగా డిన్నర్ తీసుకోవచ్చని అనుకుంటున్నాను" అన్నాడు శ్రీకర్.

లూసీ నవ్వి రూమ్ సర్వీస్ కు ఫోన్ చేసి రెండు కాఫీ పంపించమంది.

"మధ్యలో సర్వీసోడు రావాలా?" అడిగాడు శ్రీకర్.

"సర్వీసోడా, అంటే.." అని ఒక్కక్షణం తర్వాత అర్థమై అతని నవ్వుతో శృతి కలిపింది.

"లూసీ...నువ్వు ఏ డ్రెస్ లో అయినా అందంగా వుంటావు. అఫ్ కోర్స్, లేకపోతే మరింత అందంగా వుంటావు" క్రీగంట ఆమె వంక చూస్తూ అన్నాడు.

ఈలోగా బాయ్ కాఫీ తీసుకువచ్చాడు. కాఫీ, కెటిల్, కప్స్ ట్రేలోతీసుకువచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళాడు.

లూసీ కాఫీని కప్పులోకి  ఒంపి ఒకటి శ్రీకర్ కు యిచ్చి మరొకటి తను తీసుకుంది.

"ఈ వెదర్ లో, నీలాంటి ఫిగర్ తో కాఫీ సిప్ చేస్తుంటే బావుంది కదూ" అన్నాడు శ్రీకర్.

లూసీ అన్నింటికీ చిరునవ్వే సమాధానంగా ఫీలయింది.

*              *              *

"ఇప్పుడు చెప్పు లూసీ....దుబాయ్ వదిలేసి ఇక్కడికి వచ్చావు. ఎనీ ప్రాబ్లెమ్" అడిగాడు శ్రీకర్ కాఫీ తాగడం పూర్తయ్యేక.

"ప్లీజ్ సార్...నన్నిప్పుడు ఏమీ అడగొద్దు. నాకు ఓ వుద్యోగం కావాలి. మీ దగ్గర నాకో ఉద్యోగం కావాలి. అదీ నా గురించిన వివరాలేమీ అడక్కుండా"

లూసీ ఏ విషయమూ చెప్పడానికి యిష్టపడ్డం లేదని అర్థమైంది.

"ఆల్ రైట్ నీకో వుద్యోగం కావాలి. అంతేగా..అది ఉదయమే కన్ ఫర్మ్ చేసాను. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకువచ్చాను. చైర్మనే అపాయింట్ మెంట్ ఆర్డర్ డైరెక్ట్ గా పి.ఏ.కి అందజేయడం వెరైటీ..." అన్నాడు బ్రీఫ్ కేసులో నుంచి అపాయింట్ మెంట్ ఆర్డర్ వున్న కవర్ ని ఆమె చేతికి యిస్తూ.

"సర్..వన్ మోర్ కండీషన్" అంది ఆ కవర్ అంది ఆ కవర్ అందుకోకుండానే లూసీ.

"వన్ మోర్ కండీషనా? ఏమిటదీ?"

ఒక్కక్షణం యిబ్బందిగా శ్రీకర్ వైపు చూసింది. ఆమెకెలా చెప్పాలో అర్థం కాలేదు.

"పర్లేదు లూసీ చెప్పు..ఏమిటా వన్ మోర్ కండీషన్" అడిగాడు శ్రీకర్.

"నా నుంచి మీరు ఏమీ ఎక్స్ పెక్ట్ చేయకుండా ఈ వుద్యోగం యివ్వాలి"

ఒక్కక్షణం దెబ్బతిన్నట్టు చూసాడు శ్రీకర్.

"సారీ సర్..." అంది శ్రీకర్ ఫీలింగ్ చదివేసినట్టు.