హలో... రాంగ్ నెంబర్.! - 53

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 53

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

ఇన్స్పెక్టర్ చండి అసహనంగా ఉంది. అప్పటికే నాలుగు నిమిషాలు దాటింది. నాయర్ క్యాబిన్ వైపు చూస్తోంది. లోపల వున్న క్లయింట్ ఎప్పుడు బయటకు వస్తాడా? అన్న టెన్షన్ వుంది. నాయర్ ని కలుసుకోబోతున్నందుకు ఒక విధమైన ఫీలింగ్ ఆమెను చుట్టుముట్టింది.

"మేడమ్....మీరు వెళ్ళండి" చెప్పింది రిసేప్సనిస్ట్. ఇన్స్పెక్టర్ చండి క్యాబిన్ వైపు నడిచింది.

నాయర్ గంభీరంగా ఫైల్లో తలపెట్టాడు.

ఇన్స్పెక్టర్ చండి ఒక్కక్షణం నాయర్ వైపు చూసింది. అతను ఫైల్ చూడ్డం లేదని, ఫైలు చూస్తున్నట్టు నటిస్తున్నాడని, అతను ఫైలును తలకిందులుగా చేసి పట్టుకోవడంలోనే అర్థమైంది.

చిన్నగా దగ్గింది ఇన్స్పెక్టర్ చండి. ఫైలు టేబుల్ మీద పెట్టి..." ఓహ్ మీరా..రండి" అన్నాడు.

"మీ క్యాబిన్ లోకి వచ్చి రెండు నిమిషాలైంది" అంది చండి.

"ప్లీజ్ బీ సీటెడ్" అన్నాడు నాయర్. చండి అతని ఎదురుగా కూచుంది.

"చెప్పండి" అన్నాడు నాయర్.

"మీరు చేబుతారనే వచ్చాను" అంది చండి.

"ఏదైనా మా డిటెక్టివ్ ఏజెన్సీ హెల్ప్ కావాలా?" అడిగాడు నాయర్.

"మా డిపార్ట్ మెంట్ కు మీ దయవల్ల అలాంటి అవసరం ఏమీ కలగలేదు."

"ఎనీ పర్సనల్ ప్రాబ్లమ్"

"యస్...ఓ వ్యక్తి నన్ను ప్రేమించడం లేదు. పెళ్ళి చేసుకోమంటే కుదర్దు అంటున్నాడు..పదేళ్ళుగా"

"ప్రేమించుకోవడం...పెళ్ళిచేసుకోవడం అతనిష్టం...దానికి నేనేం చేయగలను"

"అతనికి బుద్ధి చెప్పడం. తలమీద బట్టతల...ఒంటి మీద కోటు, పెదవుల మధ్య సిగార్ వుంటే సరిపోదు, పక్కన ఓ పెళ్ళాం ఈ వయసులో వుండకపోతే కష్టం అని చెప్పండి" ఉలిక్కిపడ్డాడు నాయర్. ఆ సెటైర్ తన మీదే అని అర్థమైంది.

"చండీ...మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోలేను"

"పోనీ..ఇంకెవరినైనా చేసుకుంటారా?" అడిగింది.

"నిన్ను తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోవడమా..." అని నాలిక్కర్చుకుని....

"ఎవర్నీ చేసుకోను...నాకసలు పెళ్ళి చేసుకునే ఉద్దేశమే లేదు."

"ఇప్పుడా ఉద్దేశాన్ని పెట్టుకోండి. మీకు సరిగ్గా సంవత్సరం గడువు యిస్తున్నాను. ఈలోగా మీరు పెళ్ళి చేసుకోకపోతే... మా లాకప్ లోనే ఉరివేసుకుని, నా చావుకు మీరు కారణం అని వుత్తరం రాసి ఛస్తాను" అంది చండి.

"ఛ..ఛ...అవేం మాటలు" అన్నాడు ఈలోగా బాయ్ వచ్చి చికెన్ పిజ్జాలు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.

"తీసుకో చండి. నీకు చికెన్ పిజ్జాలు యిష్టంగా...రెండూ నీ కోసమే"

చండి నాయర్ వైపు చూసి చెప్పింది "ఇప్పుడు మానేసాను. ఇవి తినీ, ఇలా అయ్యాను...అప్పుడెలా వుండేదాన్ని?"

"ఛ..ఛ...నువ్వెంత లావుగా వున్నా...నాకు యిష్టమే చండీ" ఆరాధనా పూర్వకంగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు.

"ఐ టూ..." అంది చండి.

వెంటనే నాయర్ సర్దుకుని...సారీ...మనిద్దరి మధ్యా ఏ అటాచ్ మెంటూ లేదు"

చండి కోపంగా లేచి, నాయర్ వైపు చూస్తూ...

"సంవత్సరం తిరిగేలోగా మిమ్మల్ని పెళ్ళి చేసుకోలేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు" అంటూ విసురుగా బయటకు నడిచింది.

నాయర్ లేచి చండి కూచున్న కుర్చీ మీద చేతులు వేసాడు. అతనిలో గమ్మత్తయిన ఫీలింగ్.

ఐ లవ్ యూ చండీ మనసులో అనుకున్నాడు.

*             *             *

"సార్ మీకోసం ఎవరో లూసీ అనే ఆవిడ వచ్చారు" చెప్పింది రిసెప్షనిస్టు.

శ్రీకర్ వెంటనే పంపించమన్నాడు.

రెండు నిమిషాల తర్వాత క్యాబిన్ డోర్ తెరుచుకున్న శబ్దం.

ఎదురుగా లూ...సీ..