Nannu Tinduvate

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

 

 

(గులేబకావళికథ చిత్రంలోని నన్ను "దోచుకుందువటే " అనే పాటకు పేరడీగా)

నన్ను పీక్కు తిందువటే

అతడు : నన్ను పీక్కు తిందువటే వన్నెల నా భార్యా.

ఆమె : అన్నములో నంజుకుందు నిన్నే నా సూర్యా .....

     నిన్నే నా సూర్యా...

!! నన్ను పీక్కు తిందువటే !!

ఆమె : హరియింతును నీ సొమ్మును సరదాలకు ఖర్చు పెట్టి

     గడ్డిపరకవోలె కర్పూర కళిక వోలె...

     కర్పూర కళిక వోలె.

అతడు : ఎంతటి పగవాడివో నా కొంపముంచినావు నీవు

     కలకాలం ఊడని గొళ్లెమును వేసినావు...

     గొళ్లెమును వేసినావు ...

!! నన్ను పీక్కు తిందువటే !!

ఆమె : నా మనసే గాలము యై నీవే చిరు చేపవుయై

      దొరికినావు బాబూ నిను కొరికి తిందు రోజూ ...

      కొరికి తిందు రోజూ …

అతడు : ఏనాటిదో ఆ పాపం, ఎరుగరాని విధి కోపం

      ఎన్ని యుగాలైనా ఇది వదిలిపోని శాపం...

     వదిలిపోని శాపం...

!! నన్ను పీక్కు తిందువటే !!

హాసం సౌజన్యంతో