హలో... రాంగ్ నెంబర్.! - 40

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 40

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

హలో...రాంగ్...నెంబర్..!

"డాడీ...ఇవ్వాళ నువ్వు కొత్త డాడీలా అనిపిస్తున్నావు" అన్నాడు బబ్లూ.

"ఛ...ఛ...కొత్తడాడీలా అనొద్దు. బ్యాడ్ మీనింగొస్తుంది. కొత్తగా కనిపిస్తున్నారు అనాలి" సరిచేసాడు శ్రీకర్.

"సర్లే డాడీ...నిన్న రాత్రి నాకో మంచి ఐడియా వచ్చింది డాడీ...టీవీ సీరియల్ కి మంచి కథ"

"నువ్వు సీరియల్స్ కు కథలు రాయడమేమిట్రా. ముందు బుద్ధిగా టిఫిన్ చేయ్ డైనింగ్ టేబుల్ దగ్గర టీవీ కబుర్లు వద్దు" శ్రీకర్ కొడుక్కి చెప్పాడు.

"అదేంటి డాడీ...చాలా బ్రిలియంట్ ఐడియా పోనీ నన్ను కారులో స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తావుగా అప్పుడు కారులో చెబుతా"

శ్రీకర్ తలూపడంతో బబ్లూ బుద్దిగా టిఫిన్ టిఫిన్ చేయసాగాడు.

శ్రీకర్ తనకిష్టమైన ఆనియన్ దోశకోసం ఎదుర్చూస్తున్నాడు. ప్రియంవద దోశలు వున్న ప్లేటు తెచ్చి శ్రీకర్ ముందు పెట్టింది శబ్దం చేస్తూ.

శ్రీకర్ దోశ తినబోతూ మొహంలో క్వశ్చన్ మార్క్ ఎక్స్ ప్రెస్ చేస్తూ ప్రియంవద వంక చూసి అడిగాడు.

"వేరీజ్ ఆనియనూ..."

"గాన్ విత్ ద విండ్" అంది ప్రియంవద.

"అదేంటి...నాకు ఆనియన్ దోశ ఇష్టమని తెలుసుగా" శ్రీకర్ అన్నాడు.

"ఇప్పటికే రొమాన్స్ ఎక్కువైంది. ఇంకా ఆనియన్స్ దట్టిస్తే కష్టమే. చట్నీ రుచి కూడా చూడండి"

శ్రీకర్ భయపడుతూనే చట్నీ రుచి చూసాడు. ఉప్పులేకుండా చప్పగా ఉంది.

"ఇదేంటి చట్నీలో ఉప్పు లేదు"

"ఉప్పు ఎక్కువైతే కోరికలు పెరుగుతాయట మొన్న టీవీలో చెప్పారు" లోగొంతుకతో చెప్పింది కిచెన్ లోకి వెళ్తూ.

వెంటనే భార్య వెనకాలే కిచెన్ లోకి వెళ్ళి ఒసే...ప్రియా...నేను నీ మొగుడ్నే...నన్నెందుకిట్లా కాల్చుకు తింటావ్...ఆకలితో ఛస్తాను"

"అయితే మీకు అమ్మాయిల్తో వున్న రిలేషన్స్ ఫస్ట్ చెప్పండి. బుద్ధిగా ఒప్పుకోండి."

"ఈ లింకేమిటే. పోనీ కాఫీ యివ్వు..." ప్రియంవద కాఫీ కలిపి మొగుడికి యిచ్చింది.

శ్రీకర్ సిప్ చేసి "ఛీ..ఛీ..కాఫీ చేదుగా వుంది. షుగర్ వేయలేదా?"

"లేదు...చేదుగానే బావుంటుంది. అంతగా కావాలంటే చేదు కాఫీ యిక్కడ తాగి, బయట అమ్మాయి పెదవుల మీద ముద్దుపెట్టుకోండి. బాలెన్స్ అవుతుంది. అసలే రొమాంటిక్ హీరో కదా"

శ్రీకర్ భార్య వంక చూసాడు. ఆమె మొహంలో ఏ రియాక్షనూ లేదు.

"కట్టుకున్న మొగుడ్ని ఇలా కాల్చుకుతింటే ఏడేడు జన్మల వరకూ నాలాంటి మొగుడు దొరక్క అవస్థ పడతావు" అన్నాడు తర్జని చూపిస్తూ శ్రీకర్.

"రొంబ థాంక్స్" అంది ప్రియంవద.

బబ్లూని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీసుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు శ్రీకర్. బబ్లూ హుషారుగా ముందు సీట్లో కూచున్నాడు.

"ఒరే బబ్లూ...నీకు నాతో కారులో స్కూల్ కు రావడం అంటే చాలా యిష్టమా?" అడిగాడు డ్రైవ్ చేస్తూ శ్రీకర్.

"అవును డాడీ. చాలా యిష్టం"

"ఎందుకని, నేనంటే అంత ప్రేమా"

"నువ్వయితే నేను చెప్పే టీవీ సీరియల్స్ కథలు వింటావు. బస్సులో, ఆటోలో అయితే ఎవరూ వినరు" బబ్లూ అసలు విషయం చెప్పాడు.

"హు..కొడుకు..భార్య...ఇద్దరూ తనమీద సెటైర్లు వేసే వాళ్ళే అనుకున్నాడు శ్రీకర్.

"డాడీ...నేనో కథ చెబుతానని చెప్పానుగా వింటావా?"