హలో... రాంగ్ నెంబర్.! - 56

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 56

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

ప్రియంవద కళ్ళజోడు బెడ్ పక్కనే వున్న డ్రెస్సింగ్ మిర్రర్ మీద పెట్టి కళ్ళు మూసుకొని పడుకొంది. శ్రీకర్ అటువైపు తిరిగి వున్నాడు.

సన్నజాజుల పరిమళం ఆ గదంతా వ్యాపించింది. ఎప్పుడూ రెండు మూరలూ మించి జడలో పెట్టుకోని ప్రియంవద ఆ వేళ అయిదారు మూరలు పెట్టుకుంది. పైగా మంచం మీద చల్లింది. ఆ విషయం కొద్దిగా ఆలస్యంగా గమనించాడు శ్రీకర్.

మ్యూజికల్ బెడ్ లైట్ ఆన్ చేసింది ప్రియంవద. ఆ తర్వాత శ్రీకర్ కు దగ్గరగా జరిగింది. శ్రీకర్ శరీరానికి ప్రియంవద శరీరం తగులుతోంది. అతనిలో చిన్న హోప్. ప్రియంవద తన నిర్ణయం మార్చుకుందా? సెకండ్ థాట్ వుందా?

శ్రీకర్ అలా ఆలోచిస్తూనే ప్రియంవద వైపు తిరిగాడు. ప్రియంవద కళ్ళు మూసుకుంది. మూసుకున్నట్టు నటించింది.

"ప్రియా..." అంటూ ఆమె భుజం తట్టి పిలిచాడు శ్రీకర్. ప్రియంవద తనకు వినిపించనట్టే వుండిపోయింది. అంతటితో ఆగకుండా వెల్లకిలా తిరిగి రెండు చేతులను పైకి పెట్టింది. ఆ భంగిమలో ప్రియంవద అతనికి అభిసారికలా తోచింది.

"వాడా...ప్రియంవదా...ప్రియా..ప్రియతమా..." కాసింత మార్దవాన్ని రంగరించి రొమాంటిక్ టచ్ తో పిలిచాడు శ్రీకర్.

"అబ్బ...వెధవ ఉక్క...' అంది కొంగును తీసి ఫ్యాన్ లా ఊపుకుంటూ.

"నీకిది భావ్యం కాదే ప్రియంవదా..." అన్నాడు శ్రీకర్.

"మీరా..ఏంటి..ఎంతసేపట్నుంచి ఇలా చూస్తున్నారు" అంది అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు కొంగును నిండుగా ఒంటికి చుట్టుకుంటూ.

'ఏంటీ...బాడీని ప్యాక్ చేస్తున్నావా? ఇప్పుడే కదా...పీకి పాకాన పెట్టావు...అంతలోనే ప్యాకింగా..."

ఆవులిస్తున్నట్టు నటిస్తూ "నాకు నిద్రొస్తోంది" అంది.

"నాకు మూడొస్తుందే.." అన్నాడు శ్రీకర్.

"మీకు గాళ్ ఫ్రెండ్స్ బోల్డుమంది కదా...ట్రయ్ చేయండి" అంది మత్తెక్కించేలా చూస్తూ.

"నన్నెలా హింసిస్తున్నావే. ఏదో ఒకటి తేల్చి చెప్పు..టెన్షన్ తో ఛస్తున్నాను" అన్నాడు శ్రీకర్.

"ఏంటి చెప్పేది..మిడ్ నైట్ మసాలా క్యాసెట్టు..మన అగ్రిమెంట్ మరిచిపోయారా?" అంది ప్రియంవద.

"మరలాంటప్పుడు ఈ ఎక్స్ పోజింగేమిటి?" అడిగాడు శ్రీకర్ అయోమయంగా.

"టెంప్టింగ్ ..టెంప్టింగ్ టెస్ట్..."

"టెస్టా..నా బ్రతుకు ఇంత వారెస్ట్ అవుతుందనుకోలేదు. ఏదో ఒకటి తేల్చి చెప్పు....నేనిప్పుడు పడుకునేదా ....సెకండ్ థాట్ ఏమైనా వుందా? మధ్యలో నిద్రలేపితే ఊర్కోను" చివరి ప్రయత్నంగా అన్నాడు.

"ఛీ...ఛీ...బబ్లూ లాంగ్వేజ్ ఎక్కువైంది. మీ రక్తంలో అన్నీ బబ్లూ సేల్సే..." అంది ప్రియంవద.

"అనవే అను..ఛాన్స్ నీది..వెదర్ అలా వుంది...టైం చూసి, వెదర్ చూసి..ఫిగర్ చూపి భలే రివేంజ్ తీర్చుకున్నావు" అన్నాడు అటువైపు తిరిగి.

"నిద్రపోతున్నారా..." అడిగింది ప్రియంవద.

"హాస్పిటల్ లో కనిపించిన వ్యక్తిని ఎలా వున్నారని పలకరించినట్టు..పోలీస్ స్టేషన్ లో కనిపించే వ్యక్తిని కులాసా...అని పరామర్శించినట్టు, సినిమా హాలులో కనిపించే వ్యక్తిని 'సినిమాకా?" అని అడిగినట్టు 'పడుకున్నారా?' ఏంటి...పడుకుంటే ఎలా చెబుతాను...ఇంకా పడుకోలేదు..చెప్పు..సెకండ్ థాట్ వుందా?" ప్రియంవద వైపు తిరిగి అడిగాడు.

"ఒకే ఒక కండీషన్ మీదైతే..." అంది ప్రియంవద.

"కండీషన్లే కదా...గాన్ విత్ ద విండ్..చెప్పు...చెప్పు" అన్నాడు ప్రియంవద నడుంమ్మీద చేయి వేసి.

"మీరు ఓడిపోయినట్టు ఒప్పుకుంటే..." అంది ప్రియంవద.