హలో... రాంగ్ నెంబర్.! - 11

Get latest telugu famous comedy serials Hello Wrong Number , telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 11

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

తనకోసం తెచ్చిన ప్లే స్టేషన్ - టు చూసి హేపీగా ఫీలయ్యాడు. బబ్లూ. ప్రియంవదకు భర్త తెచ్చిన చీరలు బాగా నచ్చాయి. కానీ ఆమెలో ఓ చిన్న అనుమానం...ఆ చీరలు తనే సెలక్ట్ చేసాడా? చీరలు సెలక్ట్ చేసే నెపంతో మరో అమ్మాయితో సెలక్ట్ చేయించాడా?

"డాడీ..ప్లే స్టేషన్ - టు సూపర్" అన్నాడు బబ్లూ.

"ఇంకేం వెంటనే వెళ్లి ఆడేసుకో" చెప్పాడు శ్రీకర్. మొగుడి వంక కోపంగా చూసింది ప్రియంవద.

"ఏంటీ అలా చూస్తావు? నేను వాడిని చదువుకోకుండా చెడగొడుతున్నానని నీ వుద్దేశమా?" ఆమె చూపును సరిగ్గానే అర్థం చేసుకుని అడిగాడు.

"డౌటా?" అంది ప్రియంవద.

టాపిక్ ఎక్కడికో వెళ్తోందని వెంటనే ఆ టాపిక్ ని డైవర్ట్ చేసాడు. బబ్లూ ప్లేస్టేషన్ ని తన రూమ్ లోని టీవీకి కనెక్ట్ చేయడంలో నిమగ్నమయ్యాడు.

*               *             *

"అవునూ...నీకోసం తెచ్చిన చీరలు ఎలా వున్నాయో చెప్పనే లేదు" ఆమె ఒంటి మీద వున్న చీరను తొలగించబోతూ అడిగాడు శ్రీకర్.

"చీరలు బాగానే ఉన్నాయి. కానీ ఈ చీరలు సెలక్ట్ చేసింది ఎవరా అని నాకు చిన్న డౌట్" భర్త మొహంలోకి పరిశీలనగా చూస్తూ అడిగింది ప్రియంవద.

"కట్టుకునే చీర ముఖ్యం. కట్టుకున్న వాడు చీర తీసుకురావడం ముఖ్యం. మధ్యలో చీర సెలక్ట్ చేసేవాళ్లు మిధ్య" అన్నాడు ఆమె చీర కుచ్చెళ్ల మీదికి చేయి పోనిస్తూ.

"ఇదేమిటి?" అతను చేసే పనిని ఎంజాయ్ చేస్తూనే అడిగింది.

"కంటికి కన్ను, పంటికి పన్ను, చీరకు చీర...ఈ చీర తీసేసి దుబాయ్ చీర కడితే ఎలా వుంటావో చూడామణి..." అతని చేతి వేళ్ళు ఆమె పొట్టమీద, నాభి మీద శృతి మీటుతూ శృంగారాన్నాలపిస్తున్నాయి. ఆమె నించి విడివడిన చీర తిరిగి ఆమెను చేరడానికి అరగంట పట్టింది.

*              *            *

"చీరకూ చీరకూ మధ్య అరగంట గ్యాపా?" అంది మంచం పక్కనే వున్న టీపాయ్ మీద పెట్టిన కళ్లజోడు పెట్టుకుంటూ.

శ్రీకర్ కూడా కళ్లజోడు పెట్టుకుని, నుదుట చెదిరిన ఆమె కుంకుమని పెదవులతో సరిచేస్తూ, "భార్యలు టికిలీలు పెట్టుకోకపోవడంతో భర్తలకు ఈ రకమైన సౌలభ్యం వుంది" అన్నాడు.

ఆ సమయంలోనే వాళ్ల రొమాంటిక్ మూమెంట్స్ ని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మోగింది. ఆమె మీదుగా వంగి ఫోన్ అందుకుని

"హలో..." అన్నాడు.

నో రెస్పాన్స్.

ఫోన్ మరోసారి మోగింది. అప్పుడు గమనించాడు...అది తన సెల్ అని.

ప్రియంవద మొగుడి వైపు చూసింది. శ్రీకర్ వెంటనే సెల్ ఆఫ్ చేసాడు.

*              *                 *

"ప్రియా..."

"నేనిప్పుడు ప్రియతమా అనాలా?" అడిగింది ప్రియంవద.

"నువ్విప్పుడు ఎంతందంగా వున్నావో తెలుసా? డెడ్ బాడీని సహితం బెడ్ మీదికి రప్పించే స్టన్నింగ్ స్ట్రక్చర్ నీది" ఆమె నడుం వంపు మీద డివైడెడ్ బై ప్రాక్టీసు చేస్తూ అన్నాడు.

"ఈ డైలాగ్ ఇప్పటి వరకూ ఎందరితో చెప్పారేంటి?"

అడిగింది భర్త మొహంలోకి చూస్తూ.

*             *                    *