Rating:             Avg Rating:       416 Ratings (Avg 3.00)

తాతా ధిత్తై తరిగిణతోం 30

తాతా ధిత్తై తరిగిణతోం 30

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials, telugu serial comics and latest jokes online

 

"ఇప్పుడే ఎయిర్ పోర్ట్ లో 'చెకౌట్. కాగానే స్ట్రెయిటవే టాక్సీలో ఇక్కడి కొచ్చేశా. బైదిబై నీ జేబులో ఓ వెయ్యిరూపాయిలుంటే టాక్సీ డ్రైవర్ కిచ్చి పంపు. నా దగ్గరన్నీ డాలర్సున్నాయి."

పర్సులోంచి వందనోటు తీసి నౌకరుకి అందించాడు. విష్ణుమూర్తి...వాటిని టాక్సీ డ్రైవర్ చేతిలో పెట్టి డిక్కీలో వున్న సామాన్లు లోపలకు తెచ్చాడు నౌకరు.

"వీడు మా సుపుత్రుడు. మీ పెళ్లికి వీడు నెలల పిల్లాడు." పక్కనే గోళ్ళు కొరుక్కుంటూ నిలబడివున్న కొడుకుని పరిచయం చేస్తూ చెప్పాడు హనుమంతుడు.

"నీ పేరేమిటోయ్ పేరు బలే విచిత్రంగా వుందే టినోపాల్ లాగా."

"అబ్బే అదేంకాదు బావా. వీదిపేరు గోపాలం. అమెరికాలో అందరూ వీణ్ణి 'పాల్' అని పిలుస్తారు. విడమరిచి చెప్పాడు హనుమంతుడు.

ఆ పూట భోజనాలయ్యాక వాళ్లు, మళ్లీ కబుర్లలో పడ్డారు "నీకు తెలుసుగా బావా! నేను ఫ్యామ్లీతో అమెరికావెళ్లిన మూడేళ్ళ వ్యవధిలోనే అమ్మా నాన్న  నా

గురించి బెంగ పెట్టుకుని కన్ను మూశారు. నా దురదృష్టం కొద్ది వాళ్లకు తలకొరివి కూడా పెట్టలేకపోయాను. అయినా సరే, ఇండియా వచ్చి నాకంటూ మిగిలిన చెల్లెమ్మని ఒక్కసారి చూడాలని ఎన్నో సార్లు అనుకునేవాణ్ణి! కాని బిజినెస్ వ్యవహారాల్లో పడి బిజీ అయిపోయాను. తీరా వీలుచూసుకునే వద్దామనుకునే సరికి చెల్లాయి బేబిని ప్రసవించి చనిపోయిందన్న వార్త తెలిసింది. అంతే ఇంక ఇండియా అంటేనే విరక్తి భావం ఏర్పడి పోయింది."

దిగులు నిండిన స్వరంతో చెప్పాడు హనుమంతుడు.

"పోన్లే ఇప్పటికైనా మాతృభూమి మీద కాలు పెట్టావ్. సంతోషం అవునూ? నీ భార్యను కూడా తీసుకురాలేకపోయావా...ఆమె పేరు సుభద్ర కదూ?"

గుర్తుచేసుకుంటూ అడిగాడు విష్ణుమూర్తి.

హనుమంతు వదనంలో విషాదం నిండిపోయింది ఆ క్షణాన "అవును బావా సుభద్రే. కానీ ఇక్కడకు రాలేనంత దూరం వెళ్ళిపోయింది." బరువుగా చెప్పాడు.

దిగ్ర్బాంతిగా చూశాడు విష్ణుమూర్తి. 

ఇంతలో హనుమంతుడు చెప్పాడు.

"అప్పట్లో న్యూయార్క్ లోని 'వరల్డ్ ట్రేడ్ సెంటర్' మీద తీవ్రవాదుల దాడి జరిగింది గుర్తుందా?"

"అవును. విమానం 'ట్రేడ్ సెంటర్' లోకి దూసుకుపోయి పేలిపోవటం, ఆ భవనం నేల కూలటం అదంతా టీవిలో చూపించారు."

"అందులోనే...ఆ భవనంలోనే సుభద్ర 'జాబ్' చేసేది ఎప్పటిలా ఆ రోజు పొద్దున్నే, కంపెనీకి వెళ్ళింది. తను వెళ్ళిన పావుగంటలోనే ఆ ఘోరం జరిగింది. తను పనిచేసే అంతస్తు మొత్తం కుప్పకూలిపోయింది. ఆ శిథిలాల్లోంచి సుభద్ర మృతదేహాన్ని వెలికి తీయటానికే వారం రోజులు పట్టింది." హనుమంతు కళ్ళల్లో కన్నీళ్ళు.

"అయ్యో అయామ్ సారీ...ఈ విషయం నాకు తెలియలేదు."

"అవును బావా నేనే చెప్పలేక పోయాను. చెప్పి మాత్రం ప్రయోజనం ఏముంటుందిలే అనుకున్నాను. ఆ సమయంలో అయినవాళ్లు ఎవరు ఓదార్చినా మనసు  మరింత బాధపడుతుందిగా. అయినా మా ఇంటి అల్లుడిగా నీకు తెలియపరచాలన్న బాధ్యత గుర్తు వచ్చి ఫోన్ చేశాను. కానీ, ఎన్నిసార్లు ప్రయత్నించినా నీ నంబరు రాలేదు."

"రాలేదా...ఆ అవును...అప్పట్లో ఇక్కడి టెలిఫోన్ నెంబర్లన్నీ మారిపోయాయి." గుర్తుచేసుకుంటూ చెప్పాడు విష్ణుమూర్తి.

"ఇట్సాల్ రైట్. పోయిన వాళ్ళ గురించి బాధపడుతూ ఎన్నాళ్ళు కూర్చోగలం?"

"కానీ....సుభద్రకి మనదేశం వచ్చి సెటిలవ్వాలనీ మా గోపాలానికి ఇక్కడి పిల్లనే ఇచ్చి పెళ్ళి చేయాలనీ మహాకోరిగ్గా వుండేది బావా. బ్రతికుండగా దాన్ని ఆత్మ శాంతిస్తుందన్న ఆలోచనతో వచ్చాను. దానికి తోడు ఈ మధ్య పదే పదే చెల్లాయి కూడా నా కలలో కనిపించి కన్నీళ్ళు పెట్టుకుంది." చెప్పటం ఆపి అతని వైపు చూశాడు.

విష్ణుమూర్తి శ్రద్దగానే వింటున్నాడని గ్రహించి మళ్లీ చెప్పసాగాడు.

"మీ బావగారు పెద్దవారై పోయారూ ఆయనకి తోడుగా నువ్వుండకూడదా అన్నయ్యా అంటూ నా వైపు చెల్లాయి దీనంగా చూసింది. 'ఎంతసేపూ డాలర్లూ, డబ్బులు తప్ప ఆప్యాయతలూ, అంతఃకరుణలూ అఖ్ఖర్లేదా? అంటూ నా ముఖం వాచేలా చివాట్లు కూడా పెట్టింది."

"పోన్లే మీ చెల్లాయి కలలో కనిపించిందన్న వంకతోనైనా నన్ను చూసేందుకు కొచ్చావ్ సంతోషం." చిరునవ్వుతో అన్నాడు విష్ణుమూర్తి.