హలో... రాంగ్ నెంబర్.! - 36

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 36

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"మిస్ సిటీ షాలినా? రోడ్డు మీద బలబడ్డమా? వాటే షేమ్. వెంటనే కారులోకి రమ్మను" ఎక్సయిట్ అయిపోతూ చెప్పాడు శ్రీకర్.

డ్రైవర్ వెళ్లి షాలినికి విషయం చెప్పాడు. షాలిని విలాసంగా నడుచుకుంటూ శ్రీకర్ కారు దగ్గరకు వచ్చింది.

"ఓహ్ ...వెల్ కమ్ మిస్ షాలిని..." చెప్పాడు చిరునవ్వుతో.

"థాంక్యూ" అంది శ్రీకర్ వైపే చూస్తూ. షాలిని శ్రీకర్ కు షేక్ హ్యాండిస్తూ శ్రీకర్ చేతిని గట్టిగా నొక్కి వదిలింది.

"వాహ్...వాటే స్వీట్ టచ్' మనసులో అనుకున్నాడు శ్రీకర్. సరిగ్గా అదే సమయంలో ప్రియంవద ఆటోఅటువైపు వస్తోంది. ఆటోలో నుంచి రోడ్డు మీదికి చూస్తోన్న ప్రియంవదకు శ్రీకర్ కనిపించాడు. రోడ్డు పక్కగా కారు ఆపి, ఓ అమ్మాయితో చేతిలో చేయివేసి మాట్లాడుతున్న దృశ్యం చూడనే చూసింది.

"ఆటోను ఓ పక్కగా కాసేపు ఆపు" చెప్పింది ప్రియంవద. ఆటో డ్రైవర్ ప్రియంవద చెప్పినట్టే చేశాడు.

రెండు నిమిషాల్లో భర్తతో పాటు మరో స్త్రీ కారులో వెళ్లడం చూసింది.

"ఆ కారును ఫాలో చేయి" చెప్పింది ప్రియంవద. శ్రీకర్ కారును ప్రియంవద ఎక్కిన ఆటో ఫాలో అవుతోంది.

*              *             *

సాయంత్రం ఎనిమిది కావస్తోంది.

"నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను" కారు డ్రైవ్ చేస్తూనే షాలిని వైపు చూస్తూ అన్నాడు శ్రీకర్.

"మనం కారులో బయల్దేరి తాజ్ లో లంచ్, ఒబెరాయ్ లో స్నాక్స్, కాకతీయలో డిన్నర్ తీసుకున్నాం. కొన్ని గంటలపాటు పక్కపక్కనే...అఫ్ కోర్స్ దగ్గరగా తగులుతూ కూచున్నాం. అయినా ఇంకా నమ్మలేకపోతున్నారా?" అడిగింది షాలిని శ్రీకర్ వంక సమ్మోహనంగా చూస్తూ. (చూసి నట్టు నటిస్తూ)

"ఓహ్...డెడ్ బాడీని సైతం బెడ్ మీదికి రప్పించే మాగ్నెటిక్ లుక్కు మీది" అన్నాడు ఆమె తనవైపే చూడ్డం గమనించి.

"ఓహ్...మీ కాంప్లిమెంట్స్ కు థాంక్స్. నన్ను మరీ పొగిడేస్తున్నారు" అంది అతనికి మరి కాస్త దగ్గరగా జరిగే ప్రయత్నం చేస్తూ.

కారు లెఫ్ట్ కు టర్న్ అయింది.

"అదిగో కనిపించే ఆ ఆ రైట్ బిల్డింగ్ ముందు ఆపండి" చెప్పింది షాలిని.

"అరె.....అప్పుడే మీ ఇల్లు వచ్చిందా?" అంటూ షాలిని చెప్పిన ఇంటిముందు కారు ఆపాడు.

"ప్లీజ్ వెల్ కమ్..." అంది కారు దిగి షాలిని.

"ఇంట్లోకా...మనసులోకా?" అడిగాడు శ్రీకర్.
"మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారు. టు బి ఫ్రాంక్...అసలు ఇవాళ నాకు టైమే తెలియలేదు" అంది షాలిని.

"ఈరాత్రి కూడా ఐస్ క్రీమ్ కరిగిపోయేలా చేయనా?" చిన్న ఆశతో అడిగాడు.

"నాట్ నౌ..ఇవాళ మా ఇంట్లో రిలేటివ్స్ వున్నారు"

డిసప్పాయింట్ అయినట్టు మొహంపెట్టి అన్నాడు శ్రీకర్ "గుడ్ నైట్"

*                        *              *

"మేడమ్ ! ఇక నా వల్లకాదు. ఉదయం నుంచీ ఆ కారును ఫాలో అవడంతో నా చేతులు పచ్చిపుళ్లనుకోండి" ఆటో డ్రైవర్ నీరసంగా అన్నాడు.

ఉదయం ఉంచీ శ్రీకర్ కారును ఫాలో అవుతూనే వుంది ప్రియంవద ఆటోలో. వాళ్లు హోటల్ కు వెళ్ళినప్పుడు ఆటో డ్రైవర్ ని టిఫిన్ చేసి రమ్మని పంపింది. భర్త సంగతి అటో ఇటో తేల్చే పనిలో అతడ్ని అనుసరించింది. మధ్యలో ఇంటికి ఫోన్ చేసి బబ్లూ గురించి వాకబు చేసింది.

ప్రియంవదకు కూడా చాలా నీరసం వచ్చేసింది.

"నువ్వో పనిచెయ్. ఆ కారుకన్నా ముందే నేను చెప్పిన అడ్రస్ కు పోనివ్వు" చెప్పింది ప్రియంవద.

ఆటో డ్రైవర్  ప్రియంవద చెప్పిన అడ్రస్ ప్రకారం ఆమె ఇంటిముందు ఆటో ఆపాడు.

ప్రియంవద మీటర్ తో నిమిత్తం లేకుండా అతను అడిగిన ఎమౌంట్ కన్నా ఎక్కువే ఇచ్చింది. ఆమె ఇంట్లోకి వెళ్లబోతుంటే అడిగాడు ఆటో డ్రైవర్.

"మేడమ్ చిన్న డౌట్...ఇంతకీ మీరు ఆ కారులోని వ్యక్తిని ఎందుకు ఫాలో అయ్యారు? ఆయనెవరూ?" చిన్నపాటి ఆసక్తితో అడిగాడు.

వెంటనే ప్రియంవద "ఎవరికీ చెప్పావు కదా" అంది.

"చెప్పను మేడమ్."

"మొన్న ముంబయ్ లో టాక్సీ బాంబుల గురించి చదివావా?"

"చదివాను మేడమ్. మా బామర్ది వేలువిడిచిన చిన్న తమ్ముడి కొడుకు ఆ టాక్సీ బాంబు దాడిలో గాయపడ్డాడు కూడా"

"టాక్సీ బాంబులు అతనే పెట్టాడేమోనని అనుమానం వచ్చి ఆ కారును ఫాలో అవమని చెప్పాను."

ఆటో డ్రైవర్ మొహంలో చిన్నపాటి భయం.

"మరి అతనేనా మేడమ్?"

"ఊహూ...అతను టాక్సీల్లో బాంబులు పెట్టే రకం కాదు.." అంది ప్రియంవద.

ఆటో డ్రైవర్ బుర్రగోక్కుని వెళ్లిపోతుంటే మనసులో కసిగా అనుకుంది 'భార్య గుండెలో బాంబు పెట్టే మొగుడు.'

*          *            *